Sravanmasam : శ్రావణ మాసంలో ఇంట్లో శివుడి చిత్ర పటం ఉంచడంపై వాస్తు నిపుణుల సూచనలు
ప్రధానాంశాలు:
Sravanmasam : శ్రావణ మాసంలో ఇంట్లో శివుడి చిత్ర పటం ఉంచడంపై వాస్తు నిపుణుల సూచనలు
Sravanmasam : శివుడికి అత్యంత ప్రీతికరమైన శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ పవిత్ర కాలంలో శివుని భక్తి, పూజలకు విశేష ప్రాముఖ్యత ఉంది. శ్రావణ మాసంలో శివలింగానికి అభిషేకం చేయడం, ఉపవాసం, రుద్రాధ్యాయ పారాయణం, నైవేద్యం తదితర ఆచారాలు శివుడిని ప్రసన్నుడిని చేస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో, ఇంట్లో శివుని చిత్రపటము ఉంచడమూ శుభప్రదంగా భావించబడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలు పాటిస్తే శివుడి అనుగ్రహం ఇంటికి చేరుతుందని నిపుణులు చెబుతున్నారు.

Sravanmasam : శ్రావణ మాసంలో ఇంట్లో శివుడి చిత్ర పటం ఉంచడంపై వాస్తు నిపుణుల సూచనలు
Sravanmasam : ఇలా చేయండి..
ఇంట్లో శివుడి చిత్రం ఉంచేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన వాస్తు నియమాలు చూస్తే.. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర లేదా ఈశాన్య దిశ దేవతలకు అనుకూలమైనది. శివుని చిత్రం ఈ దిశలో ఉంచితే శక్తి, శాంతి, ధనస్సు పూరక వాతావరణం ఏర్పడుతుంది. శివుడు సాధారణంగా ధ్యానంలో లీనమైనవాడిగా ప్రతిష్ఠితుడయ్యే దేవుడు. కాబట్టి శాంతియుతంగా కూర్చున్న భంగిమలో ఉన్న శివుడి చిత్రాన్ని ఉంచడం మంచిది. తాండవం, అఘోర రూపాలు, శివుడు రౌద్రంగా ఉన్న చిత్రాలను ఇంట్లో పెట్టకూడదు. ఇవి శాంతికీ, సానుకూలతకీ విఘాతం కలిగించవచ్చు.
ఇంటి ప్రవేశద్వారం వద్ద శివుడి చిత్రాన్ని ఉంచకూడదు. శక్తి ప్రవాహం ఇబ్బందిపడుతుంది. బదులుగా గణేశుడి విగ్రహాన్ని అక్కడ ఉంచడం శుభప్రదం. ఇంట్లోని దేవాలయ స్థలంలో లేదా పూజా గదిలో శివుని చిత్రం ఉంచడం ఉత్తమం. ఇది ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచుతుంది. వాస్తు నిబంధనల ప్రకారం వంటగది, పడకగది, బాత్రూమ్ సమీపంలో శివుని చిత్రం ఉంచకూడదు. ఇది ప్రతికూల శక్తులను ఆకర్షించగలదు.శ్రావణ మాసంలో శివుడి అనుగ్రహం కోరుతున్నవారు ఈ నియమాలను పాటించడం వల్ల ఆధ్యాత్మిక శక్తి, శాంతి, సుభిక్షతలు ఇంటికి వస్తాయని నమ్మకం. శివునికి భక్తితో చేసిన ఏ ఆచారం అయినా మనస్సారా, శ్రద్ధగా ఉంటే తప్పకుండా ఫలితం అందుతుంది.