Zodiac Signs : త్వరలో ఏర్పడనున్న చతుర్గ్రాహి యోగం…ఈ రాశుల వారికి ఆర్ధిక నష్టం…!
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. అలాగే మరికొన్ని రాశుల వారికి నష్టాలు కూడా ఉంటాయి. అయితే అక్టోబర్ నెలలో ఒకే రాశిలో నాలుగు గ్రహాలు కలిసినప్పుడు చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటే మరి కొన్ని రాశుల వారికి ఆశుభ ఫలితాలు కలుగుతాయి. Zodiac Signs చతుర్గ్రాహి యోగం సూర్యుడు బుధుడు చంద్రుడు […]
ప్రధానాంశాలు:
Zodiac Signs : త్వరలో ఏర్పడనున్న చతుర్గ్రాహి యోగం...ఈ రాశుల వారికి ఆర్ధిక నష్టం...
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. అలాగే మరికొన్ని రాశుల వారికి నష్టాలు కూడా ఉంటాయి. అయితే అక్టోబర్ నెలలో ఒకే రాశిలో నాలుగు గ్రహాలు కలిసినప్పుడు చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటే మరి కొన్ని రాశుల వారికి ఆశుభ ఫలితాలు కలుగుతాయి.
Zodiac Signs చతుర్గ్రాహి యోగం
సూర్యుడు బుధుడు చంద్రుడు గురువు ఈ నాలుగు గ్రహాలు ఒక రాశిలో సంచరించినప్పుడు చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం అక్టోబర్ 2వ తేదీ సూర్యగ్రహం రోజున ఏర్పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశులు కష్టాలను ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
Zodiac Signs తులారాశి
చతుర్గ్రాహి యోగం కారణంగా తులా రాశి వారికి ఈ సమయం మిశ్రమంగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో వీరు ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఖర్చులు పెరుగుతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సమయంలో అనవసరమైన ఖర్చులు పెట్టకపోవడం మంచిది. ప్రేమ వ్యవహారాలలో ఊహించని మలుపులు ఉంటాయి. అదేవిధంగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
కుంభరాశి.
కుంభ రాశి వారికి చతుర్గ్రాహి యోగం కారణంగా వీరికి ఈ సమయంలో కష్టాలు నష్టాలు సంభవిస్తాయి. అయితే ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కుంభరాశి జాతకులు ఈ సమయంలో మంచి ఫలితాలను పొందలేరు. అలాగే సృజనాత్మకత ఉన్నప్పటికీ కొంత అసంతృప్తి ఉంటుంది. ఇక ఉద్యోగుల విషయానికొస్తే కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మీన రాశి.
చతుర్గ్రాహి యోగం కారణంగా మీన రాశి జాతకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ సమయంలో మీన రాశి వారు మానసిక ఒత్తిడికి గురి అవ్వడంతో పాటు అధిక భావోద్వేగాలకు లోనవుతారు. ముఖ్యంగా వీరు ఈ సమయంలో ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు. ఒకవేళ నమ్మితే నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. మీన రాశి ఉద్యోగులు ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నప్పటికీ కొంత చిరాకు ఉంటుంది. ఈ సమయంలో వీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.