Gold Ring : ఈ వేలికి బంగారపు ఉంగరం పెట్టుకుంటే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే… తస్మాత్ జాగ్రత్త…!
Gold Ring : చాలామంది తమ జీవితంలో జ్యోతిష్యాన్ని నమ్ముతుంటారు. ఇక ఈ జ్యోతిష్య శాస్త్రంలో ఆ వ్యక్తి యొక్క గ్రహం మరియు నక్షత్రం రాశి వంటి అనేక విషయాలను బట్టి వారి జాతకం చెప్పబడుతుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని రకాల ఉంగరాలను ధరించడం ద్వారా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. ఈ విధంగా ఉంగరం పెట్టుకోవడం అనేది కొన్ని రకాల నివారణలను కూడా అవలంబిస్తుంది. ఈ విధంగా జ్యోతిష్య ప్రయోజనాలు పొందేందుకు […]
ప్రధానాంశాలు:
Gold Ring : ఈ వేలికి బంగారపు ఉంగరం పెట్టుకుంటే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే... తస్మాత్ జాగ్రత్త...!
Gold Ring : చాలామంది తమ జీవితంలో జ్యోతిష్యాన్ని నమ్ముతుంటారు. ఇక ఈ జ్యోతిష్య శాస్త్రంలో ఆ వ్యక్తి యొక్క గ్రహం మరియు నక్షత్రం రాశి వంటి అనేక విషయాలను బట్టి వారి జాతకం చెప్పబడుతుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని రకాల ఉంగరాలను ధరించడం ద్వారా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. ఈ విధంగా ఉంగరం పెట్టుకోవడం అనేది కొన్ని రకాల నివారణలను కూడా అవలంబిస్తుంది. ఈ విధంగా జ్యోతిష్య ప్రయోజనాలు పొందేందుకు చాలా మంది బంగారపు ఉంగరాలను ధరించేందుకు ఇష్టపడతారు. కానీ బంగారపు ఉంగరం ఏ చేతికి ధరించడం సరైనదో మీకు తెలుసా..? తప్పుడు వేలికి ఉంగరం ధరిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి..?దీనివలన ఎలాంటి నష్టాలు మొదలవుతాయి..?అసలు బంగారపు ఉంగరాన్ని ఏ వేలికి ధరించాలి..? దీనివలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Gold Ring : బంగారపు ఉంగరం ఎందుకు…?
హిందూమతంలో బంగారాన్ని పవిత్రమైనదిగా పరిగణించడం జరిగింది. అందుకే భారతీయులు బంగారాన్ని అమితంగా ఇష్టపడుతుంటారు. ఏవైనా శుభకార్యాలకు పండుగలకు వివాహాలలో బంగారాన్ని అలంకారానికి ఉపయోగిస్తుంటారు. అంతేకాక హిందూ సాంప్రదాయాలలో బంగారాన్ని లక్ష్మీదేవికి చిహ్నంగా పరిగణించడం జరిగింది. ఇక ఈ బంగారం అనేది ఇంటికి ఆనందాన్ని శ్రేయస్సును ఇస్తుందని ఒక నమ్మకం.అందుకే బంగారం కూడా మనుషుల జీవితాలను ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతుంటారు. అయితే బంగారాన్ని ధరించడం వలన సూర్యుని యొక్క శక్తి పెరుగుతుంది. దీంతో మీ జీవితంలో శుభయోగాలు ప్రారంభమవుతాయి. కావున జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నవారు బంగారం ధరించడం మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నవారు బంగారం ధరించడం వలన సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇది వ్యక్తి శక్తిని ఎంతగానో పెంచుతుంది.
Gold Ring : ఏ వేలికి ధరించాలి…
ఉంగరపు వేలుకు బంగారు ఉంగరాన్ని ధరించడం అనేది అన్నివేళలా శుభ ఫలితాలను కలిగేలా చేస్తుంది. అయితే మన శరీరంలో ఉంగరపు వేలు గుండె శిరలకు కనెక్ట్ అయి ఉంటాయి. కావున బంగారపు ఉంగరాన్ని ఉంగరపు వేలుకు ధరించడం వలన ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం. అందుకే నిశ్చితార్థ సమయంలో కూడా ఉంగరాలను ఉంగరపు వెళికే ధరిస్తారు. అంతేకాక చిటికెన వేలుకు కూడా బంగారపు ఉంగరాలను ధరించవచ్చు.
Gold Ring : ఏ వేలికి బంగారు ఉంగరం ధరించకూడదు…
మధ్య వేలుకు బంగారపు ఉంగరం ధరించడం అనేది శాస్త్రీయంగా అశుభమని తెలియజేయడం జరిగింది. మధ్య వేలుకు బంగారపు ఉంగరం ధరిస్తే దుష్ఫలితాలు ఏర్పడతాయని అంతేకాక మధ్య వేలు శని గ్రహానికి సంబంధించింది కాబట్టి అశుభ ఫలితాలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. కనుక మధ్య వేలికి బంగారు ఉంగరం ధరించడం మంచిది కాదు.