Home » Devotional » Lakshmi Devi Kataksham Pariharam In Telugu
Devotional

Lakshmi Devi kataksham ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఈ వస్తువులను ఉంచితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టదు…

Authored By
aruna
The Telugu News | Updated on: November 30, 2023, 7:53 pm
Advertisement

Lakshmi Devi kataksham ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర ఇవి ఉంచితే..ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ కూడా వెంటనే మీ ఇంట్లో నుంచి వెళ్లిపోతాయి. ఈ విషయాలు చాలా మందికి తెలిసిన కూడా వాటిని అలానే ఉంచుతూ ఉంటారు. దానివల్ల నష్టాలు కలిగే అవకాశాలు ఎక్కువ. ఇలా చేసిన తర్వాత మీరు ఎన్ని పూజలు చేసినా కూడా మీ జీవితంలో ఎటువంటి మార్పు కలగదు. కాబట్టి అసలు మనం మన ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఏమేం ఉంచకూడదు అనే విషయాలు ఈరోజు చూద్దాం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని ప్రతి వస్తువు సానుకూల మరియు ప్రతికూల శక్తిని కలిగి ఉంటాయి. వాటిని సరైన స్థలంలో ఉంచకపోతే అది ఇంట్లో ప్రతికూలతను వృద్ధి చేస్తుంది. దాని వల్ల ఇంటి ఆర్థిక స్థితి కూడా ప్రభావితం అవుతుంది. ఎప్పుడూ చికాకులు గొడవలే జరుగుతూ ఉంటాయి. అయితే అసలు ఇంటి ముందు ప్రధాన ద్వారం దగ్గర ఎలాంటి వస్తువులు ఉంచకూడదు.

Advertisement

ఇప్పుడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. ఇంటి ముందు ఉంచుకోకూడని వస్తువుల్లో మొట్టమొదటిది.. ఏంటంటే మురికి నీరు ఇంటి ముందు ఉండటం వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ముందు మురికి నీరు పేరుకుపోవడం అనేది చాలా ఆశుభంఈ మురికి నీటిలో అనేక రకాల బ్యాక్టీరియా వృద్ధి చెందుతూ ఉంటుంది. అందుకే ఇంటి ముందు మురికి నీరు పేరుకి పోతే వెంటనే దానిని తొలగించాలి.ఇక రెండవది ముళ్ళ మొక్కలు అవును చాలా సార్లు ప్రజలు ముళ్ళ మొక్కల్ని ఇంటి ముందు నాటుతూ ఉంటారు. ఇంటి అందాన్ని పెంచుకునేందుకు ఇలా చేస్తూ ఉంటారు. కానీ ఇంటి ముందు ముళ్ళ మొక్కల్ని ఉంచటం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. దీనికి బదులుగా ఇంటి ప్రధాన ద్వారం ముందు తులసి మొక్కను పెట్టుకోవాలి. కానీ వాస్తు ప్రకారం ఇలా అస్సలు చేయకూడదు. అలాగే ఇంటి ముందు విద్యుత్ స్తంభం ఉండకూడదు.

వాస్తు ప్రకారం ఇది కుటుంబ సభ్యుల వృద్ధిని ఆపేస్తుంది. ప్రధాన ద్వారం ముందు కరెంటు స్తంభం ఉండటం చాలా హానికరం అంతేకాదు.. రేడియేషన్ యొక్క ప్రభావం కూడా ఉంటుంది.ఇక తరువాతది ఇంటి ప్రధాన ద్వారం ముందు దట్టమైన చెట్లు పెద్ద పెద్ద మొక్కలు అస్సలు ఉండకూడదు. దీని వల్ల వాస్తు దోషాలు పెరిగిపోతాయి. ఉదయాన్నే ఇంటి ప్రధాన ద్వారం సూర్యకాంతి ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మన ప్రధాన గుమ్మం కంటే ఎక్కువ ఎత్తులో రహదారి ఉంటే అది చాలా అనర్ధాన్ని తెచ్చిపెడుతుంది. ప్రధాన ద్వారం వద్ద బూట్లు చెప్పులు ఎప్పుడు చెల్లాచెదురుగా ఉండకూడదు. ఇది లక్ష్మీదేవి రాకకు అడ్డంకి సృష్టిస్తుంది. ఈ విషయాలని మీరు పాటించడం మర్చిపోకండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఎప్పుడూ సానుకూల ఫలితాలు వస్తాయి. లక్ష్మీదేవి కటాక్షం మీకు మెండుగా ఉంటుంది. మీరు ఎప్పుడు అన్ని విషయాలు విజయం సాధిస్తారు. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు. మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం సాధిస్తారు…

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి