Indira Ekadashi : హిందూమతంలో విష్ణువుకి ఇందిరా ఏకాదశి తిదీని అంకితం చేయబడింది. ఈ ఏకాదశి రోజున భక్తులు ఉపవాసం మరియు పూజలు చేయడం వలన విశేష ఫలితాలను పొందుతారు. అయితే ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన చర్యలను తీసుకుని పూజను పద్ధతిగా పాటించడం ద్వారా శ్రీమహావిష్ణువు యొక్క ఆశీర్వాదాన్ని పొందవచ్చు. అయితే ఈ ఏడాది పితృపక్ష సమయంలో ఇంద్ర ఏకాదశి తిధి వచ్చింది. కాబట్టి ఈ ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. ఇక ఈరోజున పూజ చేయడం వలన విష్ణువుతో పాటు పూర్వికుల ఆశీర్వదాలు కూడా లభిస్తాయి.
హిందూ పంచాంగం ప్రకారం చూసుకున్నట్లయితే ఇందిరా ఏకాదశి తిధి భద్రపాద మాసంలోని కృష్ణపక్ష ఏకాదశిన సెప్టెంబర్ 27వ తేదీ మధ్యాహ్నం 1:20 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు సెప్టెంబర్ 28వ తేదీన మధ్యాహ్నం 2:49 గంటలకు ముగుస్తుంది. కాబట్టి ఉదయ తిథి ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీ శనివారం ఇంద్ర ఏకాదశి వ్రతాన్ని జరుపుకోవాలి. ఈ రోజున ఉదయం 7:42 గంటల నుండి 9 :12 గంటల వరకు పూజకు శుభ ముహూర్తం.
ఈ సంవత్సరం ఇందిరా ఏకాదశి రోజున సర్వార్థ స్థితి యోగం మరియు శివస్ అనే ప్రత్యేకమైన శుభయోగాలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడుతుంది. అలాగే ఈ రోజున పూజకు ఉదయం 5:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:52 గంటల వరకు అనుకూలమైన సమయం. అదేవిధంగా సెప్టెంబర్ 29వ తేదీన ఉదయం 6:13 నుండి 8:36 వరకు ఇందిర ఏకాదశి పూజను జరుపుకోవచ్చు.
– ఇంద్ర ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి. తరువాత స్నానం చేసి కొత్త దుస్తువులను ధరించాలి.
– పూజ గదిని శుభ్రం చేసిన తర్వాత శ్రీమహావిష్ణువు యొక్క విగ్రహం లేదా చిత్రపటాన్ని ప్రతిష్టించాలి. ఆ తర్వాత వాటిని పువ్వులు మరియు దీపాలతో అందంగా అలంకరించాలి.
– విష్ణువుకి తులసి మొక్క చాలా ప్రీతికరమైనది. కాబట్టి తులసి మొక్కకు నీరు అర్పించి ధూపం వేయాలి.
– ఈరోజు ఉపవాసం ఉంటానని తీర్మానం చెప్పి మనసులోని కోరికలను నెరవేర్చమని ప్రార్థించాలి.
– శ్రీమహావిష్ణువు అనుగ్రహం కోసం సహస్రనామాన్ని పట్టించాలి. అలాగే విష్ణు మంత్రాన్ని జపించండి.
– ముఖ్యంగా ఇందిరా ఏకాదశి కథ వినడం వలన ఎంతో పుణ్యం లభిస్తుంది.
– ఇంద్ర ఏకాదశి రోజున ఉపవాస సమయంలో పండ్లు ,కూరగాయలు, పెరుగు వంటివి తినవచ్చు. అలాగే పేదవారికి ఆహారం మరియు వస్త్రాలను దానం చెయ్యండి.-* ఇంద్ర ఏకాదశి రోజు రాత్రి జాగారం చెయ్యండి. విష్ణు కథ వినడం లేదా భజన కీర్తనలు చేయవచ్చు.
హిందూమతంలో ఇందిరా ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. ఈరోజున ఉపవాసం ఉండడం వలన శ్రీమహావిష్ణువు అనుగ్రహించి జీవితంలో దుఃఖాలు పోయి సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. అదేవిధంగా ఇంద్ర ఏకాదశి రోజున పూర్వికుల పేరిట దానధర్మాలు చేస్తే పూర్వీకుల మోక్ష ప్రాప్తిని పొందుతారు. అలాగే ఈ రోజున పూజలను నిర్వహించడం వలన జీవితంలోని కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.