Black Cat : మన సనాతన సాంప్రదాయాలలో మన తెలుగు వారు నల్ల పిల్లి ఎదురు వస్తే ఆ శుభమని గట్టిగా నమ్ముతారు. భారతీయ సాంప్రదాయాలకు ప్రత్యేకమైన అంశం అయితే కాదు. వేరే దేశాల్లో కూడా నల్ల పిల్లి గురించి ఇలాంటి నమ్మకాలు ఉన్నాయని చూస్తున్నాం. నన్ను పెళ్లి మనం ఏదైనా మంచి పనికి బయటికి వెళుతున్నప్పుడు నల్ల పిల్లి ఎదురు వచ్చింది అని భయాందోళనలకు గురి అవుతుంటారు. ఈ ఆచారాల్ని నమ్మేవారు ఎక్కువగా భయపడతారు.అయితే వీటి వెనుక ఉన్న కథలు, ఆచారాలు, విశ్వాసాలు వివరంగా తెలుసుకుంటే. దాని వెనుక దాగి ఉన్న అసలు నిజాలు మనకు స్పష్టమవుతాయి.
పురాతన కాలం నుంచి కొన్ని కథల్లో నల్లపిల్లి శని శక్తులతో అనుబంధం ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఒక ఉదాహరణకు, వేరే దేశాల్లో నల్ల పిల్లలను ‘విచ్’ లతో అను సంధానం చేయడం జరిగింది. భారతీయ సాంస్కృతిలోనూ, దుష్టశక్తులకి లేదా చెడు సంకేతాలకు ఈ జంతువుల్ని కలిపి చూడడం జరిగిందని తెలుస్తుంది. సాధారణంగా మనం నల్ల పిల్లిని చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది. అది ఒక దుష్ట శక్తి స్వరూపంలో అనిపిస్తుంది. అందుకేనేమో ఆ పిల్లిని చూసిన, ఎదురొచ్చినా అశుభంగా భావిస్తూ ఉంటారు.
నల్ల పిల్లి రాత్రి సమయంలో అంత స్పష్టంగా కనిపించదు. పూర్వకాలంలో చీకటి టైంలో పిల్లి ప్రమాదాలకి కారణమయ్యే అవకాశం ఉండేది. దీనికి గల కారణం భయాందోళనతో జత చేర్చడం, పెళ్లి ఎదురు వస్తే చెడు జరుగుతుందని నమ్మడం మొదలైంది. అలాగే రాత్రిల సమయంలో పిల్లలు ఏడుస్తూ ఉంటాయి. అది కూడా చెడు సంకేతంగా భావిస్తుంటారు. నల్ల పిల్లి రాత్రికి సమయంలో కనపడదు. అది కూడా నల్లగా ఉంటుంది కాబట్టి చీకటిలో కలిసిపోతుంది. దాని కళ్ళు మాత్రం లైట్ లాగా మెరుస్తూ ఉంటాయి. వాటి కళ్ళు మెరుస్తుంటే మనకి చాలా భయంగా అనిపిస్తుంది. కావున పిల్లి ఎదురు వస్తే చాలా భయపడిపోతారు. అశుభంగా భావిస్తారు.
సామాజిక,సాంప్రదాయ అంశాలు : సామాజికంగా ప్రజల్లో ఏదైనా సంఘటన జరగడానికి ముందు ఒక సంకేతం అనిపించే దృశ్యాలు గుర్తుండిపోయేవి. మనం బయటికి వెళ్లినప్పుడు ఒక నల్ల పిల్లి ఎదురు వస్తే, ఆ సమయంలో ఏదైనా మనకు చెడు జరిగి ఉంటే, ఆ పిల్లి ఎదురు రావడం వలన మనకు అలా జరిగింది అనే భావనలో ఉంటాం. అందువల్ల అదే ప్రతిక్రియను కలిగించే ఆ నమ్మకాన్ని అందరిలో బలపరిచింది.
శాస్త్రీయ కోణం .. పిల్లుల ప్రవర్తన : పిల్లలు సాధారణంగా తమ దారిలోకి ఇతర జంతువులు లేదా మనుషులు వస్తే అక్కడే నిలిచిపోతాయి. ఇంకా రాత్రి సమయంలో అయితే మరింత చురుకుగా ఉంటాయి. ఈ నల్ల పిల్లి ఎదురైతే మనం చాలా భయపడి పోతాం. దానికి గల కారణం ఆ పిల్లి యొక్క నలుపు రంగు. దీనివల్ల సాంప్రదాయ నమ్మకాల వల్ల దీనికి అశుభముగా భావించడం జరిగింది.
మానసిక నమ్మకాల ప్రభావం : మన మనసులో ఒక సంఘటన జరిగినప్పుడు అది చెడు అనిపించినప్పుడు దాన్ని అశుభంగా పరిగణిస్తాం. వీటికి గల కారణాలు శాస్త్రీయంగా ఆధారాలు ఏమీ లేవు. మానసిక ప్రభావం వల్ల ఈ నమ్మకం ప్రగాఢంగా ఉంటాయి.
సాంప్రదాయ దృక్పథం : ఇప్పటివరకు అయితే నల్ల పిల్లి ఎదురు వస్తే ఆ శుభం జరిగిందని శాస్త్రీయంగా ఎక్కడా నిర్ధారణ చేసి చెప్పబడలేదు. ఇది వ్యక్తుల యొక్క నమ్మకాలపై మాత్రమే ఆధారపడి ఉంది. పిల్లులు మన పర్యావరణానికి లాభదాయకమైన జంతువులు. అవి ఎలుకలు వంటి జంతువులను వాటి ఆహారం కై తింటుంటాయి. ఈ క్రమంలో వాటి చెడు సంకేతం గా చూడడం న్యాయం కాదు. వాటి ఆహారం కోసం అవి తిరుగుతూ ఉంటాయి ఆ సమయంలో మనకు ఎదురైతే, అశుభంగా భావిస్తుంటాం .
మంచి దృక్పథం : ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, ఈ ప్రపంచంలో ప్రతిదీ ఒక దిశ, సందర్భం తోనే ఉంటుంది. మనకి నల్ల పిల్లి ఎదురు వచ్చినప్పుడు దాన్ని ఒక సాధారణ ప్రకృతి అంశంగా చూడాలి. పిల్లులు మనిషికి హాని చేయవు. ఇది సహజ జీవి, మన పర్యావరణానికి అవసరమైనది. ఇప్పుడు మనకున్న శాస్త్రీయ అవగాహనతో ఈ నమ్మకాల మీద ఆధారపడటం అవసరం లేదు. నల్ల పిల్లి ఎదురొస్తే ఆ శుభం అనేది కేవలం వ్యక్తిగత నమ్మకం మాత్రమే. నల్ల పిల్లి ఎదురొస్తే ఆ శుభమా అనే ప్రశ్నకు సమాధానం వారి వారి యొక్క నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఇది శాస్త్రీయంగా ఎందులోనూ నిరూపించడం జరగలేదు. పిల్లలు కూడా ప్రకృతి రక్షకులలో భాగమే. కనుక నల్ల పిల్లలు ఎదురు వస్తే భయపడకుండా చెడు ఊహించకుండా, మన దారిన మనం కొనసాగించుకోవచ్చు. నల్ల పిల్లి కేవలం తన వర్ణం మాత్రమే భయంకరం. సాధారణ పిల్లులు లాగానే నల్ల పిల్లి కూడా. నల్లని వర్ణం చూసి మనం భయపడిపోయి, అది ఆశుభం అని భావిస్తుంటాం. జానకి అది అంత అశుభకరమైనది కాదని చెప్పవచ్చు.
Venu Yellamma : బలగం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వేణు యెల్దండి తన నెక్స్ట్ సినిమా ఎల్లమ్మ…
Milk : ప్రతిరోజు పాలు తాగటం ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలిసిన విషయమే. పాలు ఎన్ని తాగాలో అన్నదానికంటే.. ఏ…
Keerthy Suresh : మహానటి కీర్తి సురేష్ సినిమాలు ఆపేస్తుందా పెళ్లి తర్వాత కథానాయికలు కొన్నాళ్లు కెరీర్ బ్రేక్ తీసుకోవడం…
Long Hair : మహిళలు పొడవైన జుట్టు ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మందంగా,దృఢంగా, నల్లగా జుట్టు ఉండాలని అందరూ కోరుకుంటారు.…
Ram Charan : గ్లోబల్ స్టార్ రాం చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ Game Changer సినిమా 2025 సంక్రాంతికి…
Okra : తాజాగా పరిశోధనలో తేలింది ఏమిటంటే తాజా కూరగాయలు శరీరానికి ఎంతో మంచి వని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.…
Dishti : సామాజిక సాంస్కృతిలో ఆచారాలు విశ్వాసాలు ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. వాటిలో ఒకటైనది దిష్టి తీసే సంప్రదాయం. ఈ…
Cardamom : ప్రస్తుత సమాజంలో ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ నానాటికి పెరిగిపోతున్నాయి. వీటిని అధిగమించడానికి బయటి మెడిసిన్స్ వాడి సైడ్…
This website uses cookies.