Home » Devotional » Meena Rasi Very Lucky Due To Shani Transit To Pisces
Devotional

Meena Rasi : మీనరాశిలోకి శని ఆరంభం… ఈ రాశుల వారికి 42 నెలలపాటు పట్టనున్న ధనయోగం…!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: August 7, 2024, 6:00 am
Advertisement

Meena Rasi : శని భగవానుడు తన కర్మ ఫలాన్ని అనుసరించి ప్రతి రెండున్నర సంవత్సరాలకు తన గ్రహాన్ని మారుస్తూ ఉంటాడు. ప్రస్తుతం శని భగవానుడు కుంభరాశిలో తిరోగమన దిశలో ఉన్నాడు. అయితే ఈ ఏడాది నవంబర్ నుండి ప్రత్యేక మార్గంలో సంచరించనున్నాడు. అలాగే వచ్చే ఏడాది మార్చి 29న మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. దీనితో శని భగవానుడి ప్రవేశం వలన కొన్ని రాశుల వారు సమస్యల నుంచి బయటపడతారు. అయితే శని సంచారం ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది…? దీని ద్వారా ఆ రాశులకు ఏ ప్రయోజనం కలుగుతుంది..? ఇప్పుడు ఈ వివరాలను పూర్తిగా తెలుసుకుందాం…

Advertisement

Meena Rasi మకర రాశి

శని భగవానుడు మీనా రాశి లోకి ప్రవేశించిన తర్వాత మకర రాశి వారు సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఈ రాశి ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. సానుకూలమైన ఫలితాలను పొందుతారు. ఇక వ్యాపారుల విషయానికి వస్తే వ్యాపారం బాగుంటుంది. అలాగే అదనపు ఆదాయాన్ని పొందుతారు. విద్యార్థులకు ఇది మంచి సమయం అనే చెప్పుకోవాలి. పరీక్షలలో విజయాలను సాధిస్తారు. అయితే ప్రస్తుతం వీరికి ఏలినాటి శని చివరి దశలో ఉంది.

Meena Rasi కర్కాటక రాశి

ఈ రాశి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగుల విషయానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు వీరు కోరుకున్నచోటికిి బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక వీరు ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా అందుకుంటారు. ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభం ఉంటుంది. దీనితో ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడతారు. వీరి మాటతీరుతో అందర్నీ ఆకట్టుకోగలుగుతారు. అలాగే ఈ రాశి వారు అనుకున్న లక్ష్యానికి చేరుకుంటారు. ముఖ్యంగా భార్యాభర్తల జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది.

Advertisement

Meena Rasi : మీనరాశిలోకి శని ఆరంభం… ఈ రాశుల వారికి 42 నెలలపాటు పట్టనున్న ధనయోగం…!

Meena Rasi వృశ్చిక రాశి

ఈ రాశికి అర్థాష్టమ శని నుంచి విముక్తి లభిస్తుంది. విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. వీరికి అదృష్టం తోడుగా ఉండడంతో అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. శని భగవానుడి ప్రభావంతో వీరు వారి లక్ష్యాలను చేరుకుంటారు. ప్రేమ పెళ్లిళ్లకి అడ్డంకులు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు నెలకొంటాయి. వాతావరణం ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభం చేకూరుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి