Home » Devotional » If You Do These Things At Night Lakshmi Devi Will Not Leave Your House
Devotional

Lakshmi Devi : రాత్రి పూట ఈ పనులు చేశారంటే .. లక్ష్మీదేవి మీ ఇంటిని విడిచి ఎక్కడికి వెళ్ళదు ..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: December 14, 2022, 7:00 am
Advertisement

Lakshmi Devi : కొంతమంది ఎంత సంపాదించిన ఇంట్లో డబ్బు నిలకడగా ఉండదు. వారికి తెలియకుండానే ఖర్చు అయిపోతుంటుంది. ఆర్థిక పరిస్థితుల విషయంలో ఎప్పుడైనా సరే తెలివిగా వ్యవహరించాలి అని చెబుతూ ఉంటారు. కానీ కొంతమంది ఎంత సంపాదించిన ఆర్థిక సమస్యలు వస్తూనే ఉంటాయి. దీనికి కారణం ఇంటికి వాస్తు దోశాలు ఉండడం వలన అవి ఇంటి పై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. కొంతమంది రాత్రి, పగలు కష్టపడుతూ ఉంటారు. అయినా ఆర్థిక సమస్యలు వెంటాడుతుంటాయి. అలాంటివారికి లక్ష్మి అనుగ్రహం తక్కువగా ఉందని అర్థం. ఆర్థిక సమస్యల నుంచి బయట పడాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉండాలి. అయితే రాత్రి సమయంలో ఈ పనులను చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని జ్యోతిష్యం చెబుతుంది.

Advertisement

1) రాత్రి పడుకునేటప్పుడు వంట గదిలో పాత్రలన్ని శుభ్రం చేసి పడుకోవాలి. అలా చేయడం వలన లక్ష్మీదేవి సంతోషిస్తుంది. కానీ కొంతమంది రాత్రి సమయంలో తిన్న సామాన్లను అలానే ఉంచి పడుకుంటారు. ఇలా చేయడం వలన లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. రాత్రి సమయంలో మురికి పాత్రలు అలానే ఉండడం వలన ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి. అందుకే రాత్రి పడుకునే ముందు తిన్న పాత్రలను శుభ్రం చేసి పడుకోవాలి. 2) అలాగే రాత్రి సమయంలో ఇంటి గుమ్మంకి ఎదురుగా చెప్పులు తీసేయాలి. ఇంటి ప్రధాన ద్వారాన్ని శుభ్రం చేయాలి. రాత్రి పడుకునే ముందు కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కొని పడుకునే ముందు ఇంటి దేవత స్మరించుకొని పడుకోవాలి.

If you do these things at night Lakshmi Devi will not leave your house

Advertisement

ఇలా చేయడం వలన మంచి నిద్ర రావడంతో పాటు పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది.3) అలాగే ప్రతిరోజు సాయంత్రం ప్రధాన ముఖ ద్వారం వద్ద నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఇక సాయంత్రం సమయంలో దానధర్మాలు చేయకూడదు. అలా చేయడం వలన దారిద్రానికి దారితీస్తుంది. రాత్రి సమయంలో పాలు, పెరుగు, ఉప్పు ఇతరులకు ఇవ్వకూడదు. ఇలా చేస్తే ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. 4) అలాగే రాత్రి సమయంలో బాత్రూం బకెట్ ఖాళీగా ఉంచకుండా నీళ్లతో నింపి ఉంచాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ఇక రాత్రి సమయంలో పడకగదిలో కర్పూరాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వలన బెడ్ రూమ్ వాతావరణం స్వచ్ఛంగా ఉండడంతో పాటు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి