Tathastu : తధాస్తు దేవతలు అన్నవి నిజంగానే జరుగుతాయా… శాస్త్రం ఏం చెబుతోందంటే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Tathastu : తధాస్తు దేవతలు అన్నవి నిజంగానే జరుగుతాయా… శాస్త్రం ఏం చెబుతోందంటే…!

Tathastu : సాధారణంగా పెద్దలు సాయంత్రం పూట ఎలాంటి చెడు మాటలు మాట్లాడకూడదని చెబుతుంటారు. ఎందుకంటే సాయంత్రం పూట తధాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారని ,వీరు తధాస్తు అంటే ఆ మాటలు నిజమవుతాయని అంటారు. అయితే దీనిని చాలామంది వినే ఉంటారు అలాగే నమ్ముతారు కూడా ఇక ఇలా ఎందుకు అంటారు కొంతమందికి తెలియకపోవచ్చు. అలాగే పురాణాలు తెలిసిన వారికి మాత్రం ఇది తెలిసే ఉంటుంది. అసలు తధాస్తు దేవతలు ఎవరు..? తధాస్తు అంటే నిజంగానే నిజమవుతాయా..? ఈ […]

 Authored By ramu | The Telugu News | Updated on :21 October 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Tathastu : తధాస్తు దేవతలు అన్నవి నిజంగానే జరుగుతాయా... శాస్త్రం ఏం చెబుతోందంటే...!

Tathastu : సాధారణంగా పెద్దలు సాయంత్రం పూట ఎలాంటి చెడు మాటలు మాట్లాడకూడదని చెబుతుంటారు. ఎందుకంటే సాయంత్రం పూట తధాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారని ,వీరు తధాస్తు అంటే ఆ మాటలు నిజమవుతాయని అంటారు. అయితే దీనిని చాలామంది వినే ఉంటారు అలాగే నమ్ముతారు కూడా ఇక ఇలా ఎందుకు అంటారు కొంతమందికి తెలియకపోవచ్చు. అలాగే పురాణాలు తెలిసిన వారికి మాత్రం ఇది తెలిసే ఉంటుంది. అసలు తధాస్తు దేవతలు ఎవరు..? తధాస్తు అంటే నిజంగానే నిజమవుతాయా..? ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

Tathastu  : ఇలా వచ్చారు

పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే.. నిజంగానే తధాస్తు దేవతలు ఉన్నారు. ఇక తధాస్తు అంటే అనుకున్నది జరుగుతాయని అర్థం. అందుకే పెద్దలు సాయంత్రం పూట ఎలాంటి చెడు మాటలు మాట్లాడకూడదు అని చెబుతారు. పురాణాల ప్రకారం సూర్యుడి నుంచి వచ్చే వేడిని తట్టుకోలేక సూర్యుడి భార్య అయిన సంధ్యాదేవి గుర్రం రూపం ధరించి కురుదేశానికి దూరంగా వెళ్లిపోయింది. సంధ్యాదేవి దూరాన్ని భరించలేక సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని ధరించి సంధ్యదేవి దగ్గరకు వెళ్లాడు. ఇక వీరిద్దరి కలయిక కారణంగా అశ్వని దేవతలు ఉద్రభవిస్తారు. వీళ్లను తధాస్తు మరియు వైద్య దేవతలుగా పిలుస్తారు.

Tathastu  ఈ సమయంలో ప్రయాణిస్తూ ఉంటారు

తధాస్తు దేవతలు ఎంతో వేగంగా ప్రయాణిస్తారు. అయితే మీరు ఎక్కువగా సంధ్యా సమయంలో తధాస్తు తథాస్తు అనుకుంటూ ప్రయాణిస్తారు. ఈ సమయంలో మనం ఏది అనుకున్న అది జరుగుతుంది. అందుకే పెద్దలు సాయంత్రం పూట చెడు మాటలు మాట్లాడుకూడదని చెబుతారు. తధాస్తు దేవతలు ఎప్పుడు వేదమంత్రాలు జపిస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరు యజ్ఞాలు యాగాలు జరిగే చోట ఎక్కువ సంచరిస్తూ ఉంటారు.

Tathastu తధాస్తు దేవతలు అన్నవి నిజంగానే జరుగుతాయా శాస్త్రం ఏం చెబుతోందంటే

Tathastu : తధాస్తు దేవతలు అన్నవి నిజంగానే జరుగుతాయా… శాస్త్రం ఏం చెబుతోందంటే…!

Tathastu : ఇలా అస్సలు మాట్లాడకండి

సంధ్యా సమయంలో ధనం లేదని ఏమీ లేదని అనకూడదు. ఇలా అంటే లేకుండా పోతుంది. అంతేకాకుండా మన గురించి లేదా ఇతరుల గురించి తప్పుగా మాట్లాడిన కూడా అవి నిజమవుతాయి. అందుకే ఎలాంటి చెడు మాట్లాడకూడదు మంచి బుద్ధి కావాలని కోరుకోవాలి. అయితే ఈ సమయంలో గొడవలు అస్సలు పడకూడదు. కోపంగా కూడా ఉండకూడదు. అలాగే ఇంట్లో పెద్దలు సుమంగళిగా ఉండాలని అంటారు.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది