Ugadi Festival : ఉగాది నుంచి ఈ రాశుల వారికి ధన ప్రాప్తి.. ఎవరెవరంటే..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Ugadi Festival : ఉగాది నుంచి ఈ రాశుల వారికి ధన ప్రాప్తి.. ఎవరెవరంటే..?

Ugadi Festival  : సాధారణంగా మన హిందూ గ్రహ సంచారంప్రకారం.. ఏ రెండు గ్రహాలు కలిసినా సరే సదరు రాశుల వారికి ధన ప్రాప్తి కలుగుతుంది. అందులోనూ శుక్ర, గురు, బుధ గ్రహాల్లో ఏ రెండు కలిసినా సరే కచ్చితంగా వారికి ధన ప్రయోగం కలుగుతుందని జ్యోతిష్యం చెబుతోంది. ఇక 2024లోని ఏప్రిల్ 9న వచ్చిన ఉగాది సంవత్సరానికి గాను కొన్ని రాశుల వారికి కచ్చితంగా ధన ప్రాప్తి కలుగుతుందని పంచాంగం చెబుతోంది. ఆ రాశులు ఏవి […]

 Authored By ramu | The Telugu News | Updated on :9 April 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Ugadi Festival : ఉగాది నుంచి ఈ రాశుల వారికి ధన ప్రాప్తి.. ఎవరెవరంటే..?

Ugadi Festival  : సాధారణంగా మన హిందూ గ్రహ సంచారంప్రకారం.. ఏ రెండు గ్రహాలు కలిసినా సరే సదరు రాశుల వారికి ధన ప్రాప్తి కలుగుతుంది. అందులోనూ శుక్ర, గురు, బుధ గ్రహాల్లో ఏ రెండు కలిసినా సరే కచ్చితంగా వారికి ధన ప్రయోగం కలుగుతుందని జ్యోతిష్యం చెబుతోంది. ఇక 2024లోని ఏప్రిల్ 9న వచ్చిన ఉగాది సంవత్సరానికి గాను కొన్ని రాశుల వారికి కచ్చితంగా ధన ప్రాప్తి కలుగుతుందని పంచాంగం చెబుతోంది. ఆ రాశులు ఏవి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Ugadi Festival  : వృషభం..

ఈ రాశుల వారికి ఈ ఏడాది బాగానే కలిసి వస్తుంది. ఎందుకంటే లాభస్థానంలో బుధ, శుక్ర గ్రహాలు కలుస్తున్నాయి. దాంతో వీరికి ఏ పని చేసినా సరే లక్ష్మీ కటాక్షం బాగానే ఉంటుంది. దాంతో పాటు పెద్దగా ప్రయత్నం చేయకున్నా సరే ధన ప్రాప్తి కలుగుతుంది. వృత్థి ఉద్యోగాలు చేసుకునే వారికి లాభాలు బాగానే చేకూరుతుంటాయి. వ్యాపారాల్లో లాభాలకు కొదవ ఉండదు.

Ugadi Festival  మిథునం..

వీరికి కూడా రెండు శుభ గ్రహాలు కలుస్తున్నాయి. కాబట్టి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో బాగానే ఆర్థిక లాభం జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తుంటాయి. ఉద్యోగులు మంచి పొజీషన్ కు వస్తారు. వ్యాపార పరంగా బాగానే కలిసి వస్తుంది. కొత్త పరిచయాలు లాభిస్తాయి.

Ugadi Festival  కర్కాటకం..

వీరికి కూడా బుధ, శుక్ర గ్రహాలు కలుస్తున్నాయి కాబట్టి ఆర్థిక పరమైన లాభాలు ఉంటాయి. మంచి జీతాలు తీసుకునే ఉద్యోగాలు పొందుతారు. అంతే కాకుండా నిరుద్యోగులకు ఈ ఏడాది ఉద్యోగాలు కూడా వస్తాయి. వ్యాపారాలు కలిసి వస్తాయి.

Ugadi Festival ఉగాది నుంచి ఈ రాశుల వారికి ధన ప్రాప్తి ఎవరెవరంటే

Ugadi Festival : ఉగాది నుంచి ఈ రాశుల వారికి ధన ప్రాప్తి.. ఎవరెవరంటే..?

Ugadi Festival  ధనుస్సు..

ధనుస్సు రాశి వారికి కూడా శుభగ్రహాలు కలుస్తున్నాయి. కాబట్టి వీరికి ఉద్యోగాల్లో మంచి ఆర్థిక యోగం కలుగుతుంది. అంతే కాకుండా ఆకస్మిక ధన లాభం కూడా కలుగుతుంది. ఏ పని చేసినా వారికి కలిసి వస్తుంది. లాభదాయక మార్గాలు ఏర్పడుతాయి.

కుంభం..

కుంభ రాశి వారికి రెండు గ్రహాలు బాగానే కలిసి వస్తున్నాయి. కాబట్టి వారికి ధన ప్రవాహం బాగానే ఉంటుంది. వీరికి పెద్దగా పనులు చేయకున్నా మాటల ద్వారానే డబ్బులు కలిసి వస్తాయి. అందుకే వీరికి ఈ ఏడు బాగా కలిసివస్తుందని అంటున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది