Navaratri 2024 : నవరాత్రుల్లో ఉపవాసం చేసేవారు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి… తప్పక తెలుసుకోవాల్సిన విషయం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Navaratri 2024 : నవరాత్రుల్లో ఉపవాసం చేసేవారు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి… తప్పక తెలుసుకోవాల్సిన విషయం…!

Navaratri 2024 : దుర్గాదేవిని ప్రతిష్టించి పూజించే శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఇక ఈ నవరాత్రులలో దుర్గాదేవిని వివిధ రూపాలలో అలంకరించి పూజిస్తారు. అలాగే హిందూమతంలో ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈ సమయంలో చాలామంది అమ్మవారి భక్తులు భక్తిశ్రద్ధలతో దుర్గాదేవిని పూజిస్తూ ఉపవాస దీక్ష చేస్తారు. అయితే హిందూ సాంప్రదాయాల ప్రకారం ఉపవాసం చేయడం అనేది మతపరమైనటువంటి ఒక విధి మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అయితే నవరాత్రులలో ఉపవాసం […]

 Authored By ramu | The Telugu News | Updated on :5 October 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Navaratri 2024 : నవరాత్రుల్లో ఉపవాసం చేసేవారు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి... తప్పక తెలుసుకోవాల్సిన విషయం...!

Navaratri 2024 : దుర్గాదేవిని ప్రతిష్టించి పూజించే శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఇక ఈ నవరాత్రులలో దుర్గాదేవిని వివిధ రూపాలలో అలంకరించి పూజిస్తారు. అలాగే హిందూమతంలో ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈ సమయంలో చాలామంది అమ్మవారి భక్తులు భక్తిశ్రద్ధలతో దుర్గాదేవిని పూజిస్తూ ఉపవాస దీక్ష చేస్తారు. అయితే హిందూ సాంప్రదాయాల ప్రకారం ఉపవాసం చేయడం అనేది మతపరమైనటువంటి ఒక విధి మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అయితే నవరాత్రులలో ఉపవాసం చేసే సమయంలో కచ్చితంగా ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాకాకుండా అజాగ్రత్తగా ప్రవర్తిస్తే కచ్చితంగా ఆరోగ్యం పాడవుతుందని తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నవరాత్రులలో ఉపవాసం పాటించే వారు కచ్చితంగా కొన్ని పద్ధతులను తెలుసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Navaratri 2024 హైడ్రేట్ గా ఉండండి…

ఉపవాసం ఉండేవారు ఈ సమయంలో శరీరానికి తగినంత నీరు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక ఈ ఉపవాస దీక్షను చేసే సమయంలో కచ్చితంగా నీటిని ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా శరీరం డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి రోజుకి కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు త్రాగాలి. శరీరం హైడ్రేట్ గా ఉంటే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ సరిగా ఉంటుంది. తద్వారా మీరు యాక్టివ్ గా కనిపిస్తారు.

Navaratri 2024 ఆయిల్ ఫుడ్ తీసుకోవడం…

ఉపవాస దీక్షను చేస్తున్న సమయంలో పొరపాటున కూడా నూనెలో వేయించిన ఆహారాన్ని తెలుసుకోకూడదు. అయితే నూనె పదార్థాలు ఆరోగ్యానికి హానికరమని మనందరికీ తెలిసిందే. ఇవి గుండె సమస్యలను పెంచుతాయి. మరీ ముఖ్యంగా ఉపవాస సమయంలో వీటిని తీసుకున్నట్లయితే వీటి ప్రభావం నేరుగా గుండెపై పడుతుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ముఖ్యంగా మధుమేహం కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు వీటికి దూరంగా ఉండాలి. వీటికి బదులుగా పండ్లను తీసుకోవడం మంచిది.

Navaratri 2024 కాళీ కడుపుతో ఎక్కువసేపు ఉండకండి

చాలామంది ఉపవాస సమయంలో ఎక్కువసేపు ఏమీ తినకుండా తాగకుండా ఉంటారు. ఈ సమయంలో ఇలా చేయడం అనేది అస్సలు మంచిది కాదు. ఖాళీ కడుపుతో ఎక్కువసేపు ఉన్నట్లయితే ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి ప్రతి 2, 3 గంటలకు ఏదో ఒకటి తినడం లేదా తాగడం వంటివి చేయాలి. ఆకలితో ఉండటం వలన ఎసిడిటీ లేదా తలనొప్పి వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో త్వరగా అలసిపోతారు.

Navaratri 2024 నవరాత్రుల్లో ఉపవాసం చేసేవారు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి తప్పక తెలుసుకోవాల్సిన విషయం

Navaratri 2024 : నవరాత్రుల్లో ఉపవాసం చేసేవారు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి… తప్పక తెలుసుకోవాల్సిన విషయం…!

Navaratri 2024 ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి

ఉపవాసం చేసేవారు కచ్చితంగా ప్రోటీన్ ఫ్రూట్స్ తీసుకోవడం చాలా మంచిది. ఈ క్రమంలో తీసుకునే ఆహారంలో పెరుగు పాలు బాదం వంటి వాటిని చేర్చుకోవాలి. ఉపవాస సమయంలో వీటిని తినడం వలన చాలా శక్తి లభిస్తుంది. అంతేకాక ఇవి జీర్ణం అవ్వడానికి కూడా కాస్త సమయం పడుతుంది కాబట్టి త్వరగా ఆకలి అనిపించదు.

ఈ సమస్య ఉన్నవారు ఉపవాసం చేయకండి…

మధుమేహం రక్తపోటు క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధి ఉన్నవారు ఈ ఉపవాసం చేయడం అస్సలు మంచిది కాదు. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఉపవాసం చేయడం మంచిది కాదు. ఒకవేళ మీరు ఉపవాసం ఉండాలి అనుకుంటే ముందుగా మీ ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది