
importance of arundhati star
Arundhati Star : హిందూ సంప్రదాయాల్లో పెళ్లి క్రతువుకు చాలా ప్రాముఖ్యత ఉంది. పెళ్లి నిశ్చయం అయినప్పటి నుంచి అమ్మాయిని అత్తారింటికి చేర్చే వరకు ఎన్నెన్నో చేస్తారు. ఏడడుగులు, మూడు ముళ్లతో ఒక్కటైన దంపతులకు ఆకాశంలో ఉన్న అరుంధతీ నక్షత్రాన్ని చూపిస్తారు. ఈ విషయం మన అందరికీ తెలిసిందే. అయితే నూతన దంపతలకు అరుందతీ నక్షత్రాన్ని చూపించడం వెనుకున్న ఓ పెద్ద కథే ఉంది. అయితే ఆ కథ ఏంటి.. పెళ్లి అయిన వధూవరలకు కచ్చితంగా అరుంధతీ నక్షత్రాన్ని చూపించాల్సిందేననా వంటి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.మన పురాణ గ్రంథాల ప్రకారం… వశిష్ట మహర్షి, అరుంధతీ దంపతులు. వీరు అన్యోన్యంగా ఉండి.. ఎంతో మందికి ఆదర్శ దంపతులుగా నిలిచారు. కొత్తగా పెళ్ళైన దంపతులు కూడా వారిలాగా ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశ్యంతో మన పూర్వీకులు పెళ్లైన కొత్త జంటకు ఆ అరుంధతీ నక్షత్రాన్ని చూపిస్తుంటారు.
బ్రహ్మ దేవుడు సృష్టి కార్యంలో తనకు సహాయంగా ఉండడం కోసం ఓ అందమైన ఆడ పిల్లను , అంతు మించిన ఓ పురుషుడిని సృష్టిస్తాడు. ఆ కన్యపేరే సంధ్య… ఆమే తర్వాత కాలంలో అరుంధతిగా మారింది. ఆ అందమైన వ్యక్తే మన్మధుడు. అయితే మన్మధుడిని సృష్టించిన బ్రహ్మ ఓ 5 సమ్మోహన బాణాలను ఇచ్చాడు. అవి పనిచేస్తాయో లేదోనని మన్మథుడు వాటిని పరీక్షించాలని అనుకుంటాడు. వెంటనే వాటిని బ్రహ్మ లోకంలోనే ప్రయోగించాడు. దీంతో బ్రహ్మతో సహా అందరూ సంద్య పట్ల మోహానికి గురైయ్యారు. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన సరస్వతీ దేవి… పరమేశ్వరుడిని ప్రార్థిస్తుంది. వెంటనే ఈ ప్రమాదం నుంచి అందరిని కాపాడమని వేడుకుంటుంది. స్పందించిన పరమ శివుడు సమ్యను పరిష్కరిస్తాడు.దీనంతటికీ కారణం మన్మథుడేనని గ్రహించిన బ్రహ్మ తీవ్ర ఆవేశానికి గురవుతాడు. వెంటనే మన్మథుడిని శపిస్తాడు. ఈశ్వరుని నేత్రాగ్నిలో పడి భస్మమవుతావని మన్మథుడికి శాపం ఇచ్చాడు. ఈ క్రమంలోనే తన వల్లే కదా ఇంత మంది నిగ్రహం కోల్పోయారనుకొని సంధ్య అపరాధాభావంతో ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమవుతుంది.
importance of arundhati star
అయితే విషయం గుర్తించిన వశిష్ట మహర్షి పరమ శివుడిని ప్రార్థించమని సంధ్యకు హితోపదేశం చేస్తాడు. వెంటనే శివుడి కోసం సంధ్య ఘోర తపస్సు చేస్తుంది. విషయం గ్రహించిన శివుడు ఆమె తపస్సుకి మెచ్చి ప్రత్యక్షం అవుతాడు. వెంటనే ఏమైనా వరం కోరుకోమని చెప్పగా… తన భర్త తప్ప ఆమెను మరే పురుషుడు కామ దృష్టితో చూసినా వారు వెంటనే నపుంసకులుగా మారిపోవాలని కోరుకుంటుంది. అలాగే పుట్టిన వెంటనే అందరికీ కామోద్రేకాన్ని కల్గించిన తన శరీరం నశించిపోవాలని కోరుకుంటుంది. వెంటనే ఆ ఈశ్వరుడు తథాస్తు అంటాడు. అలా మేధతిథి అనే మహర్షి చేస్తున్న ఓ యాగ కుండంలో నీ శరీరాన్ని దగ్దం చేసుకుని, తిరిగి అదే అగ్నికుండం నుండి నీవు జన్మిస్తావని చెప్తాడు. అలా సంధ్య చనిపోయి అరుంధతీ పుడుతుంది. పుట్టిన వెంటనే తను ఆత్మహత్య చేసుకోబోతుంటే కాపాడిన వశిష్ట మహర్షిని తలుచుకుంటుంది. అలా వశిష్ట మహర్షి అరుంధతీలు దంపతులయ్యారు.
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.