Home » Devotional » Never Help This Type Of Peoples In Your Life
Devotional

Chanakyaniti : ఇలాంటి వారికి పొరపాటున కూడా సాయం చేయకండి… చాణక్యుడి నీతి శాస్త్రం ఏం చెబుతుందంటే…!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: September 11, 2024 5:16 pm
Advertisement

Chanakyaniti : ఆచార్య చాణిక్యుడు చెప్పిన మాటలు నేటి వరకు నిజం అవుతూనే ఉన్నాయి. వాటిని చాలా మంది పాటిస్తూనే ఉన్నారు. అయితే చాణక్యుడు తన అభిప్రాయాలను నీతి శాస్త్రంలో వివరంగా తెలిపాడు. అయితే సహాయం చేయడం అనేది మంచిదని ప్రతి ఒక్కరూ భావిస్తారు. చిన్నతనంలో పాఠశాలలో ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలని నేర్పిస్తారు. సహాయం చేయడం అనేది ఒక మంచి గుణం. ఇదే విషయాన్ని చాణుక్యుడు నీతి శాస్త్రం ద్వారా వివరించాడు. దీంతోపాటుగా ఎంత అవసరం వచ్చిన సరే సహాయం చేయని వ్యక్తులు కూడా ఉంటారని ఆయన తెలిపాడు. ఒకవేళ ఆ వ్యక్తికి సహాయం చేస్తే సాయం చేసిన వ్యక్తి కూడా నష్టపోవాల్సి వస్తుందని చాణిక్యుడు చెప్పాడు. మరి ఆ వ్యక్తులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Advertisement

Chanakyaniti మద్యానికి బానిసైన వ్యక్తులు

మద్యానికి , మత్తుకు బానిసైన వ్యక్తులను నమ్మడం చాలా కష్టం. ఎందుకంటే వీరు చెప్పే మాటల్లో నిజం ఉండదు. ముఖ్యంగా మత్తుకు బానిసైనా వ్యక్తులు ఎల్లప్పుడు తన బాధ్యతల నుండి తప్పుకోవలనే చూస్తారు. అదేవిధంగా మద్యం మత్తులో ఉన్నప్పుడు ఒకల వ్యవహరిస్తారు. మత్తులో లేనప్పుడు మరొకల వ్యవహరిస్తారు. వీరి మానసిక స్థితి మారుతూ ఉంటుంది. అయితే వీరు ఏ విషయాన్ని అయిన త్వరగా మర్చిపోతారు. ఇలాంటివారు డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు. కాబట్టి వీరికి సహాయం చేసిన ఎలాంటి ప్రయోజనం ఉండదు.

Chanakyaniti అసంతృప్తితో ఉన్నవారికి

ప్రపంచంలో సగం జనం తాను సమస్యలో ఉన్నాను అనే భావిస్తారు. వీరు ఏ విషయంలోనైనా సంతృప్తి చెందరు. ఎప్పుడు విచారంగా ఉంటారు. ఇలాంటి వ్యక్తులను ఏ విధంగాను సంతోష పెట్టలేము. వీరికి ఎంత సహాయం చేసిన వారు అసంతృప్తి చెందుతూనే ఉంటారు. వారి పరిస్థితులకు ఇతరులను దోషులుగా చూపిస్తారు. అటువంటి వారికి సహాయం చేసిన అది వృధా అవుతుంది.

Advertisement

చెడు స్వభావం ఉన్న వ్యక్తులు

చెడు స్వభావం మరియు చెడు అలవాట్లు ఉన్నవారికి ఎప్పుడు దూరంగా ఉండాలి. వీరికి సమాజం లో ఎప్పుడు అవమానమే ఉంటుంది. ఇలాంటి వారికి సహాయం చేయడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. పైగా సహాయం చేసిన వారే నష్టపోతారు.

Chanakyaniti : ఇలాంటి వారికి పొరపాటున కూడా సాయం చేయకండి… చాణక్యుడి నీతి శాస్త్రం ఏం చెబుతుందంటే…!

Advertisement

స్వార్థపరుల నుంచి

స్వార్థానికి మరియు దురాశకి అంతం అనేది ఉండదు. వీరికి సహాయం చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. వీరికి డబ్బు అంటే అపారమైన ఇష్టం. సంపద పట్ల వీరికి ఉన్న పిచ్చితనంతో వీరికి స్వార్థం అనేది పెరిగిపోతుంది. కాబట్టి వీరికి సహాయం చేయడం అనేది అంత మంచిది కాదు. అలాగే చాణిక్యుడు మంచి జీవిత విధానానికి సూత్రాలు విలువలకు మంచితనానికి మద్దతుగా ఉంటాడు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి