
virat kohli century against newzealand in icc world cup 2023
Virat Kohli : అన్నంత పని చేశాడు విరాట్ కోహ్లీ. మొన్న 49 సెంచరీలు చేసి సచిన్ టెండుల్కర్ రికార్డును సమం చేసిన విరాట్ కోహ్లీ తాజాగా న్యూజిలాండ్ మ్యాచ్ లో మరో సెంచరీ చేసి రికార్డు క్రియేట్ చేశాడు. న్యూజిలాండ్ తో మ్యాచ్ లో విరాట్ కోహ్లీ మరో సెంచరీ చేశాడు. దీంతో వన్డే మ్యాచ్ లలో 50 సెంచరీలు ఇప్పటి వరకు పూర్తయ్యాయి. 50 సెంచరీలతో సచిన్ రికార్డును బద్దలు చేసి ఇప్పటి వరకు వన్డేల్లో ప్రపంచంలోనే అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ గా చరిత్రకెక్కాడు విరాట్ కోహ్లీ. వన్డే మ్యాచ్ లలో ఇప్పటి వరకు సచిన్ 49 సెంచరీలు చేయగా.. ఈ మ్యాచ్ లో కోహ్లీ 50 సెంచరీలు చేశాడు. భారత్ తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అదరగొట్టేశాడు. కోహ్లీ ఈ మ్యాచ్ లో 117 పరుగులు చేశాడు. 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులు కొట్టాడు కోహ్లీ. సెంచరీ చేసి సౌతీ బౌలింగ్ లో కాన్వేకు క్యాచ్ ఇచ్చి రికార్డు క్రియేట్ చేసి పెవిలియన్ బాట పట్టాడు.
న్యూజిలాండ్ తో సెమీ ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ లో మరో జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే నేరుగా నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ లో ఫైనల్ కు అర్హత సాధించే మరో జట్టుతో పోటీ పడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ ఫైనల్ కు చేరినట్టే. అయితే.. భారత్ గట్టిగానే ఈ మ్యాచ్ లో స్కోర్ చేస్తోంది. 45 ఓవర్లలో 340కి పైగా స్కోర్ చేసింది. వికెట్లు కూడా ఇప్పటి వరకు 2 మాత్రమే పోయాయి. అందుకే న్యూజిలాండ్ కు భారీ లక్ష్యాన్ని అందించేందుకు భారత్ చెమటోడుస్తోంది.
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…
Dresses | ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే అందరికీ మక్కువ. స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించాలన్న కోరికతో చాలా మంది ఫిట్టెడ్…
Health Tips | ఆయుర్వేదం చెప్పే ప్రతి మూలికకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే వాటిలో “బ్రహ్మీ” అనే ఔషధ…
This website uses cookies.