Chanakya Niti : చాణ‌క్యుడు చెప్పిన ఈ ర‌హ‌స్యాలు పాటిస్తే.. లైఫ్ లో అన్ని సంతోషాలే.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chanakya Niti : చాణ‌క్యుడు చెప్పిన ఈ ర‌హ‌స్యాలు పాటిస్తే.. లైఫ్ లో అన్ని సంతోషాలే..

Chanakya Niti : ఆచార్య చాణ‌క్యుడు త‌న నీతి శాస్త్రంలో ఎన్నో విష‌యాలు చెప్పుకొచ్చాడు. నేటిత‌రం కూడా ఇప్ప‌టికీ చాణ‌క్య నీతిలోని విష‌యాల‌ను ఆచ‌రిస్తున్నారు. చాణ‌క్య తన జీవితంలో ఎదురైన ఎన్నో సంఘటనలను, అనుభవాలను చాణక్య నీతిలో తెలియ‌జేశారు. జీవితంలో అనుకున్న‌ ల‌క్ష్యాల‌ను సాధించాలంటే ఏం చేయాల‌నే దానిపై చ‌క్క‌గా వివ‌రించాడు. ఎలాంటి నియ‌మాల‌ను పాటిస్తే అనుకున్న‌వి సాధిస్తామో చెప్పాడు. ఎవ‌రితో స్నేహం చేయాలి.. ఎలాంటి వారికి దూరంగా ఉండాలి అనే విష‌యాలు వివ‌రించాడు. ఎలాంటి భాగ‌స్వామిని […]

 Authored By mallesh | The Telugu News | Updated on :15 June 2022,7:00 am

Chanakya Niti : ఆచార్య చాణ‌క్యుడు త‌న నీతి శాస్త్రంలో ఎన్నో విష‌యాలు చెప్పుకొచ్చాడు. నేటిత‌రం కూడా ఇప్ప‌టికీ చాణ‌క్య నీతిలోని విష‌యాల‌ను ఆచ‌రిస్తున్నారు. చాణ‌క్య తన జీవితంలో ఎదురైన ఎన్నో సంఘటనలను, అనుభవాలను చాణక్య నీతిలో తెలియ‌జేశారు. జీవితంలో అనుకున్న‌ ల‌క్ష్యాల‌ను సాధించాలంటే ఏం చేయాల‌నే దానిపై చ‌క్క‌గా వివ‌రించాడు. ఎలాంటి నియ‌మాల‌ను పాటిస్తే అనుకున్న‌వి సాధిస్తామో చెప్పాడు. ఎవ‌రితో స్నేహం చేయాలి.. ఎలాంటి వారికి దూరంగా ఉండాలి అనే విష‌యాలు వివ‌రించాడు. ఎలాంటి భాగ‌స్వామిని ఎంచుకోవాలి.. పిల్ల‌ల్ని ఎలా పెంచాలి అనే విష‌యంలో ప‌లు నియ‌మాలు సూచించాడు.

చాణ‌క్య నీతి ప్ర‌కారం లైఫ్ లో సంతోషంగా ఉండాలంటే ఎలాంటి నియ‌మాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం… జుట్టు క‌త్తిరించుకున్నాక త‌ప్ప‌నిస‌రిగా స్నానం చేయాల‌ని పెద్ద‌వాళ్లు సూచిస్తుంటారు. ఇదే విష‌యం చాణ‌క్య త‌న నీతి శాస్త్రంలో తెలిపాడు. సెలూన్ షాప్ కి వెళ్లి వ‌చ్చిన త‌ర్వాత శ‌రీరంపై చిన్న చిన్న‌ వెంట్రుక‌లు ప‌డి ఉంటాయి. ఇలాగే ఉంటే తినే స‌మ‌యంలో శ‌రీరంలోకి వెళ్లే ప్ర‌మాదం ఉంటుంద‌ని చెప్పాడు. అందుకే త‌ప్ప‌నిస‌రిగా త‌ల‌ స్నానం చేయాల‌ని సూచించాడు. అలాగే విప‌రీత‌మైన కోపం ఉండ‌టం మంచిది కాద‌ని చాణ‌క్య తెలిపాడు. కోపం వ‌ల్ల ఆవేశ‌పూరితంగా త‌ప్పులు చేసి త‌ర్వాత బాధ‌ప‌డాల్సి వ‌స్తుంది. ఇది ఇత‌రుల‌కు కూడా ఇబ్బందిగా ఉంటుంది.

If You Follow These Secrets Told By Chanakya Niti

If You Follow These Secrets Told By Chanakya Niti

Chanakya Niti : కోపం అస్స‌లు మంచిది కాదు..

అందుకే కోపం త‌గ్గించుకుని దానివ‌ల్ల వ‌చ్చే అన‌ర్థాలు లేకుండా చూసుకోవ‌చ్చు. అలాగే చాణ‌క్య నీతి ప్ర‌కారం అత్యాశ ఉన్న‌వారు ఎప్ప‌టికీ ఎందులోనూ తృప్తి పొంద‌లేడు. అత్యాశ‌తో త‌ప్పుడు మార్గాల్లో ముందుకు వెళ్తారు. దీంతో భ‌విష్య‌త్తు నాశానం చేసుకుంటారు. అందుకే అత్యాశ‌తో ఉండ‌కూడ‌ద‌ని సూచించాడు. అలాగే ఏదైనా సాధించాల‌నుకుంటే ముందుగా ల‌క్ష్యాన్ని పెట్టుకుని దానికి త‌గ్గ‌ట్టుగా క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాలి. అప్పుడే ల‌క్ష్యాన్ని చేరుకుంటారు. అయితే కొంత‌మంది ఎప్పుడూ అబ‌ద్దాలు ఆడుతుంటారు. దీని వ‌ల్ల కొన్ని సార్లు నిజం చెప్పినా ఎవ‌రూ విశ్వ‌సించ‌రు. అంతేకాకుండా గౌర‌వం కోల్పోతారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది