Home » Devotional » Secrets Of Lakshmi Devi Katksham Pooja
Devotional

Lakshmi Devi Pooja : ఈ వస్తువులతో లక్ష్మీదేవి పూజ చూస్తే డబ్బే డబ్బు… తప్పక తెలుసుకోండి..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: June 24, 2024, 12:00 pm
Advertisement

Lakshmi Devi Pooja : కొన్ని వస్తువులు ఉండటం వలన ఇంట్లో ధనం కోల్పోవడం జరుగుతుంది. అలాంటి వస్తువులు ఇంట్లో ఉంటే ఆర్థికంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి మన సంపద మరియు ధనం పై దుష్ప్రభావాలను చూపే వస్తువులు ఏంటి..? వాటిని ఎందుకు ఇంట్లో పెట్టుకోకూడదు…? ఏ వస్తువులు ఇంట్లో పెట్టుకుంటే మంచిది..? ఏ వస్తువుల వలన ధన ప్రాప్తి లభిస్తుంది. వంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంట్లో పావురం గూడు ఉండడం వలన ధనం తగ్గిపోయి కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే తేనె టీగలు పెట్టే తేనె తెట్టే ఇంట్లో ఉండడం వలన అపాయమని గుర్తించాలి. అలాగే సాలీడు పేర్చిన గూడు ఇంట్లో అసలు ఉండకూడదు. అది ఇంట్లో ఉండడం వలన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక సమస్యలకు సంకేతం. అలాగే ఇంట్లో పగిలిపోయిన అద్దాలు వాస్తు ప్రకారమే కాకుండా నెగిటివ్ ఎనర్జీ ని కూడా ఇంట్లోకి ఆహ్వానిస్తాయి.

Advertisement

అలాగే దరిద్రాన్ని కూడా తీసుకువస్తాయి అని చెబుతారు. కాబట్టి పగిలిపోయిన అద్దాలు ఉంటే వెంటనే బయటపడేయడం మంచిది. గబ్బిలాలు ఇంట్లో కనిపిస్తే దురదృష్ట పరిస్థితులకు పేదరికం అవ్వడానికి సంకేతాలుగా భావిస్తారు. అలాగే ఇంట్లో ఉండే టాప్స్ లీక్ కావడం వలన ఇంట్లో ఉండే పాజిటివ్ ఎనర్జీ తో పాటు మీ అదృష్టం కూడా బయటకు వెళ్లిపోతాయి.ప్రతిరోజు దేవుడును పూజించేటప్పుడు ఎట్టి పరిస్థితిలోను వాడిపోయిన పువ్వులతో పూజించకూడదు. ఒకవేళ వాడిపోయిన పువ్వులు దేవునికి సమర్పించినట్లయితే దరిద్రాన్ని ఆహ్వానించినట్లు.మీ ఇంట్లో పెంచే మొక్కల ఆకులు ఎప్పుడు పచ్చగానే ఉండాలి. వాడిపోయినవి ఉన్నట్లయితే తొలగించడం మంచిది.వాడిపోయిన ఆకులు అలానే ఉంచడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ ఎట్రాక్ట్ చేస్తాయి.దీనివల్ల ఆర్థిక సమస్యలును ఎదుర్కోవాల్సి వస్తుంది.

Lakshmi Devi Pooja : ఈ వస్తువులతో లక్ష్మీదేవి పూజ చూస్తే డబ్బే డబ్బు… తప్పక తెలుసుకోండి..!

Advertisement

ఇంట్లోకి ధనం అదృష్టాన్ని ఆకర్షించడానికి ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం..

పచ్చటీ మనీ ప్లాంట్ ని ఇంట్లో పెట్టుకోవడం ద్వారా ఇంట్లోకి ధనం రావడాని ఆకర్షిస్తుంది. అలాగే ఆ మొక్క అనేది వంటగది ఆగ్నేయంలోనే ఉండాలి. వంటగది పరిశుభ్రంగా ఉంచడం వలన పాజిటివ్ ఎనర్జీలు ఇంటిని ఆకర్షిస్తాయి. క్యాష్ అలమారాలు దక్షిణం లేదా నైరుతి వైపు ఉండేలా జాగ్రత్త పడండి. లాకర్లో కుబేరుడు విగ్రహం పెట్టడం వలన ఇంట్లోకి అదృష్టం తో పాటు ధనం కూడా వస్తుంది. ఇంట్లో హాల్ లో ఈశాన్యం లో ఎక్వేరియం పెట్టడం చాలా మంచిది. ప్రతిరోజు చాపలకి ఆహారం పెడుతూ ఉండాలి ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటికి సంతోషంతో పాటు ధనం కూడా ఆహ్వానించబడుతుంది.
మీ ఇంటి ప్రధాన ముఖ ద్వారంలో లక్ష్మీ కుబేరుడు లేదా స్వస్తిక్ ఫోటోని అతికించాలి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో డబ్బు ఎక్కడికి పోకుండా స్థిరంగా ఉంటుంది. వాస్తు దేవుడి విగ్రహం లేదా ఫోటోని మీ ఇంట్లో పెట్టుకోవడం వలన మీ ఇంట్లో వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి.ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. అందరూ సుఖసంతోషాలతో ఉంటారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి