Home » Devotional » Facts About Dreams In Telugu
Devotional

Dreams : కలలో ఇది కనిపిస్తే అదృష్టం.. బిచ్చగాడైన కోటీశ్వరుడు అవ్వడం ఖాయం…!

Authored By
aruna
The Telugu News | Updated on: January 27, 2024, 1:03 pm
Advertisement

Dreams : కలలో ఇది కనిపిస్తే అదృష్టం పడుతుంది. బిచ్చగాడు అయినా కోటీశ్వరులు అవ్వడం ఖాయం..మరి ఆ కల ఏంటి మీకు ఏమి కనిపిస్తే మీకు అదృష్టం పడుతుంది అనేది క్లియర్గా తెలుసుకుందాం. గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన పురోగతికి సంబంధించి వచ్చే కలలు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అయితే కలలుపై కొంతమంది విశ్వాసంతో ఉంటారు. మరి కొంతమంది వీటిని అస్సలు నమ్మరు. ఏది ఏమైనా కలలో వచ్చేవి నిజజీవితంలో అస్సలు జరగకపోయినా అది కొంతమందిని సంతోషపరుస్తాయి. కానీ కొన్ని కలలు చెడు జ్ఞాపకాలని మిగులుస్తాయి. స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని కలలు శుభమైన సంకేతాలు ఇస్తాయి…ఎలాంటి కలలు వస్తే అదృష్టం వరుస్తుంది. ఎలాంటి కలలు వస్తే శుభపరిణామాలు నెలకొంటాయి. మరి ఎలాంటి కలలు వస్తే ఏం జరుగుతుందనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Advertisement

బంగారాన్ని కలలో చూడడం అంటే సంపద ఆభరణాలు లాంటి విలువైన వస్తువులను కలిగి ఉండడం అని చెప్తున్నారు. ఇక బంగారాన్ని కలగనడం సంపూర్ణంగా ఉండడాన్ని వ్యక్తికరించవచ్చు. బంగారాన్ని ధరించినట్లు కలగంటే ఆభరణాలు అపార సంపదలు మీ జీవితంలోకి త్వరలోనే వస్తాయని సంకేతం.. మీ కలలో బంగారు బహుమతిని అందుకోవడం కూడా మీకు త్వరలో పనిలో అత్యంత గౌరవమైన స్థానాన్ని సాధిస్తారని చెబుతుంది. మీ కలలో బంగారు కుండను చూడడం మీ కష్టానికి ప్రతిఫలం లభిస్తుందని సూచిస్తుంది. కలలోకి ధాన్యం వస్తే కూడా కలిసి వస్తుంది అని చెప్తారు. ధాన్యాలు భూమి యొక్క పుష్కలమైన వరాలలో ఒకటిగా పరిగణిస్తారు. ధాన్యాల గురించి కలలు కనడం కంటే అదృష్టం మీకు సమృద్ధిగా ఎదురు చూస్తుందని అర్థం అని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొనబడింది.అంతేకాదు మీ కలలో ఎనిమిదవ సంఖ్యను చూడడం అంటే సంపద విజయం భౌతిక లాభాలు చేకూరతాయని అర్థం.

ముఖ్యంగా ఆసియా సంస్కృతులలో ఎనిమిది అనే సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిగణించబడుతుంది. అందుకే కలలో 8 సంఖ్య వస్తే అదృష్టంగా చెప్తారు. కలలో గంభీరమైన డేగలు కనిపిస్తే ధైర్యానికి ప్రత్యేకగా భావిస్తారు. డేగలు కలలో కనిపిస్తే వారి సంకల్పం నెరవేరుతుంది. పక్షుల గురించి కలలు కనడం సాఫల్యం కోసం మీ దృఢ సంకల్పాన్ని తెలియజేస్తుంది. పోరాటాలు ఉన్నప్పటికీ మీరు మీ అత్యున్నత ఆశయాన్ని చేరుకోగలుగుతారు. బాగా వండిన మాంసాన్ని తినడం గురించి కలలు కనడం వల్ల సంపద పెరుగుదలను సూచిస్తుంది. డబ్బు గురించి కలలు కనడం భౌతిక ధన లాభం ఆర్థిక ఆశీర్వాదం యొక్క చిహ్నంగా పరిగణించబడుతుంది. డబ్బు గురించి కలలు మీ శరీరం మనసు యొక్క మొత్తం సంపదగా కూడా అర్థం. మరోవైపు కలలో డబ్బు కనిపిస్తే అదృష్టం మీ వైపు ఉందని మీరు చేసే అన్ని పనుల్లో మీరు విజయం సాధిస్తారని అర్థం. వ్యవసాయ జంతువులైన పశువుల వ్యర్ధాలు పేడ పట్టుకోవడం లాంటివి కలలోకి వస్తే సంపద ఆర్థిక అదృష్టానికి సంకేతం అని చెబుతారు…

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి