Indira Ekadashi : త్వరలోనే ఇందిరా ఏకాదశి… జరగనున్న యాదృచ్ఛికాలు..శుభ సమయం ఎప్పుడంటే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Indira Ekadashi : త్వరలోనే ఇందిరా ఏకాదశి… జరగనున్న యాదృచ్ఛికాలు..శుభ సమయం ఎప్పుడంటే…!

Indira Ekadashi : హిందూమతంలో విష్ణువుకి ఇందిరా ఏకాదశి తిదీని అంకితం చేయబడింది. ఈ ఏకాదశి రోజున భక్తులు ఉపవాసం మరియు పూజలు చేయడం వలన విశేష ఫలితాలను పొందుతారు. అయితే ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన చర్యలను తీసుకుని పూజను పద్ధతిగా పాటించడం ద్వారా శ్రీమహావిష్ణువు యొక్క ఆశీర్వాదాన్ని పొందవచ్చు. అయితే ఈ ఏడాది పితృపక్ష సమయంలో ఇంద్ర ఏకాదశి తిధి వచ్చింది. కాబట్టి ఈ ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. ఇక ఈరోజున పూజ చేయడం […]

 Authored By ramu | The Telugu News | Updated on :27 September 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Indira Ekadashi : త్వరలోనే ఇందిరా ఏకాదశి... జరగనున్న యాదృచ్ఛికాలు..శుభ సమయం ఎప్పుడంటే...!

Indira Ekadashi : హిందూమతంలో విష్ణువుకి ఇందిరా ఏకాదశి తిదీని అంకితం చేయబడింది. ఈ ఏకాదశి రోజున భక్తులు ఉపవాసం మరియు పూజలు చేయడం వలన విశేష ఫలితాలను పొందుతారు. అయితే ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన చర్యలను తీసుకుని పూజను పద్ధతిగా పాటించడం ద్వారా శ్రీమహావిష్ణువు యొక్క ఆశీర్వాదాన్ని పొందవచ్చు. అయితే ఈ ఏడాది పితృపక్ష సమయంలో ఇంద్ర ఏకాదశి తిధి వచ్చింది. కాబట్టి ఈ ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. ఇక ఈరోజున పూజ చేయడం వలన విష్ణువుతో పాటు పూర్వికుల ఆశీర్వదాలు కూడా లభిస్తాయి.

Indira Ekadashi : ఇందిరా ఏకాదశి తిధి సమయం శుభ ముహూర్తం.

హిందూ పంచాంగం ప్రకారం చూసుకున్నట్లయితే ఇందిరా ఏకాదశి తిధి భద్రపాద మాసంలోని కృష్ణపక్ష ఏకాదశిన సెప్టెంబర్ 27వ తేదీ మధ్యాహ్నం 1:20 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు సెప్టెంబర్ 28వ తేదీన మధ్యాహ్నం 2:49 గంటలకు ముగుస్తుంది. కాబట్టి ఉదయ తిథి ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీ శనివారం ఇంద్ర ఏకాదశి వ్రతాన్ని జరుపుకోవాలి. ఈ రోజున ఉదయం 7:42 గంటల నుండి 9 :12 గంటల వరకు పూజకు శుభ ముహూర్తం.

Indira Ekadashi ఇంద్ర ఏకాదశి రోజున శుభ యాదృచ్ఛికాలు

ఈ సంవత్సరం ఇందిరా ఏకాదశి రోజున సర్వార్థ స్థితి యోగం మరియు శివస్ అనే ప్రత్యేకమైన శుభయోగాలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడుతుంది. అలాగే ఈ రోజున పూజకు ఉదయం 5:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:52 గంటల వరకు అనుకూలమైన సమయం. అదేవిధంగా సెప్టెంబర్ 29వ తేదీన ఉదయం 6:13 నుండి 8:36 వరకు ఇందిర ఏకాదశి పూజను జరుపుకోవచ్చు.

Indira Ekadashi ఇందిరా ఏకాదశి పూజ విధానం

– ఇంద్ర ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి. తరువాత స్నానం చేసి కొత్త దుస్తువులను ధరించాలి.

– పూజ గదిని శుభ్రం చేసిన తర్వాత శ్రీమహావిష్ణువు యొక్క విగ్రహం లేదా చిత్రపటాన్ని ప్రతిష్టించాలి. ఆ తర్వాత వాటిని పువ్వులు మరియు దీపాలతో అందంగా అలంకరించాలి.

– విష్ణువుకి తులసి మొక్క చాలా ప్రీతికరమైనది. కాబట్టి తులసి మొక్కకు నీరు అర్పించి ధూపం వేయాలి.

– ఈరోజు ఉపవాసం ఉంటానని తీర్మానం చెప్పి మనసులోని కోరికలను నెరవేర్చమని ప్రార్థించాలి.

– శ్రీమహావిష్ణువు అనుగ్రహం కోసం సహస్రనామాన్ని పట్టించాలి. అలాగే విష్ణు మంత్రాన్ని జపించండి.

– ముఖ్యంగా ఇందిరా ఏకాదశి కథ వినడం వలన ఎంతో పుణ్యం లభిస్తుంది.

– ఇంద్ర ఏకాదశి రోజున ఉపవాస సమయంలో పండ్లు ,కూరగాయలు, పెరుగు వంటివి తినవచ్చు. అలాగే పేదవారికి ఆహారం మరియు వస్త్రాలను దానం చెయ్యండి.-* ఇంద్ర ఏకాదశి రోజు రాత్రి జాగారం చెయ్యండి. విష్ణు కథ వినడం లేదా భజన కీర్తనలు చేయవచ్చు.

Indira Ekadashi త్వరలోనే ఇందిరా ఏకాదశి జరగనున్న యాదృచ్ఛికాలుశుభ సమయం ఎప్పుడంటే

Indira Ekadashi : త్వరలోనే ఇందిరా ఏకాదశి… జరగనున్న యాదృచ్ఛికాలు..శుభ సమయం ఎప్పుడంటే…!

Indira Ekadashi ఇందిరా ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటంటే.

హిందూమతంలో ఇందిరా ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. ఈరోజున ఉపవాసం ఉండడం వలన శ్రీమహావిష్ణువు అనుగ్రహించి జీవితంలో దుఃఖాలు పోయి సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. అదేవిధంగా ఇంద్ర ఏకాదశి రోజున పూర్వికుల పేరిట దానధర్మాలు చేస్తే పూర్వీకుల మోక్ష ప్రాప్తిని పొందుతారు. అలాగే ఈ రోజున పూజలను నిర్వహించడం వలన జీవితంలోని కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది