
Tathastu : తధాస్తు దేవతలు అన్నవి నిజంగానే జరుగుతాయా... శాస్త్రం ఏం చెబుతోందంటే...!
Tathastu : సాధారణంగా పెద్దలు సాయంత్రం పూట ఎలాంటి చెడు మాటలు మాట్లాడకూడదని చెబుతుంటారు. ఎందుకంటే సాయంత్రం పూట తధాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారని ,వీరు తధాస్తు అంటే ఆ మాటలు నిజమవుతాయని అంటారు. అయితే దీనిని చాలామంది వినే ఉంటారు అలాగే నమ్ముతారు కూడా ఇక ఇలా ఎందుకు అంటారు కొంతమందికి తెలియకపోవచ్చు. అలాగే పురాణాలు తెలిసిన వారికి మాత్రం ఇది తెలిసే ఉంటుంది. అసలు తధాస్తు దేవతలు ఎవరు..? తధాస్తు అంటే నిజంగానే నిజమవుతాయా..? ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే.. నిజంగానే తధాస్తు దేవతలు ఉన్నారు. ఇక తధాస్తు అంటే అనుకున్నది జరుగుతాయని అర్థం. అందుకే పెద్దలు సాయంత్రం పూట ఎలాంటి చెడు మాటలు మాట్లాడకూడదు అని చెబుతారు. పురాణాల ప్రకారం సూర్యుడి నుంచి వచ్చే వేడిని తట్టుకోలేక సూర్యుడి భార్య అయిన సంధ్యాదేవి గుర్రం రూపం ధరించి కురుదేశానికి దూరంగా వెళ్లిపోయింది. సంధ్యాదేవి దూరాన్ని భరించలేక సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని ధరించి సంధ్యదేవి దగ్గరకు వెళ్లాడు. ఇక వీరిద్దరి కలయిక కారణంగా అశ్వని దేవతలు ఉద్రభవిస్తారు. వీళ్లను తధాస్తు మరియు వైద్య దేవతలుగా పిలుస్తారు.
తధాస్తు దేవతలు ఎంతో వేగంగా ప్రయాణిస్తారు. అయితే మీరు ఎక్కువగా సంధ్యా సమయంలో తధాస్తు తథాస్తు అనుకుంటూ ప్రయాణిస్తారు. ఈ సమయంలో మనం ఏది అనుకున్న అది జరుగుతుంది. అందుకే పెద్దలు సాయంత్రం పూట చెడు మాటలు మాట్లాడుకూడదని చెబుతారు. తధాస్తు దేవతలు ఎప్పుడు వేదమంత్రాలు జపిస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరు యజ్ఞాలు యాగాలు జరిగే చోట ఎక్కువ సంచరిస్తూ ఉంటారు.
Tathastu : తధాస్తు దేవతలు అన్నవి నిజంగానే జరుగుతాయా… శాస్త్రం ఏం చెబుతోందంటే…!
సంధ్యా సమయంలో ధనం లేదని ఏమీ లేదని అనకూడదు. ఇలా అంటే లేకుండా పోతుంది. అంతేకాకుండా మన గురించి లేదా ఇతరుల గురించి తప్పుగా మాట్లాడిన కూడా అవి నిజమవుతాయి. అందుకే ఎలాంటి చెడు మాట్లాడకూడదు మంచి బుద్ధి కావాలని కోరుకోవాలి. అయితే ఈ సమయంలో గొడవలు అస్సలు పడకూడదు. కోపంగా కూడా ఉండకూడదు. అలాగే ఇంట్లో పెద్దలు సుమంగళిగా ఉండాలని అంటారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.