Akhanda Deepam : అఖండ దీపం వెలిగించేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పు చేయకండి.. కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజం..!
ప్రధానాంశాలు:
Akhanda Deepam : అఖండ దీపం వెలిగించేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పు చేయకండి.. కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజం..!
Akhanda Deepam : హిందూ సాంప్రదాయంలో దేవత మూర్తులను పూజించే సమయంలో జ్యోతిని వెలిగిస్తారు. అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైన పూజలు మరియు నవరాత్రులలో అఖండ దీపాన్ని కచ్చితంగా వెలిగిస్తారు. ఒకవేళ అఖండ దీపం వెలిగించకపోతే ఆ పూజ పూర్తి కాలేదని భక్తుల నమ్మకం. ఇక శరన్నవరాత్రులలో అఖండ దీపాన్ని వెలిగిస్తారు. ఇలా వెలిగించే సమయంలో కొన్ని జాగ్రత్తలు గుర్తుంచుకోవాలని పండితులు చెబుతున్నారు. మరి అవి ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Akhanda Deepam అఖండ దీపం అంటే ఏమిటి…
జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి తమ కోరికలు నెరవేరాలని మంచి మనసుతో అఖండ దీపాన్ని వెలిగిస్తారు. 24 గంటలు దీపం కొండెక్కకుండా వెలిగితే దానిని అఖండ దీపం అంటారు.
Akhanda Deepam ఎలా వెలిగించాలి
-ఇత్తడి పళ్లెంలో బియ్యం లేదా ధాన్యాన్ని పొయ్యాలి.
-పెద్ద ఇత్తడి గిన్నె లేదా మట్టి మూకుడుని తీసుకోవాలి.
– ఆ మూకుడిని పళ్లెంలో పోసిన బియ్యం మీద పెట్టాలి.
– ఆ తరువాత ఆ దీపానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించుకోవాలి.
– అనంతరం మూకుడులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోయాలి.
-అందులో ఒక లావుపాటి ఒత్తిని వేసి దీపాన్ని వెలిగించాలి.
-అఖండ దీపం వెలిగించిన వెంటనే దీపం వద్ద కొబ్బరికాయను కొట్టాలి.
– దీపం వద్ద నైవేద్యంగా బియ్యం ,పేలాలు మరియు పటిక బెల్లం వంటి వాటిలో ఒకటి లేదా మూడు నైవేద్యాలు పెట్టవచ్చు.
– ఇంట్లో అమ్మవారి విగ్రహం లేదా ఫొటో వద్ద అఖండ దీపాన్ని పెట్టవచ్చని చెబుతున్నారు.
Akhanda Deepam దిక్కులను బట్టి ఫలితం
-ఇంట్లో ఏదైనా శుభకార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగడం కోసం అలాగే పెద్దలకు గౌరవం లభించడం కోసం ఒత్తిని తూర్పు వైపుగా వెలిగించాలి.
– సంపద పెరగడం కోసం, వృధా ఖర్చులు తగ్గడానికి మరియు అప్పులు తీరడానికి అఖండ దీపాన్ని ఉత్తరం వైపు వెలిగించాలి.