Home » Devotional » These Zodiac Signs Are Getting More Wealth In Karthika Masam Due To Transit Of Venus
Devotional

Zodiac Signs : శుక్రుడు అనుగ్రహంతో కార్తీకమాసంలో ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం…!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: November 10, 2024, 8:00 am
Advertisement

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం ఉంటుంది. అయితే విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు నవంబర్ 8వ తేదీన ఉదయం 3:39 నిమిషాలకు మూల నక్షత్రం లోకి ప్రవేశించాడు. ఇక శుక్రుడు నవంబర్ 18 వ తేదీ వరకు మూలనక్షత్రం లోనే ఉంటాడు. తర్వాత పూర్వషాడ నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు.

Advertisement

Zodiac Signs : కేతువు నక్షత్రంలోకి శుక్రుడు

కేతువు నక్షత్రమైన మూలా నక్షత్రంలో శుక్రుడి సంచారం వలన కొన్ని రోజుల వారికి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు కేతు నక్షత్రంలో సంచారం కారణంగా ఆర్థికంగా మెరుగుపడే ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

మేషరాశి : శుక్రుడు మూల నక్షత్రంలో సంచారం కారణంగా మేష రాశి జాతకులకు సానుకూల ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో వీరికి కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఇక వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి లాభాలు ఉంటాయి. ఈ సమయంలో వీరు కొన్ని ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మొత్తానికి శుక్ర సంచారం కారణంగా మేష రాశి వారు ఆర్థికంగా మెరుగుపడతారు.

Advertisement

వృషభ రాశి : మూలా నక్షత్రంలో శుక్ర సంచారం కారణంగా వృషభ రాశి వారికి అన్ని శుభాలు జరుగుతాయి. అలాగే వర్తక వ్యాపారాలకు ఆర్థిక పురోగతి ఉంటుంది. పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. వృషభ రాశి వారు ఈ సమయంలో శుభవార్తలను వింటారు. ముఖ్యంగా ఈ సమయంలో ప్రయాణాలు చేయడం కొన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు.

Zodiac Signs : శుక్రుడు అనుగ్రహంతో కార్తీకమాసంలో ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం…!

Advertisement

కన్యరాశి : కేతు నక్షత్రమైన మూల నక్షత్రంలోకి శుక్రుడి సంచారం కారణంగా కన్యా రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. నూతన వర్తక వ్యాపారాలు ప్రారంభించిన వారికి మంచి లాభాలు ఉంటాయి. ఆర్థిక పురోగతి ఉంటుంది. ఈ సమయంలో శత్రువులపై విజయం సాధిస్తారు. ఇక కన్య రాశి జాతకుల వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. మొత్తం మీద కన్య రాశి జాతకులకు ఇది అదృష్ట సమయం అని చెప్పుకోవచ్చు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి