Sri Rama Navami : శ్రీరామ నవమికి చేయాల్సిన ప్రసాదాలు ఇవే.. మీరూ ఓసారి ట్రై చేయండి!

Sri Rama Navami : శ్రీరామ నవమి అంటే సీతారాముల కల్యాణంతో పాటు ఆరోజు చేసే ప్రసాదాలు కూడా గుర్తొస్తాయి. ముఖ్యంగా ఆరోజు చేసే పానకం అంటే చాలా మందికి ఇష్టం. అయితే ఆరోజు వడపప్పు, పానకమే కాకుండా ఇంకొన్ని పదార్థాలు కూడా చేస్కుంటారు. అయితే అవేంటో మనం కూడా తెల్సుకొని ఒకసారి ట్రై చేద్దాం. స్వామి వారికి నచ్చే ఈ ప్రసాదాలను సమర్పించి వారి కృపకు పాత్రులు అవుదాం.

1. డ్రైప్ర్టూట్స్ చివ్ డా ; ఈ పార్థాన్ని తయారు చేసుకునేందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా జీడి పప్పు, బాదం, పల్లీలు, మందంగా ఉండే అటుకులు, ఎండు కొబ్బరి ముక్కలు, కిస్ మిస్, ఎండు నల్ల ద్రాక్షలన్నూ పావుకప్పు చొప్పున తీసుకోవాలి. కరివేపాకు ఒక రెబ్బ, పసుపు పావు చెంచా, కారం అర చెంచా, ఎండుమిర్చి రెండు, ఉప్పు తగినంత, నూనె రెండు చెచాలు.

తయారీ విధానం… స్టౌ మీద కడాయి పెట్టి చెంచా నూనె వేయాలి. కాస్త వేడయ్యాక జీడిపప్పు, బాదం, పల్లీలను వేయించి తీసుకోవాలి. అదే బాణలిలో నూనె లేకుండా అటుకుల్ని వేయించి తీసుకోవాలి. అందులోనే మిగిలిన నూనె వేసి ఎండుమిర్చి, కరివేపాకు, ఎండుకొబ్బరి ముక్కలు వేయించి స్టౌ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత కాస్త వేడి చల్లారగానే… అదే తాలింపులో డ్రైఫ్రూట్స్‌, పల్లీలు, కిస్‌మిస్‌, ఎండు నల్లద్రాక్ష, అటుకులు, పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి అన్నింటినీ కలుపుకోవాలి.

sri rama navami special food items

2. పానకం : దీనికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. అరకప్పు బెల్లం తరుగు, నీళ్లు రెండు కప్పులు, శొంఠిపొడి, మిరియాల పొడి, యాలకుల పొడి అర చెంచా చొప్పున, ఉప్పు చిటికెడు, ఐసు ముక్కలు రెండు మూడు, నిమ్మరసం రెండు చెంచాలు.

తయారీ విధానం… ఓ గిన్నెలో నీళ్లు, బెల్లం తరుగు వేసుకుని పక్కన పెట్టేస్తే కాసేపటికి బెల్లం పూర్తిగా కరుగుతుంది. ఆ నీటిని వడపోసి, నిమ్మరసంతో పాటూ మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసుకుని బాగా కలిపితే చాలు.

3. మీఠా రైస్‌.. కావలస్సిన పదార్థాలు తప్పు బాస్మతీ బియ్యం, దాల్చిన చెక్క చిన్న ముక్క, లవంగాలు నాలుగు, బిర్యానీ ఆకు ఒకటి, యాలకులు నాలుగు, కుంకుమ పువ్వు పావు చెంచా, ఉప్పు పావు చెంచా, పసుపు పావు చెంచా, నెయ్యి పావు కప్పు, కిస్ మిస్ పది, జీడిపప్పు, బాదాం, పిస్తా పలుకులు పావుకప్పు, పాలు అరకప్పు, చక్కెర ముప్పావు కప్పు.

తయారీ విధానం :  బాస్మతీ బియ్యాన్ని కడిగి పావు గంట సేపు నాన బెట్టుకోవాలి. ఆ తరువాత స్టౌమీద కడాయి పెట్టి ఒకటి ముప్పావు కప్పు నీళ్లు పోసుకోవాలి. బియ్యం, లవంగాలు, దాల్చినచెక్క, బిర్యానీ ఆకు, యాలకులు, ఉప్పు, పసుపు వేయాలి. ఆ తర్వాత అన్నం ముప్పావు వంతు ఉడికాక నీటిని పూర్తిగా వంపేసి, మసాలా దినుసుల్ని తీసేయాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక డ్రై ఫ్రూట్స్‌ పలుకుల్ని వేయించి విడిగా తీసి… అదే బాణలిలో పాలు పోయాలి. అవి మరుగుతున్నప్పుడు అన్నం, చక్కెర, కుంకుమ పువ్వు, వేయించిన డ్రైఫ్రూట్స్‌ పలుకుల్ని వేసి బాగా కలపాలి. అన్నం పొడి పొడిగా అయ్యాక దింపేయాలి.

4. కొబ్బరి గారెలు : వీటికి కావలసిన పదార్థాలు కప్పు బియ్యప్పిండి, అరకప్పు కొబ్బరి తురుము, ఎనిమిది పచ్చి మిర్చి, జీలకర్ర టేబుల్ స్పూన్, అరకప్పు వేడి నీళ్లు, ఉప్పు తగినంత, వేయించేందుకు సరిపడా నూనె.

తయారీ విధానం :  ఓ గిన్నెలో బియ్యప్పిండి, కొబ్బరి తురుము, తగినంత ఉప్పు, పచ్చిమిర్చి జీలకర్ర కలిపి దంచిన ముద్ద వేసుకుని అన్నింటినీ కలుపుకోవాలి. ఆ తరువాత వేడినీళ్లు పోస్తూ ముద్దలా చేసుకోవాలి. పది నిమిషాలయ్యాక కొద్దిగా పిండిని తీసుకుని నూనె రాసిన ప్లాస్టిక్‌ కవరుమీద చిన్న గారెలా చేసుకుని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇదేవిధంగా మిగిలిన పిండినీ చేసుకోవాలి.

5. కోసంబరి : దీనికోసం కావాలసిన పదార్థాలు కప్పు పెసర కప్పు, రెండు కీరదోస, నాలుగు క్యారెట్లు, ఒక మామిడి కాయ, అరకప్పు కొబ్బరి తురుము, చెంచా ఆవాలు, చెంచా మినప్పప్పు, కట్ట కొత్తమీర, నాలుగు పచ్చి మిర్చి, రెండు రెబ్బల కరివేపాకు, నాలుగు చెంచాల నూనె, పావు చెంచా ఇంగువ, సగం నిమ్మ చెక్క, ఉప్పు తగినంత.

తయారీ విధానం… పెసర పప్పును ఓసారి మంచిగా కడిగి అర గంట సేపు నాననివ్వాలి. ఆ తరువాత నీళ్లు వంపేసి ఓ గిన్నెలో వేసుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన మామిడి, కీరదోస తరుగు, క్యారెట్‌ తురుము, పచ్చిమిర్చి తరుగు, తగినంత ఉప్పు, కొత్తిమీర వేసి అన్నింటినీ కలుపుకోవాలి. తరువాత స్టౌమీద కడాయిపెట్టి నూనెవేసి ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేయించి కోసంబరి పైన వేయాలి. చివరగా నిమ్మరసం పిండాలి.

Recent Posts

Vinayaka | వినాయక చవితి నాడు గ‌ణ‌పతికి ప్రియ‌మైన ఆకు కూర ఏంటంటే..!

Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…

13 minutes ago

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

9 hours ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

10 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

11 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

13 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

14 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

15 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

16 hours ago