Astrology : ఈ ఏడాది ఈ రాశుల వారికి ప్రేమలు, పెళ్లిళ్లు అనుకూలం
Astrology : జ్యోతిషశాస్త్రంలో సప్తమ స్థాన అధిపతి, శుక్రుడు, గురు గ్రహాల సంచారాన్ని బట్టి ప్రేమలు, పెళ్లిళ్లు తదితర విషయాలను నిర్ణయించడం జరుగుతుంది. సప్తమాధిపతి, గురు, శుక్రులు అనుకూలంగా ఉన్న పక్షంలో కొద్ది ప్రయత్నంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. వైవాహిక జీవితం విజయవంతం అవుతుంది. దాంపత్యం అన్యోన్యంగా సాగిపోతుంది.
Astrology : ఈ ఏడాది ఈ రాశుల వారికి ప్రేమలు, పెళ్లిళ్లు అనుకూలం
ఈ రాశికి సప్తమాధిపతి అయిన కుజుడు, శుభ గ్రహాలైన గురు, శుక్రులు బాగా అనుకూలంగా సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారు తప్పకుండా ప్రేమలో పడడం జరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. ప్రేమ వ్యవహా రాలు తప్పకుండా పెళ్లికి దారితీస్తాయి. దంపతుల మధ్య అన్యోన్యత కొనసాగుతుంది. కొద్ది ప్రయ త్నంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. వైవాహిక జీవితం ఆదర్శప్రాయంగా సాగిపోతుంది.
ఈ రాశికి సప్తమాధిపతి అయిన గురువు ఇదే రాశిలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారు ఉన్నత స్థాయికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల తక్కువ ప్రయత్నంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యో గాల్లో ఉన్న వ్యక్తి లేదా సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం ఉంది. వైవాహిక జీవితం నిత్య కల్యాణం పచ్చతోరణంలా సాగిపోతుంది. అన్యోన్యత బాగా పెరుగుతుంది.
ఈ రాశికి సప్తమాధిపతి అయిన శనీశ్వరుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల కొద్దిగా ఆలస్యంగానే అయినప్పటికీ మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఎక్కువ సంఖ్యలోనే పెళ్లి ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. ఈ ఏడాదంతా శుక్ర గురువులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ప్రేమలో పడడానికి, ప్రేమ వివాహానికి కూడా అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వ్యక్తితో సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది. దాంపత్యంలో అన్యోన్యతకు లోటుండదు.
ఈ రాశివారికి సప్తమాధిపతి అయిన కుజుడు దశమ, లాభ స్థానాల్లో సంచారం చేయడం, గురువు భాగ్య స్థానంలో ఉండడం వంటి కారణాల వల్ల ఈ రాశివారు తప్పకుండా ప్రేమలో పడే అవకాశం ఉంది. తోటి ఉద్యోగితో గానీ, బాగా పరిచయం ఉన్న వ్యక్తితో గానీ ప్రేమలో పడడం జరుగుతుంది. ఆ వ్యక్తి సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి అయి ఉండడం జరుగుతుంది. పెళ్లి ప్రయత్నాల విషయానికి వస్తే, విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి ప్రయత్నాలు చేయడం చాలా మంచిది.
ఈ రాశికి సప్తమాధిపతి అయిన బుధుడు ప్రస్తుతం పంచమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల వీరు ప్రేమలో పడే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపారంలో ఉన్న వ్యక్తితో గానీ, ఆర్థిక రంగంలో పనిచేస్తున్న వ్యక్తితో గానీ ప్రేమలో పడడం జరుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా వ్యాపారులు లేదా ఆర్థిక సంస్థల ఉద్యోగులతో సంబంధం కుదిరే అవకాశం ఉంది.
ఈ రాశికి సప్తమాధిపతి రవి అయినందువల్ల ఈ ఏడాది రాజకీయాలు, రియల్ ఎస్టేట్, ప్రభుత్వం వంటి రంగాల్లో పనిచేసే వ్యక్తితో పెళ్లి కుదిరే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో శ్రమాధిక్యత ఎక్కువగా ఉంటుంది. వీరికి సాధారణంగా జీవిత భాగస్వామితో విడదీయ రాని బంధం ఏర్పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగితో ప్రేమలో పడడానికి కూడా అవకాశం ఉంది. దూర ప్రాంతంలో లేదా విదేశాల్లో ఉన్న వ్యక్తితో పెళ్లి సంబంధం ఖాయమయ్యే అవకాశం కూడా ఉంది.
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
Samantha : టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…
Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…
Girl : ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొందరు మాట్లాడే మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి.…
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…
This website uses cookies.