Skanda Shashti 2025 : మార్చి 4 న స్కంద షష్టి.. ఈ వస్తువులను దానం చేస్తే… ఎటువంటి ఫలితాలు కలుగుతాయి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Skanda Shashti 2025 : మార్చి 4 న స్కంద షష్టి.. ఈ వస్తువులను దానం చేస్తే… ఎటువంటి ఫలితాలు కలుగుతాయి..?

 Authored By ramu | The Telugu News | Updated on :4 March 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Skanda shashti 2025 : మార్చి 4 న స్కంద షష్టి.. ఈ వస్తువులను దానం చేస్తే... ఎటువంటి ఫలితాలు కలుగుతాయి..?

Skanda Shashti 2025  : మన తెలుగు సాంప్రదాయాలలో ప్రతి సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. ఈ 12 నెలలలో ప్రతి నెలకు ఒక తిద్ధి ఉంటుంది. అయితే ఇది శుక్లపక్ష సృష్టిధి. ఈ తిధిని స్కంద షష్టి అని కూడా అంటారు. ఇతిది ప్రత్యేకంగా శివుని తనయుడైన కార్తికేయుడికి అంకితం చేయబడ్డది. ఈ ప్రత్యేకమైన రోజున ఈయనని శ్రద్ధలతో పూజిస్తారు. ఇంకా ఉపవాసాలు ఆచరిస్తారు. అంతేకాదు, ఈ స్కంద షష్టి రోజున దానధర్మాలు చేస్తే, కార్తికేయుని అనుగ్రహం లభిస్తుంది. అంద షష్టినాడు దానధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ కార్తికేయుడు ఆ రోజున దానం చేసిన వారికి ఎంతో సంతోషాన్ని ఇస్తాడు. ఫలితంగా ఇప్పటివరకు ఆగిపోయిన పనులన్నీ కూడా మరల పునరావృతం జరుగుతుందని భక్తుల యొక్క నమ్మకం. జీవితంలో ఎప్పుడూ ఎలాంటి కష్టాలైనా ఎప్పటికీ రావని ప్రగాఢ విశ్వాసం.
శివకుమారుడైన కార్తికేయుని స్కంద షష్టినాడు హిందువుల ధర్మ ప్రకారం శుక్లపక్ష షష్టి తిది నా స్కంద షష్టి జరుపుకుంటారు. ఇది ముఖ్యంగా హిందూ ధర్మం ప్రకారం జరుపుకునే స్కంద షష్టి పండుగ. ఈ స్కంద షష్టి రోజున కార్తికేయుని పూజిస్తే భక్తుల జీవితంలో వచ్చే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని మరియు సుఖసంతోషాలతోటి, శాంతిని పొందుతారని భక్తుల నమ్మకం. ఇంకా సుబ్రహ్మణ్యస్వామి భక్తులకు స్కంద షష్టి కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగినది. ఈరోజున భక్తులందరూ కూడా కార్తికేయుడిని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తే భక్తుల కోరికలన్నీ నెరవేరుస్తారని భక్తుల నమ్మకం. ఈ పండుగ నాడు పూజ చేస్తే బలం, ధైర్యం, విజయం కలుగుతాయని తెలియజేస్తున్నారు పండితులు…

Skanda Shashti 2025 మార్చి 4 న స్కంద షష్టి ఈ వస్తువులను దానం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి

Skanda Shashti 2025 : మార్చి 4 న స్కంద షష్టి.. ఈ వస్తువులను దానం చేస్తే… ఎటువంటి ఫలితాలు కలుగుతాయి..?

మనకు హిందూ ధర్మంలో కొన్ని పంచాంగాలు ఉన్నాయి. జ్యోతిష్యులు కొన్ని పంచాంగాలను చూసి ఏ పండుగలు ఎప్పుడు, మంచి చెడు రోజులను మరియు వాటి తిధులను గురించి తెలియజేస్తారు. అటువంటి పంచాంగమే దృక్ పంచాంగం. ఈ పంచాంగంలో పాల్గొనమాసం, శుక్లపక్షం షష్టి తిది మార్చి 4వ తేదీన, మంగళవారం మధ్యాహ్న సమయంలో 3:16 గంటలకు ప్రారంభమవుతుంది. తదుపరి మరుసటి రోజున మార్చి 5వ తేదీ బుధవారం మధ్యాహ్నం సమయంలో 12:51 గంటలకు షష్టి తిది ముగుస్తుంది. ఇటువంటి ఏ సమయంలోనే స్కంద షష్టి ఉపవాసాలు మార్చి 4న ప్రారంభించాల్సి ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున కొన్ని దానాలు చేస్తే.. ఎన్నో రెట్ల పుణ్యఫలం లభిస్తుందని మరియు సుఖ సంతోషాలు కూడా కలిగి ఉంటారని పేర్కొన్నారు పండితులు.

Skanda Shashti 2025  స్కంద షష్టి రోజున వేటిని దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి :

– స్కంద షష్టి తిధి రోజున పండ్లు పలహారాలు దానం చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహానికి ప్రాప్తులవుతారు.
– ఈరోజున పాలు దానం చేస్తే, జ్ఞానం, తెలివితేటలు, విద్యార్థులకు మంచి జ్ఞాపకశక్తి లభిస్తుంది.
– ఇంకా పేదలకు ఆహార ధాన్యాలను దానం చేస్తే గనుక అన్నపూర్ణాదేవి ఆశీస్సులు లభిస్తాయి.
– ఇంకా వస్త్ర దానాలు చేస్తే జీవితంలో సుఖం మరియు సంతోషాన్ని పొందుతారు.
– ఈ స్కంద షష్టినాడు నువ్వులను దానం చేస్తే కనుక పూర్వీకుల ఆశీస్సులు కలిగి శాంతిని పొందుతారు. ఇంకా వారు మోక్షాన్ని పొందగలుగుతారు.
– ఈ స్కంద షష్టి నాడు బెల్లం మరియు నెయ్యిని దానం చేస్తే పూర్వీకుల యొక్క ఆత్మలకు శాంతి చేకూరుతుంది.
– ఈ స్కంద షష్టి నాడు నీరుని దానం చేస్తే పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఎక్కువ దాహంతో ఉన్నవారికి మీరు నీటిని అందించవచ్చు లేదా బహిరంగ ప్రదేశాల్లో త్రాగునీటి చలివేంద్రాలని ఏర్పాటు చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది.
– ఇంకా నిరుపేదలకు దుప్పట్లు దానం చేయడం వల్ల, తెలిసే తెలియక చేసిన కొన్ని పొరపాట్ల వల్ల పాపాలన్నీ కూడా తొలగి పుణ్యం లభించగలరు.

Skanda Shashti 2025  ఈ విషయాలను గుర్తుంచుకోండి

– మీరు స్కంద షష్టినాడు దానం చేయాలనుకుంటే మాత్రం, దానం చేసేటప్పుడు ఎల్లప్పుడూ కూడా.. శ్రద్ధ మరియు భక్తి భావన ఉండాలి. మనస్ఫూర్తిగా దానం చేయాలి. అప్పుడే ఆ ఫలితం దక్కుతుంది.
– దానధర్మాలు ఎక్కువగా పేదవారికి, గుడి దగ్గర ఉన్న అడుక్కునేవారికి దానం చేయాలి. వృద్ధులకు కూడా దానం చేయాలి.
– దానం చేసే ప్రతి ఒక్కరు కూడా అహంకార భావంతోనూ లేదా నేను గొప్ప అని భావంతో దానం అస్సలు చేయకూడదు.
– దానధర్మాలను ఎప్పుడూ కూడా ఎవరికీ తెలియకుండా చేయాలి. ఒకరి ముందు గొప్ప కోసం దానం చేయవద్దు. దయా హృదయంతో దానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Skanda Shashti 2025  స్కంద షష్టి ప్రాముఖ్యత ఏమిటి

మార్చి 4వ తారీఖున స్కంద షష్టి తిధినాడు, కార్తికేయున్ని పూజించడం జరుగుతుంది. ఆ రోజున కార్తికేయనుకి అంకితం చేయబడినది ఈ స్కంద షష్టి. అయితే భక్తులు జీవితంలో ఎన్ని అడ్డంకులను ఎదుర్కొంటున్నారో, అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఈరోజు చేసే పూజలు, వ్రతాలు, ఉపవాసం వంటివి, కోపం, అహంకారం, దురాశ, కామం వంటి చెడు గుణాలన్నీ కూడా తొలగించబడి సంతోషకరమైన జీవితాన్ని గడిపేలా చేస్తుంది. అసలు, ఈ స్కంద షష్టి ఎలా జరుపుతారు అనే విషయానికొస్తే.. పురాణ గ్రంథాల ప్రకారం స్కంద షష్టి రోజున కార్తికేయుడు తారకాసుడు అనే రాక్షసుడిని సంహరిస్తాడు. కాబట్టి ఆ రోజునే కార్తికేయుని పూజించడం జరుగుతుంది. అందుకే, అంధ షష్టి రోజున కార్తికేయుని పూజిస్తే జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదుగుతారని భక్తుల నమ్మకం. ఈ విషయం పురాణాలలో తెలియజేయబడింది.

Advertisement
WhatsApp Group Join Now

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది