Old Clothes : ఇంట్లో పాత దుస్తులను దానం చేస్తున్నారా… ఈ పొరపాటు చేస్తే ఇక అంతే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Old Clothes : ఇంట్లో పాత దుస్తులను దానం చేస్తున్నారా… ఈ పొరపాటు చేస్తే ఇక అంతే…!

 Authored By ramu | The Telugu News | Updated on :11 November 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Old Clothes : ఇంట్లో పాత దుస్తులను దానం చేస్తున్నారా... ఈ పొరపాటు చేస్తే ఇక అంతే...!

Old Clothes : దానం చేయడం అనేది ఒక గొప్ప పని. మీకు ఉన్నదాంట్లోనే దానం చేయమని చాలామంది చెబుతుంటారు. అయితే వయసు పెరిగే కొద్దీ ధరించే బట్టల సైజు కూడా మారుతూ ఉంటుంది. మరి కొంతమంది బట్టలు బాగున్నాయని ఎక్కువగా కొంటారు. కానీ వాటిని ఎక్కువగా ఉపయోగించరు. అలాగే పాత బట్టలను పడేస్తూ ఉంటారు. ఇంకొంత మంది తెలిసిన వాళ్ళకు లేదా పక్కింటి వాళ్లకు ఇస్తారు. మరికొందరైతే పేద వాళ్లకు దానం చేస్తారు. ఇలా దానం చేసే సమయంలో ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. పేద వాళ్లకు బట్టలను దానం చేసినప్పుడు బట్టలు బాగున్నాయని వారు సంతోషిస్తారు. ఈ నేపథ్యంలో ఎలాంటి బట్టలను దానంగా ఇవ్వాలి..? అలాగే ఎవరికి ఇవ్వకూడదు..? అనే విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

Old Clothes : శక్తిని ప్రసరింపజేస్తుంది..

వాస్తు శాస్త్రం ప్రకారం బట్టలకు శక్తిని గ్రహించే తత్వం ఉంటుంది. ఇక దుస్తులు ధరించిన వ్యక్తి భావద్వేగాలు శక్తి అనుభవాలన్నీ కూడా దానం చేసిన వారికి చూపుతాయి. కాబట్టి మీ బట్టలు దానం చేసేటప్పుడు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అయితే దుస్తులలో చాలా రకాలు ఉంటాయి. వీటిని ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదు. ఎందుకంటే దుస్తులకు కూడా కొన్ని వాస్తు నియమాలు ఉంటాయి.

ఇలా శుభ్రం చేసి ఇవ్వండి : దుస్తులను దానంగా ఇచ్చేటప్పుడు పనికిరానివి , చిరిగిపోయినవి కాకుండా మంచి దుస్తులను మాత్రమే దానం చేయాలి. ఇక దానం చేయడానికి ముందుగా నీటిలో ఉప్పు వేసి దుస్తులను అందులో శుభ్రం చేసి ఆరవేసి ఇవ్వాలి. అంతేకాదు దానం చేసిన తర్వాత ఎదుటి వ్యక్తి నుండి ఒక రూపాయి అయినా అడిగి తీసుకోవాలి. బట్టలను దానంగా ఇవ్వాలి అనుకునేవారు గురువారం రోజు ఇవ్వడం చాలా మంచిది.

Old Clothes ఇంట్లో పాత దుస్తులను దానం చేస్తున్నారా ఈ పొరపాటు చేస్తే ఇక అంతే

Old Clothes : ఇంట్లో పాత దుస్తులను దానం చేస్తున్నారా… ఈ పొరపాటు చేస్తే ఇక అంతే…!

ఇలా చేస్తే కుజదోషం పోతుంది : ఇతరులకు సహాయం చేయాలి అనుకున్నప్పుడు పాత దుస్తులకు బదులుగా కొత్త దుస్తులను ఇచ్చేందుకు ప్రయత్నించండి. జాతకంలో కుజు దోషం ఉన్నవారు ఈ పరిహారాన్ని పట్టించండి. చలికాలంలో చాలామంది ఇబ్బంది పడతారు. కాబట్టి దుప్పట్లు స్వేటర్లు రగ్గులు వంటివి కొనుగోలు చేసి దానంగా ఇవ్వడం వలన కుజదోషం పోతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది