
It is a great sin to make these mistakes without knowing when lighting 365 othis
Karthika Masam : ఈ కార్తీక మాసంలోచాలామంది 365 వత్తులు వెలిగిస్తూ ఉంటారు. మరి ఇలా 365 వత్తులు వెలిగించేటప్పుడు తెలియక కొన్ని పొరపాటు చేసేస్తూ ఉంటారు. వెలిగించేటప్పుడు మనం పాటించవలసినటువంటి కొన్ని విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం కార్తీక పౌర్ణమి రోజు సోమవారం ఏకాదశి అమావాస్య రోజుల్లో ప్రతి ఒక్కరూ 365 వత్తులతో దీపారాధన చేయడం అనేది పరిపాని కానీ ఈ 365 వత్తుల వత్తులు వెలిగించేటప్పుడు కొన్ని పొరపాట్లు జరగకుండా మనం ఇలా వెలిగిస్తే ఆ దీపాన్ని వెలిగించిన ఫలితాన్ని మనం కచ్చితంగా పొందవచ్చు అలా కాక ఒకవేళ పొరపాటు చేస్తే వెలిగించిన ఫలితం ఉండదు. కార్తీక మాసంలో తప్పకుండా వెలిగించేటప్పుడు అంటే 365 వత్తుల దీపాన్ని వెలిగించేటప్పుడు ఎలా వెలిగించాలో అలాగే వెలిగించాక ఏం చేయాలో చూసేద్దాం.
365 వత్తులను మీరు కొనడం కన్నా ఇంట్లో విభూది అందుకుంటూ మీ ఇంట్లో ఉండే పత్తితో మీ చేతులతో చేసుకుంటే మంచిది. మీరు మీ ఇంట్లో తయారు చేసిన వత్తులను మూడు కట్టలుగా కట్టాలి 120 + 120 + 125 గా మూడు కట్టలు కట్టి ఈ మూడు కట్టలను కూడా ఒక కట్టగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు 365 వత్తులు రెడీగా ఉంటాయి. వెలిగించే ఒక గంట ముందు ఆవు నేతిలో నానబెట్టుకోవాలి. ఈ 365 వత్తుల దీపాన్ని వెలిగించటం కోసం మీరు పూజ చేసే సమయంలో మీరు మీ ఇంట్లోనైనా లేక దేవాలయంలోనైనా ఆ చోట అష్టదళ పద్మ ముగ్గు వేసుకోవాలి. ఈ ముగ్గుపై పసుపు, కుంకుమ, అక్షతలతో అలంకరించుకుని దానిపై పసుపు వినాయకుని తమలపాకు పై పెట్టుకోవాలి. ముందుగా మనం చేయాల్సిందేంటంటే ముందుగా పసుపు గణపతి ముందు దీపాన్ని హారతి తో కానీ లేదా అగర్బత్తితో గాని వెలిగించుకోవాలి. ముందుగా పసుపు వినాయకుడిని ఆవాహన చేసి వస్త్రం యజ్ఞోపవేతం గంధం, పసుపు, కుంకుమ అక్షింతలతో చక్కగా పూజించాలి.
It is a great sin to make these mistakes without knowing when lighting 365 othis
దుపం చూపించిన తర్వాత దీపాన్ని కూడా చూపించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి తాంబూలం కూడా సమర్పించాలి. తరువాత కర్పూర హారతి ఇచ్చి మంత్రపుష్పాన్ని జపించి అక్షంతలు పూలు వినాయకుని పైవేసి ఆత్మ ప్రదక్షణ చేసి అక్షింతలను స్వామివారిపై వేసి వినాయకుని దగ్గర ఉన్నటువంటి అక్షంతలను మన తలపై వేసుకోవాలి. అంతేకాకుండా కుంకుమ బొట్టు కూడా అలాగే పెట్టుకోవాలి. ఈ విధంగా వినాయక పూజ చేసిన తరువాత 365 బత్తులను వెలిగించుకోవాలి. ఈ 365 వత్తులను మట్టి ప్రమిదలో ఉంచి ఆ ప్రమిదను ఒక ఆకుపైన ఒక ప్ర మీద పెట్టి ఆ ప్రమిదలు ఈ 365 వత్తులు పెట్టిన ప్రమిదను పెట్టుకోవాలి. ఇలా దీపం వెలిగించే సందర్భంలో హర హర మహాదేవ శంభో శంకర అని లేదా ఓం నమశ్శివాయ అని స్వామి నామాన్ని జపించుకోవాలి. ఇలా వెలుగుతున్నటువంటి ఈ 365 వత్తుల దీపాన్ని పసుపు, కుంకుమ అక్షంతలతో అలాగే పువ్వులతో చక్కగా పూజించాలి. ఇక ఈ 365 వత్తుల దీపానికి ధూపాన్ని చూపించాలి.
ఈ వెలుగుతున్నటువంటి ఈ దీపానికి నైవేద్యంగా బెల్లం ముక్కను సమర్పించాలి. లేదా చలిమిడి, వడపప్పు, పానకం సమర్పించవచ్చు. నైవేద్యం సమర్పించిన తరువాత చివరిగా కర్పూర హారతిని వెలిగించి వత్తులకు చూపించుకోవాలి. ఈ వత్తులు వెలుగుతున్నంతసేపు కార్తీక పురాణాన్ని పట్టిస్తూ ఉంటే ఓం నమశ్శివాయ అనే జపాన్ని ఆ పరమేశ్వర ధ్యానానికి వాడుతూ చక్కగా మనం ఆ పరమేశ్వరుని ధ్యానంలో ఉంటే సరిపోతుంది. పూర్తిగా వెలిగే వరకు ఉండని చాలామంది ఇంట్లోనే తులసి కోట ముందు వెలిగిస్తారు. 365 వత్తుల దీపాన్ని మీ ఇంట్లో కూడా వెలిగించవచ్చు. లేదా నీటిలో కలిపి ఆ నీటిని చెట్టు మొదట్లో పోయాలి. అలా చేసిన తర్వాత మనం దీపం వెలిగించిన ప్రదేశంలో నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా 365 వత్తులను పొరపాట్లు చేయకుండా వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మీకు ఫలితం దక్కుతుంది. ఏ పొరపాటు లేకుండా మీరు చక్కగా ఈ దీపాన్ని వెలిగించుకునే ప్రక్రియను పూర్తి చేస్తే 365 వత్తులు వెలిగించిన ప్రతిఫలం మీకు దక్కుతుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.