Categories: DevotionalNews

Skanda Shashti 2025 : మార్చి 4 న స్కంద షష్టి.. ఈ వస్తువులను దానం చేస్తే… ఎటువంటి ఫలితాలు కలుగుతాయి..?

Advertisement
Advertisement

Skanda Shashti 2025  : మన తెలుగు సాంప్రదాయాలలో ప్రతి సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. ఈ 12 నెలలలో ప్రతి నెలకు ఒక తిద్ధి ఉంటుంది. అయితే ఇది శుక్లపక్ష సృష్టిధి. ఈ తిధిని స్కంద షష్టి అని కూడా అంటారు. ఇతిది ప్రత్యేకంగా శివుని తనయుడైన కార్తికేయుడికి అంకితం చేయబడ్డది. ఈ ప్రత్యేకమైన రోజున ఈయనని శ్రద్ధలతో పూజిస్తారు. ఇంకా ఉపవాసాలు ఆచరిస్తారు. అంతేకాదు, ఈ స్కంద షష్టి రోజున దానధర్మాలు చేస్తే, కార్తికేయుని అనుగ్రహం లభిస్తుంది. అంద షష్టినాడు దానధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ కార్తికేయుడు ఆ రోజున దానం చేసిన వారికి ఎంతో సంతోషాన్ని ఇస్తాడు. ఫలితంగా ఇప్పటివరకు ఆగిపోయిన పనులన్నీ కూడా మరల పునరావృతం జరుగుతుందని భక్తుల యొక్క నమ్మకం. జీవితంలో ఎప్పుడూ ఎలాంటి కష్టాలైనా ఎప్పటికీ రావని ప్రగాఢ విశ్వాసం.
శివకుమారుడైన కార్తికేయుని స్కంద షష్టినాడు హిందువుల ధర్మ ప్రకారం శుక్లపక్ష షష్టి తిది నా స్కంద షష్టి జరుపుకుంటారు. ఇది ముఖ్యంగా హిందూ ధర్మం ప్రకారం జరుపుకునే స్కంద షష్టి పండుగ. ఈ స్కంద షష్టి రోజున కార్తికేయుని పూజిస్తే భక్తుల జీవితంలో వచ్చే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని మరియు సుఖసంతోషాలతోటి, శాంతిని పొందుతారని భక్తుల నమ్మకం. ఇంకా సుబ్రహ్మణ్యస్వామి భక్తులకు స్కంద షష్టి కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగినది. ఈరోజున భక్తులందరూ కూడా కార్తికేయుడిని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తే భక్తుల కోరికలన్నీ నెరవేరుస్తారని భక్తుల నమ్మకం. ఈ పండుగ నాడు పూజ చేస్తే బలం, ధైర్యం, విజయం కలుగుతాయని తెలియజేస్తున్నారు పండితులు……

Advertisement

Skanda Shashti 2025 : మార్చి 4 న స్కంద షష్టి.. ఈ వస్తువులను దానం చేస్తే… ఎటువంటి ఫలితాలు కలుగుతాయి..?

మనకు హిందూ ధర్మంలో కొన్ని పంచాంగాలు ఉన్నాయి. జ్యోతిష్యులు కొన్ని పంచాంగాలను చూసి ఏ పండుగలు ఎప్పుడు, మంచి చెడు రోజులను మరియు వాటి తిధులను గురించి తెలియజేస్తారు. అటువంటి పంచాంగమే దృక్ పంచాంగం. ఈ పంచాంగంలో పాల్గొనమాసం, శుక్లపక్షం షష్టి తిది మార్చి 4వ తేదీన, మంగళవారం మధ్యాహ్న సమయంలో 3:16 గంటలకు ప్రారంభమవుతుంది. తదుపరి మరుసటి రోజున మార్చి 5వ తేదీ బుధవారం మధ్యాహ్నం సమయంలో 12:51 గంటలకు షష్టి తిది ముగుస్తుంది. ఇటువంటి ఏ సమయంలోనే స్కంద షష్టి ఉపవాసాలు మార్చి 4న ప్రారంభించాల్సి ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున కొన్ని దానాలు చేస్తే.. ఎన్నో రెట్ల పుణ్యఫలం లభిస్తుందని మరియు సుఖ సంతోషాలు కూడా కలిగి ఉంటారని పేర్కొన్నారు పండితులు.

Advertisement

Skanda Shashti 2025  స్కంద షష్టి రోజున వేటిని దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి :

– స్కంద షష్టి తిధి రోజున పండ్లు పలహారాలు దానం చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహానికి ప్రాప్తులవుతారు.
– ఈరోజున పాలు దానం చేస్తే, జ్ఞానం, తెలివితేటలు, విద్యార్థులకు మంచి జ్ఞాపకశక్తి లభిస్తుంది.
– ఇంకా పేదలకు ఆహార ధాన్యాలను దానం చేస్తే గనుక అన్నపూర్ణాదేవి ఆశీస్సులు లభిస్తాయి.
– ఇంకా వస్త్ర దానాలు చేస్తే జీవితంలో సుఖం మరియు సంతోషాన్ని పొందుతారు.
– ఈ స్కంద షష్టినాడు నువ్వులను దానం చేస్తే కనుక పూర్వీకుల ఆశీస్సులు కలిగి శాంతిని పొందుతారు. ఇంకా వారు మోక్షాన్ని పొందగలుగుతారు.
– ఈ స్కంద షష్టి నాడు బెల్లం మరియు నెయ్యిని దానం చేస్తే పూర్వీకుల యొక్క ఆత్మలకు శాంతి చేకూరుతుంది.
– ఈ స్కంద షష్టి నాడు నీరుని దానం చేస్తే పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఎక్కువ దాహంతో ఉన్నవారికి మీరు నీటిని అందించవచ్చు లేదా బహిరంగ ప్రదేశాల్లో త్రాగునీటి చలివేంద్రాలని ఏర్పాటు చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది.
– ఇంకా నిరుపేదలకు దుప్పట్లు దానం చేయడం వల్ల, తెలిసే తెలియక చేసిన కొన్ని పొరపాట్ల వల్ల పాపాలన్నీ కూడా తొలగి పుణ్యం లభించగలరు.

Skanda Shashti 2025  ఈ విషయాలను గుర్తుంచుకోండి

– మీరు స్కంద షష్టినాడు దానం చేయాలనుకుంటే మాత్రం, దానం చేసేటప్పుడు ఎల్లప్పుడూ కూడా.. శ్రద్ధ మరియు భక్తి భావన ఉండాలి. మనస్ఫూర్తిగా దానం చేయాలి. అప్పుడే ఆ ఫలితం దక్కుతుంది.
– దానధర్మాలు ఎక్కువగా పేదవారికి, గుడి దగ్గర ఉన్న అడుక్కునేవారికి దానం చేయాలి. వృద్ధులకు కూడా దానం చేయాలి.
– దానం చేసే ప్రతి ఒక్కరు కూడా అహంకార భావంతోనూ లేదా నేను గొప్ప అని భావంతో దానం అస్సలు చేయకూడదు.
– దానధర్మాలను ఎప్పుడూ కూడా ఎవరికీ తెలియకుండా చేయాలి. ఒకరి ముందు గొప్ప కోసం దానం చేయవద్దు. దయా హృదయంతో దానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Skanda Shashti 2025  స్కంద షష్టి ప్రాముఖ్యత ఏమిటి

మార్చి 4వ తారీఖున స్కంద షష్టి తిధినాడు, కార్తికేయున్ని పూజించడం జరుగుతుంది. ఆ రోజున కార్తికేయనుకి అంకితం చేయబడినది ఈ స్కంద షష్టి. అయితే భక్తులు జీవితంలో ఎన్ని అడ్డంకులను ఎదుర్కొంటున్నారో, అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఈరోజు చేసే పూజలు, వ్రతాలు, ఉపవాసం వంటివి, కోపం, అహంకారం, దురాశ, కామం వంటి చెడు గుణాలన్నీ కూడా తొలగించబడి సంతోషకరమైన జీవితాన్ని గడిపేలా చేస్తుంది. అసలు, ఈ స్కంద షష్టి ఎలా జరుపుతారు అనే విషయానికొస్తే.. పురాణ గ్రంథాల ప్రకారం స్కంద షష్టి రోజున కార్తికేయుడు తారకాసుడు అనే రాక్షసుడిని సంహరిస్తాడు. కాబట్టి ఆ రోజునే కార్తికేయుని పూజించడం జరుగుతుంది. అందుకే, అంధ షష్టి రోజున కార్తికేయుని పూజిస్తే జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదుగుతారని భక్తుల నమ్మకం. ఈ విషయం పురాణాలలో తెలియజేయబడింది.

Advertisement

Recent Posts

Rajitha Parameshwar Reddy : ఉప్పల్ భ‌ర‌త్‌న‌గ‌ర్ మాల‌బ‌స్తీలో రూ.1.70 కోట్ల‌తో అభివృద్ధి పనులు.. : ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌ రెడ్డి

Rajitha Parameshwar Reddy : ఉప్ప‌ల్ డివిజ‌న్ Uppal Division స‌మ‌గ్రాభివృద్ధికి కృషి చేస్తున్న‌ట్టుగా కార్పొరేట‌ర్ మందుముల ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి  Rajitha…

7 hours ago

Raashii Khanna : మైమ‌రిపించే అందాల‌తో మంత్ర ముగ్ధుల్ని చేస్తున్న రాశీ ఖ‌న్నా.. ఫొటోలు వైర‌ల్

Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖ‌న్నా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…

8 hours ago

Boy Saved 39 Acres : ఒక్క లెటర్ తో 39 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా కాకుండ సేవ్ చేసిన బాలుడు..!

Boy Saved 39 Acres : హైదరాబాద్‌లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…

9 hours ago

Vitamin D : దాంపత్య జీవితానికి ఈ విటమిన్ లోపిస్తే… అందులో సామర్థ్యం తగ్గుతుందట… ఇక అంతే సంగతులు…?

Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…

10 hours ago

Saree Viral Video : ఓహ్..ఈ టైపు చీరలు కూడా వచ్చాయా..? దేవుడా..?

Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…

11 hours ago

Raj Tarun – Lavanya : రాజ్ తరుణ్- లావణ్య కేసులో సంచలన ట్విస్ట్..!

Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…

12 hours ago

Chandrababu : చంద్రబాబు జన్మదిన వేడుకలు .. వేలిముద్రలతో చంద్రబాబు చిత్రం.. కుప్పం మహిళల మజాకా..!

Chandrababu  : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…

13 hours ago

Yellamma Movie : రంగ్ దే కాంబో రిపీట్ చేస్తున్న జ‌బ‌ర్ధ‌స్త్ వేణు.. ఎల్ల‌మ్మ‌పై భారీ అంచ‌నాలు..!

Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్‌బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్ర‌స్తుతం…

14 hours ago