Mahashivarathri Pariharam : మార్చి 8 మహాశివరాత్రి రోజున ఆడవారు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి.. మహా పాపం… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mahashivarathri Pariharam  : మార్చి 8 మహాశివరాత్రి రోజున ఆడవారు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి.. మహా పాపం…

 Authored By tech | The Telugu News | Updated on :3 March 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Mahashivarathri Pariharam  : మార్చి 8 మహాశివరాత్రి రోజున ఆడవారు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి.. మహా పాపం...

  •  Mahashivarathri Pariharam  :  శివుడు తన కంఠమున విషమును దాచి ముల్లోకాలను కాపాడటం ఇలా కాపాడిన ఆ కాలరాత్రి శివరాత్రి అని మనం పురాణాలు తెలియజేస్తున్నాయి.

  •  ఒక్క మాస శివరాత్రి అనే కాకుండా మాత్రమే కాకుండా మీరు ఏ సందర్భంలో అయినా సరే ఈ నియమాన్ని పాటించాల్సి ఉంటుంది. ఇంట్లో వాళ్ళు రౌద్రంగా మాట్లాడటం కానీ నోటి నుండి చెడ్డ మాటలు రావడం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ కూడా చేయకూడదు.

Mahashivarathri Pariharam  :  శివుడు తన కంఠమున విషమును దాచి ముల్లోకాలను కాపాడటం ఇలా కాపాడిన ఆ కాలరాత్రి శివరాత్రి అని మనం పురాణాలు తెలియజేస్తున్నాయి. శివరాత్రి రెండు గంటల సమయం మధ్య చేసే రుద్రా భిషేకం అత్యంత విలువ కలదని బ్రహ్మకు విష్ణువుకు చెబుతాడు. ఎంతో పవిత్రమైన మహాశివరాత్రి నాడు ఆడవారు కొన్ని పొరపాట్లను అసలే చేయకూడదు అలా చేస్తే పాపం అవేంటో ఇప్పుడు మనం చూద్దాం..అంటే పురుషులు కూడా ఇటువంటి తప్పులు చేయకూడదు. కానీ స్త్రీలకు సంబంధించి కొన్ని పొరపాట్లు కూడా ఉంటాయి. అటువంటి అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. అంటే స్త్రీలు రుతు సమయంలో ఉన్నట్లయితే గనక ఆలయానికి వెళ్ళటం కానీ పూజ మందిరం ఆ లింగం దగ్గరికి వెళ్ళటం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. శివుడు అనుగ్రహం బదులు ఆగ్రహానికి గురయ్యి పరిస్థితి అయితే వస్తుంది. కాబట్టి ఋతు సమయంలో ఉన్నటువంటి స్త్రీలు మీరు ఆలయానికి వెళ్ళటం కానీ లేకపోతే మీ ఇంట్లో పూజ మందిరం దగ్గరికి వెళ్లడం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు.

ఒక్క మాస శివరాత్రి అనే కాకుండా మాత్రమే కాకుండా మీరు ఏ సందర్భంలో అయినా సరే ఈ నియమాన్ని పాటించాల్సి ఉంటుంది. ఇంట్లో వాళ్ళు రౌద్రంగా మాట్లాడటం కానీ నోటి నుండి చెడ్డ మాటలు రావడం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ కూడా చేయకూడదు. అంటే ఈ విధంగా మీరు ఈ రోజంతా కూడా శివనామస్మరణతో గడుపుతూనే ఉంటూ ఉపవాసం ఆచరిస్తూనే అలాగే శివ భగవానుని ఆరాధిస్తూనే ఆ శివుని అనుగ్రహం తప్ప కలుగుతుంది. అలాగే గొడవలు పడితే మీరు చేసేటటువంటి ఫలితం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా దక్కదు. శుభానుగ్రహం మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా లభించదు. కాబట్టి ఎవరిని దూషించకూడదు. ఎవరితో గొడవ పడకూడదు. ఎవరితో అరవకూడదు. అలాగే చెడు మాటలు మాట్లాడకూడదు.
ఎవరిని అవమానపరచకూడదు. ఇటువంటి నియమాలు కచ్చితంగా పాటించాలి. అలాగే అభిషేకం చేసే సమయంలో లేకపోతే మీ యొక్క వెంట్రుకలు కానీ శివుడి పై ఎట్టి పరిస్థితుల్లో కూడా పడకూడదు.

ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో కానీ శివలింగాన్ని పై చెమట కానీ వెంట్రుకలు కానీ పడితే ఆ శివుడు ఉగ్రరూపం దాల్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే పురుషులు కానీ స్త్రీలు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆల్కహాల్ సేవించడం కానీ స్మోకింగ్ చేయడం కానీ అస్సలు చేయకూడదు. ఈ విధంగా చేస్తే మీరు చేసే పూజకి ఎటువంటి ఫలితం ఉండదు. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్యాభర్తలు కలవడం లాంటి పనులు అస్సలు చేయకూడదు. ఈరోజు మీరు బ్రహ్మచర్యం పాటిస్తేనే మీరు చేసేటటువంటి పూజకి ఫలితం అనేది దక్కుతుంది. కాబట్టి ఇటువంటి నియమాలు మీరు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. మీరు శివరాత్రి రోజు శివనామస్మరణ చేసినా కానీ ఉపవాసం ఉన్నా కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని అర్ధం చేసుకొని మీరు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. ఇలాంటి పొరపాట్లు చేయకుండా శివ నామస్మరణతో శ్రద్ధతో శివుని పూజిస్తే ఆయన అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది…

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది