Karthika Masam : హిందూమతంలో కార్తీకమాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి ఒక్కరు కూడా నిష్టతో నియమ నిబంధనలతో భగవంతుని ఆరాధించే సమయం ఈ కార్తీకమాసం అని చెప్పచ్చు.. ఈ మాసంలో ప్రతి ఒక్క రోజు కూడా దివ్యమైన రోజుగా భావిస్తారు. అయితే ఎంతో పవిత్రమైనటువంటి కార్తీకమాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో పొరపాటులు తప్పులు చేస్తే మహా పాపం కలుగుతుంది. అడుక్కునే స్థాయికి వెళ్ళిపోయే ప్రమాదము ఉంటుంది. ఈ కార్తీకమాసంలో చేయకూడని పనులేంటి జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు ఏంటి? ఈ పవిత్రమైనటువంటి కార్తీకమాసంలో ఎలాంటి పనులు చేయాలో మీరంతా వివరంగా తెలుసుకోబోతున్నారు.. ఈ కార్తీకమాసంలో పరమశివుడికి అభిషేకాలు చేస్తారు. మారేడు దళాలు సమర్పిస్తారు. కేవలం నీటితో చేసే అభిషేకం మారేడు దళాలు సమర్పించిన సరే ఆ శివ కటాక్షం లభిస్తుంది అని భక్తులందరూ విశ్వసిస్తూ ఉంటారు.
ఈ మాసంలో కార్తీక స్నానం తులసి పూజ శివకేశవుల స్తోత్ర పారాయణం పౌర్ణమి అలాగే ఏకాదశిలో చేసేటువంటి సత్యనారాయణ స్వామి వ్రతం ఇవన్నీ కూడా అత్యంత శుభమైన ఫలితాలని తప్పకుండా ఇస్తాయని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం.. అలాగే ఈ కార్తీకమాసం దీపారాధనకు ఎంతో విశిష్టమైనది. ముఖ్యంగా కార్తీక మాసంలో తామసం కలిగించేటువంటి ఉల్లిని వెల్లుల్లిని తినకూడదు అని చెప్పారు. ఈ మాసంలో ఉల్లి వెల్లుల్లి చాలామంది నిషేధిస్తారు. ఈ రెండు పదార్థాలతో చేసినటువంటి ఆహారం తీసుకోకూడదు.. కాబట్టి వీలైనంత ఎక్కువగా ఇంట్లో భుజించండి. ఇంట్లో తీసుకునే ఆహారంలో కూడా ఉల్లి, వెల్లుల్లి లేకుండా జాగ్రత్త పడండి.. అలాగే మద్యం, మాంసం జోలికి వెళ్ళకూడదు.. సాధారణంగానే ఈ మద్యం మాంసం మన ఆరోగ్యానికి కుటుంబ వాతావరణము ఎప్పుడు హాని చేసేవి.. ఈ రెండిటి అలవాటు లేని వాళ్ళు ఎంతో ఆరోగ్యవంతులుగా ఉంటారు. మద్యం మాంసం జోలికి ఈ కార్తీకమాసం రోజుల్లో మీరు దూరంగా ఉంటే మీరు ఇంకా దైవారాధనలో ఎక్కువ లీనమవుతారు. ఎక్కువ పుణ్యఫలితాలను పొందుకోగలుగుతారు.
అలాగే ఈ పవిత్రమైనటువంటి మాసంలో మీరు ఎవ్వరికీ ద్రోహం చేయకూడదు. నీతి నిజాయితీగా బ్రతకడం అనేది భగవంతుడు ప్రతి ఒక్కరితోనూ చెబుతున్న మాట. ఏ భగవంతుడు ఏ సందర్భంలోనూ ఎవరికి అన్యాయం చేయమని కానీ మరిన్ని రెట్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా కొన్ని పాపకర్మలు అనుభవించక తప్పదు అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎవరిని కించపరచటం, దూషించటం, అన్యాయం చేయడం ద్రోహం చేయడం లాంటి కార్యక్రమాలకి దూరంగా ఉండండి.దీన్ని ఈ ఒక్క మాసానికే కాదు.. సంవత్సరం అంతా అలవాట అయ్యేలా చేసుకోండి. అలాగే కార్తీకమాసంలో ఇవన్నీ చేయకూడని పనులు అయితే చేయాల్సిన పనులేంటి ప్రతిరోజు ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్లాలి. శివ దర్శనం చేసుకోవాలి. శివాలయంలో విశాలయంలో దీపాన్ని వెలిగించటం ఎంతో మంచిది. దీపావళి మొదలు కార్తీక మాసం పూర్తయ్యే వరకు ప్రతిరోజు సంధ్య దీపం వెలిగించాలి. కార్తీకమాసం అంతా కార్తీక పురాణం కనీసం రోజుకు ఒక అధ్యయనం చేయటం అత్యంత శుభకరమని తెలుసుకోండి…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.