Zodiac Signs : విష్ణువు రాకతో ఈ రాశుల వారికి కనక వర్షం… కోటిశ్వరులు అవ్వడం ఖాయం…

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 9 November 2024, 6:00 am
  •  Zodiac Signs : విష్ణువు రాకతో ఈ రాశుల వారికి కనక వర్షం... కోటిశ్వరులు అవ్వడం ఖాయం...

Zodiac Signs : హిందూమతంలో ఏకాదశి తిధి కి ఎంత ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా కార్తీక మాసంలోని శుక్లపక్షంలోని వచ్చే ఏకాదశి తిధిని ప్రబోధిని ఏకాదశిగా దేవుత్తని ఏకాదశిగా పిలుస్తారు. అయితే ఈ ఏడాది నవంబర్ 12వ తేదీన ప్రబోధిని ఏకాదశి వస్తుంది. అంతేకాకుండా ఈ ఏకాదశి తిధి 11 నవంబర్ 2024 నా సాయంత్రం 6:46కు ప్రారంభమవుతుంది. తిరిగి మరుసటి రోజు 12 నవంబర్ 2024 సాయంత్రం 4:04 గంటలకు ముగుస్తుంది.

Zodiac Signs : ప్రబోధిని ఏకాదశి నాడు విశేష యోగాలు..

ప్రబోధిని ఏకాదశి నవంబర్ 12వ తేదీన మంగళవారం రోజున ఆచరిస్తారు. ఎందుకంటే హిందూమతంలో ఉదయం వచ్చే తేదీనే ప్రమాణికంగా తీసుకుంటారు. అలాగే ఈ రోజుతో చాతుర్మాసం ముగుస్తుంది. అంతే కాకుండా శ్రీమహావిష్ణువు 120 రోజుల తర్వాత యోగా నిద్ర నుండి మేల్కొంటాడు. దీంతో ఈ రోజున సార్వత్రిక సిద్ధియోగం మరియు హర్షణ యోగం ఏర్పడుతున్నాయి. దేవుత్తని ఏకాదశి రోజు గ్రహాల సంచారం వలన కొన్ని రాశుల వారికి సకల శుభాలు జరగబోతున్నాయి. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

మేషరాశి : మేష రాశి జాతకులకు ప్రబోధిని ఏకాదశిన కలిసి వస్తుంది. మీరు ఈ సమయంలో శుభవార్తలలో వింటారు. అలాగే తల్లిదండ్రుల నుంచి మద్దతు లభించడంతో వీరు జీవితంలో ఉన్నత శిఖరానికి చేరుకుంటారు.

కర్కాటక రాశి : కర్కాటక రాశి జాతకులకు ప్రబోధిని ఏకాదశి నుండి అన్ని రంగాలలో విజయాన్ని సాధిస్తారు. అలాగే నూతన పనులను ప్రారంభించడానికి ఇది మంచి సమయం. కర్కాటక రాశి జాతకులు గృహం లేదా వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

Zodiac Signs : విష్ణువు రాకతో ఈ రాశుల వారికి కనక వర్షం... కోటిశ్వరులు అవ్వడం ఖాయం...

Zodiac Signs : విష్ణువు రాకతో ఈ రాశుల వారికి కనక వర్షం… కోటిశ్వరులు అవ్వడం ఖాయం…

తులారాశి : తులా రాశి జాతకులకు ప్రబోధిని ఏకాదశి నుండి వృత్తి వ్యాపారాలలో అనేక ప్రయోజనాలను పొందుతారు. అలాగే వ్యాపారులకు ఇది మంచి సమయం. ఇక ఉద్యోగులకు ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. తులారాశి జాతకుల వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతుంది. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. ఆర్థికంగా బలపడతారు.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి ప్రబోధిని ఏకాదశి నుండి ఆకస్మిత ధన లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే సమాజంలో వీరికి గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు పేరు ప్రతిష్టలు ఏర్పడతాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది. ఇక జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Tags :
Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి