
Vastu Tips : మీ ఇంట్లో ఈ తప్పులు చేస్తే... రాహు దోషం మిమ్మల్ని వెంటాడడం తద్యం...?
Vastu Tips : చాలామందికి తెలియకుండానే కొన్ని తప్పుల్ని ఇంట్లో చేస్తూ ఉంటారు. అలాగే వాస్తు విషయంలో కూడా అలాగే చేస్తుంటారు. వాస్తు నియమాలు తెలియక ఈ విధమైన తప్పులను చేస్తూ ఉంటారు. వాస్తు శాస్త్రం ఇంటి నిర్మాణ విషయంలో ఏం చెబుతుంది. ఇంట్లో వస్తువులను ఏ దిశలో పెట్టుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. అసలు వాసు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకుందాం…
గదులు ఇలా ప్రతి దానిని దిశా దిక్కులో ఆధారంగా ఏర్పాటు చేసుకొని ఉండాలని సూచిస్తుంది వాస్తు శాస్త్రం. అలాగే వాస్తు ని పట్టించుకోకుండా ఇంటిలో కొన్ని పొరపాట్లు చేసినట్లయితే, ఆ ఇంటికి తప్పక రాహు గ్రహ దోషం తగులుతుంది అని భావిస్తున్నారు వాస్తు నిపుణులు. ఆగ్రహాన్ని తెప్పించే కొన్ని వస్తువులు ఇంట్లో ఈ విధంగా అమర్చిన రాహువు కి విపరీతమైన ఆగ్రహం వస్తుంది. మీరు వెంటనే సరి చేసుకుంటే మీకు కొంతవరకు ఊరట లభిస్తుంది.మరి వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. రాహువు స్థానం క్షమిస్తే ఆ వ్యక్తి జీవితాంతం సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందంట. వ్యక్తి జీవితాంతం సమస్యలను ఎదురుకోవలసి వస్తే, దానికి గల కారణం రాహువు అనుకూలంగా ఉండలేదని అర్థం. కర్మలతో పాటు, ఇంటి వాస్తుకు సంబంధించిన కొన్ని లోపాలు ఉండడం చేత కూడా ప్రజలు తెలిసి తెలియక కొన్ని వాస్తు సంబంధిత తప్పులు చేస్తూ ఉంటారు. దీని కారణంగా జాతకంలో రాహు స్థానం చెడుగా మారుతుంది. కాబట్టి, ఆ ఇంట్లో ఎక్కువగా సమస్యలు తలెత్తుతుంటాయి.
Vastu Tips : మీ ఇంట్లో ఈ తప్పులు చేస్తే… రాహు దోషం మిమ్మల్ని వెంటాడడం తద్యం…?
ఇంట్లో మంచం మీద కూర్చొని అన్నం తినడం లేదా ఏవైనా ఆహార పదార్థాలను తినడం వాస్తు శాస్త్రం ప్రకారం మంచిది కాదంటున్నారు నిపుణులు. వాస్తు శాస్త్రం ప్రకారం మంచం మీద కూర్చుని ఆహారం తీసుకున్నట్లయితే ఆశుభానికి చిహ్నంగా భావిస్తారు. ఇలా చేసేవారికి రాహువు ప్రతికూల ప్రభావాలను చూపిస్తాడు. మంచం మీద కూర్చొని ఆహారాన్ని భుజించే ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడూ ఇంట్లో అధిక సమస్యలతో ఎదుర్కోవాల్సి వస్తుంది. మంచం మీద కూర్చొని ఆహారాన్ని అస్సలు తీసుకోకండి. నేలపై కూర్చొని ఆహారాన్ని తీసుకుంటే మీ జీవితంలో మంచి మార్పులను చూస్తారు.
నైరుతి దిశ : నైరుతి దిశలో వాస్తు శాస్త్రం ప్రకారం నైరుతి దిశ రాహువు కి సంబంధించినది. ఇంటి ప్రధాన ద్వారం తలుపులు, నైరుతి దిశలో ఉండకూడదు. లేకుంటే జీవితంలో రాహు ప్రతికూల ప్రభావం పెరుగుతూనే ఉంటుంది. అలాగే నైరుతి మూలలో ఎప్పుడూ టాయిలెట్లు లేదా బాత్రూంలో అస్సలు నిర్మించకండి.ఈ దిశలో వీటి నిర్మాణం రాహు ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. జీవితంలోని ఆనందం, శాంతి లోపిస్తుంది అని నమ్ముతారు.
ఇంట్లో ముళ్ళ మొక్కలు : ఇంట్లో ముళ్ళ మొక్కలను పెంచితే ఆ ఇంట్లో రాహు ప్రభావం పెరుగుతుంది. శాస్త్రం ప్రకారం ఇంట్లో ముళ్ళ మొక్కలు ఉండడం కుటుంబ సభ్యులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. జీవితంలో సమస్యలు కూడా పెరుగుతాయి. మొక్కల్ని ఎప్పుడైనా ఇంటి బయట బహిరంగ ప్రదేశాలలో పెంచుకుంటే మంచిది.అంతే కానీ,ముళ్ళ మొక్కలను ఇంటి లోపల పెంచుకోకూడదు.
ఇంట్లో చెత్త పోగవ్వడం : చెత్త పోగవుతూ ఉంటే, ఇంట్లో చెత్త ఎక్కువగా పేరుకుపోయిన లేదా ఇల్లంతా అస్తవ్యస్తంగా ఉంటే రాహువు దుష్ప్రభావాలను ఎక్కువగా చూపిస్తుంటాడు. అంతేకాదు, ఎవరైనా సరే పొరపాటున కూడా ఇంట్లో చెత్త లేదా అనవసరమైన వస్తువులను పోగు చేసి ఉంచుకోకండి. ఇలా చేస్తే ఇంతే పూజ స్థలం,వంటగది, పడకగదిలో ధూళి,చెత్త పేరుకుపోవడం అది శుభ్రంగా లేకపోవడం,రాహువు ప్రవేశించడానికి సంగేతంగా మీరే ఆహ్వానం ఇచ్చినట్లు అవుతుంది.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.