Zodiac Signs : శుక్రుడు అనుగ్రహంతో కార్తీకమాసంలో ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం…!
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం ఉంటుంది. అయితే విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు నవంబర్ 8వ తేదీన ఉదయం 3:39 నిమిషాలకు మూల నక్షత్రం లోకి ప్రవేశించాడు. ఇక శుక్రుడు నవంబర్ 18 వ తేదీ వరకు మూలనక్షత్రం లోనే ఉంటాడు. తర్వాత పూర్వషాడ నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు. Zodiac Signs : కేతువు నక్షత్రంలోకి శుక్రుడు కేతువు నక్షత్రమైన మూలా నక్షత్రంలో […]
ప్రధానాంశాలు:
Zodiac Signs : శుక్రుడు అనుగ్రహంతో కార్తీకమాసంలో ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం...!
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం ఉంటుంది. అయితే విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు నవంబర్ 8వ తేదీన ఉదయం 3:39 నిమిషాలకు మూల నక్షత్రం లోకి ప్రవేశించాడు. ఇక శుక్రుడు నవంబర్ 18 వ తేదీ వరకు మూలనక్షత్రం లోనే ఉంటాడు. తర్వాత పూర్వషాడ నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు.
Zodiac Signs : కేతువు నక్షత్రంలోకి శుక్రుడు
కేతువు నక్షత్రమైన మూలా నక్షత్రంలో శుక్రుడి సంచారం వలన కొన్ని రోజుల వారికి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు కేతు నక్షత్రంలో సంచారం కారణంగా ఆర్థికంగా మెరుగుపడే ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
మేషరాశి : శుక్రుడు మూల నక్షత్రంలో సంచారం కారణంగా మేష రాశి జాతకులకు సానుకూల ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో వీరికి కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఇక వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి లాభాలు ఉంటాయి. ఈ సమయంలో వీరు కొన్ని ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మొత్తానికి శుక్ర సంచారం కారణంగా మేష రాశి వారు ఆర్థికంగా మెరుగుపడతారు.
వృషభ రాశి : మూలా నక్షత్రంలో శుక్ర సంచారం కారణంగా వృషభ రాశి వారికి అన్ని శుభాలు జరుగుతాయి. అలాగే వర్తక వ్యాపారాలకు ఆర్థిక పురోగతి ఉంటుంది. పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. వృషభ రాశి వారు ఈ సమయంలో శుభవార్తలను వింటారు. ముఖ్యంగా ఈ సమయంలో ప్రయాణాలు చేయడం కొన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు.
కన్యరాశి : కేతు నక్షత్రమైన మూల నక్షత్రంలోకి శుక్రుడి సంచారం కారణంగా కన్యా రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. నూతన వర్తక వ్యాపారాలు ప్రారంభించిన వారికి మంచి లాభాలు ఉంటాయి. ఆర్థిక పురోగతి ఉంటుంది. ఈ సమయంలో శత్రువులపై విజయం సాధిస్తారు. ఇక కన్య రాశి జాతకుల వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. మొత్తం మీద కన్య రాశి జాతకులకు ఇది అదృష్ట సమయం అని చెప్పుకోవచ్చు.