Taurus : వృషభ రాశి వారి గోచార ఫలితాలు .. ఎలా ఉండబోతున్నాయి.. ఎవరు అవునన్నా కాదన్నా నూటికి నూరు శాతం జరగబోయేది ఇదే.. ఆగస్టు ఒకటి పౌర్ణమి తర్వాత నిజంగా అదృష్టం అనేది వెంట వస్తుంది. వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు పట్టిందల్లా బంగారమవుతుంది. కాబట్టి ఈ రాశి వారు ఆగస్టు ఒకటి పౌర్ణమి తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో ఎదుర్కోబోతున్నారు.. అలాగే మీ జీవితంలో మరింత అనుభూతిని సాధించడం కోసం మీరు చేయవలసిన దేవత ఆరాధన తో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం వివరంగా తెలుసుకుందాం.. ఈ రాశికి చెందిన స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో ఆగస్టు ఒకటి పౌర్ణమి తర్వాత మీకు ప్రతి విషయంలో అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ మీరు విజయం సాధిస్తారో ఆ పనిని పూర్తి చేయడంలో ముందుంటారు. మీరు చేయవలసిన పని అది చిన్నదైనా పెద్దదైనా సరే దాన్ని విజయవంతంగా చేయడానికి మీకు ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి..
కానీ వాటిని ఎదిరించి మీరు ముందుకు వెళ్లడం అనేది జరుగుతుంది. ఈ ప్రయాణాల్లో మీకు ఎవరైనా కానీ ఎవరి సహాయం అందకపోయినా నా స్వయంకృషితో నేను సాధిస్తాను అని పట్టుదలతో మీరు అనుకున్న పనిని సాధించడం అనేది జరుగుతుంది. అలాగే ఈ రాశికి చెందినవారు ఎప్పటినుంచో ఆర్థిక ఇబ్బందుల బారిన పడి ఇబ్బందులు పడుతున్నట్లయితే అలాగే ఇదివరకు వ్యాపారంలో ఎక్కువ పెట్టుబడి పెట్టి నష్టపోయి మానసికంగా బాధపడుతున్నట్లయితే కనుక ఈ సమయంలో మీకు ఆర్థికపరంగా ఎంతో అనుకూలమైన పరిస్థితి కనిపిస్తోంది. మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా మీకు ఆదాయం అనేది సొంతమవుతుంది.. మీ చిన్ననాటి స్నేహితులు కావచ్చు.. వారి ద్వారా మీకు లాభమే కలుగుతుంది. మంచి గుర్తింపు సాధించడం కోసం వాళ్ళు ఇచ్చే సలహాలు అనేవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. వాటిని ఆచరించడం వల్ల ఎన్నాళ్ళ నుంచి మీకున్న కోరిక నెరవేరుతుంది. జీవితంలో మనకి కొంతమంది వ్యక్తి పరిచయం అవ్వడం వల్ల మంచి జరుగుతుంది. అలాగే చెడు కూడా జరుగుతుంది.
కానీ మీకు మీ జీవితంలో ఆగస్టు ఒకటి పౌర్ణమి తర్వాత పరిచయమయ్యే వ్యక్తుల ద్వారా అన్ని శుభాలే జరుగుతాయి. శుభ ప్రయాణాలు చేస్తారు. అన్నింటిలోనూ శుభ శకునాలనేవి ఎదురవుతాయి. అలాగే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో పురుష సంతానం అనేది కలవడం జరుగుతుంది. రాజకీయ నాయకులకు ముఖ్యంగా ఒక శ్రీ కారణంగా మీరు రాజకీయపరంగా ముందుకు వెళ్లబోతున్నారు. ఆమె మీపై అధికారి కావచ్చు. లేదా మీ జీవిత భాగస్వామి కావచ్చు.. లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా కావచ్చు.. రాజకీయ రంగంలో మిమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తారు. ఇక దాంపత్య జీవితంలో మీ జీవిత భాగస్వామితో మీరు ఎంతో మధుర క్షణాలను గడపబోతున్నారు.. అయితే ప్రతి బుధవారం గణేశునికి దీపారాధన చేయండి.
అలాగే గ్రహ దోషాలు తొలగించుకోవడానికి మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే మంగళవారం రోజు కానీ గురువారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ ఆదివారం నాడు కానీ ఈ రోజుల్లో ఏదో ఒక రోజు తమలపాకులు పచ్చ కర్పూరం తీసుకొని దీపారాధన చేసిన తర్వాత దైవం సన్నిధిలో తమలపాకు ఉంచి దానిపైన పచ్చ కర్పూరం పెట్టి మరొక తమలపాకుని ఆ కర్పూరం పైన పెట్టండి. ఇలా రెండు తమలపాకుల కాడలు ఒకే వైపు వచ్చేలా చూసుకోండి. ఆ తర్వాత దాన్ని ఒక పొట్లల్లా కట్టి పూజా మందిరంలో పెట్టి దాని మీద చేయి పెట్టి మీ ఇంట్లో వాళ్ళ పేర్లు గోత్రాలు అన్ని చెప్పుకొని అలాగే మీరు ఏం జరగాలని కోరుకుంటున్నారో ఒక సంకల్పం చేసుకోండి. ఈ విధంగా చేయడం వలన మీకు వచ్చిన సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోయి సుఖసంతోషాలు చేకూరుతాయని చెప్పవచ్చు.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.