Chanakya Niti : చాణక్య చెప్పిన విషయాలు పాటిస్తే… ఎలాంటి కష్టాలైనా తెలికే..
Chanakya Niti : అపర మేధావి ఆచార్య చాణక్య నీతి శాస్రం గురించి అందరికీ తెలిసిందే. మానవ జీవన విధానంలో ఎన్నో మార్పులను సూచించాడు చాణక్య. మనిషి స్వార్థం, ప్రేమ, ద్వేషం, ఇతరులను మోసంచేయడం ఆర్థిక విషయాల గురించి చక్కగా వివరించాడు. లక్ష్య సాధనకు ఏవిధంగా కష్టపడాలి.. ఎవరితో ఎలా ఉండాలి. ఎవరికి దూరంగా ఉండాలో తన నీతి శాస్త్రంలో తెలిపాడు. అందుకే ఇప్పటికీ యువత చాణక్య నీతిని ఫాలో అవుతుంటారు. ఈ తరం కూడా ఆయన చెప్పిన అంశాలను పాటిస్తున్నారంటే చాణక్య నీతి ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు.
కాగా చాణక్య కష్టాల నుంచి ఎలా బయటపడాలో వివరించాడు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం… సాధారణంగా సూటిగా ముఖంపైనే మాట్లాడే వ్యక్తులు చాలా మందికి నచ్చరు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే అస్సలు పట్టించుకోరు. కానీ అలాంటి వారే ఎక్కువ ప్రయోజకులు అవుతారని చాణక్య తెలిపాడు. ముక్కుసూటిగా మాట్లాడేవారు నిజాయితీగా ఉంటారని చెప్పాడు. అలాగే ప్రపంచంలో మనీ ప్రాముఖ్యతను వివరించాడు. డబ్బులుంటే అందరూ వస్తారని.. అన్ని విషయాల్లో గుర్తిస్తారని చెప్పాడు. కేవలం డబ్బుతోనే ప్రపంచం నడుస్తోందని.. డబ్బుంటేనే గౌరవిస్తారని చెప్పాడు.
అందుకే కష్టపడి డబ్బును సంపాదించుకోవాలని సూచించాడు.లైఫ్ లో ఎదగాలంటే భయం భక్తి ఉండాలంటారు పెద్దలు.. చాణక్య కూడా ఎదగాలంటే మనిషికి క్రమశిక్షణ ఉండాలని చెప్పాడు. అలా లేకపోతే లైఫ్ లో ఎంత చేసినా గౌరవ ప్రతిష్ఠలు ఉండవని సూచించాడు. క్రమశిక్షణ లేని వ్యక్తి బాధ్యతగా ఉండలేడని ఇతరులను కూడా ఇబ్బంది పెడతాడని చెప్పాడు. అలాగే చదువు మనిషికి ఎక్కడైనా బతకగలిగే హోప్ ఇస్తుందని చెప్పాడు. అందుకే ప్రతి ఒక్కరూ చదువుకుని లక్ష్యసాధనకు కష్టపడాలని సూచించాడు. కోపం, ద్వేషం వినాశాషకాలకు దారితీస్తాయని అటువంటివి దరిచేరనీయకూడదని సూచించాడు.