Dhana Lakshmi : సెప్టెంబర్ 16 నుండి ఈ రాశుల వారికి పట్టనున్న ధనలక్ష్మి యోగం… కుబేరులు అవడం ఖాయం…!
ప్రధానాంశాలు:
Dhana Lakshmi : సెప్టెంబర్ 16 నుండి ఈ రాశుల వారికి పట్టనున్న ధనలక్ష్మి యోగం... కుబేరులు అవడం ఖాయం...!
Dhana Lakshmi : సెప్టెంబర్ నెలలో ముఖ్యమైన గ్రహాలు కొన్ని వివిధ రాశుల్లోకి సంచారం చేయనున్నాయి. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 16వ తేదీన రాత్రి 7:20 నిమిషాలకు సూర్యుడు కన్య రాశిలోకి ప్రవేశించనున్నాడు. అనంతరం అక్టోబర్ 17వ తేదీ వరకు సూర్యుడు కన్యరాశిలోనే సంచరిస్తాడు. అయితే ఇప్పటికే కేతు గ్రహం కన్యారాసులో సంచారం చేస్తోంది. ఇక ఇప్పుడు సూర్యుడు కన్యరాశిలోకి ప్రవేశించడంతో సూర్యకేతువుల సంయోగం జరుగుతుంది. దీంతో దీని యొక్క ప్రభావం వివిధ రాశుల వారిపై చూపుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కన్యరాశిలో ఏర్పడే సూర్యకేతువుల సంయోగం కారణంగా వివిధ రాశుల వారికి అదృష్ట ఫలితాలు కలగనున్నాయి. మరి ఈ సంయోగం కారణంగా ఏ రాశులు వారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
Dhana Lakshmi వృషభ రాశి…
కన్యారాశిలో సూర్యకేతువుల సంయోగం జరగడం వలన వృషభ రాశి జాతకులకు బాగా కలిసి వస్తుంది. వీరి జీవితంలో సానుకూల ఫలితాలను పొందగలుగుతారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారు పదోన్నతి పొందుతారు. వ్యాపార రంగాల్లో ఉన్నవారు అధిక రాబడులను సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు.
Dhana Lakshmi సింహరాశి…
సూర్యకేతువుల కలయిక కారణంగా సింహరాశి వారికి ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఈ సమయంలో అనుకున్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. రావాల్సిన డబ్బు చేతికి వస్తుంది. సానుకూల ఫలితాలను పొందగలుగుతారు.
Dhana Lakshmi మేషరాశి…
కన్యారాశిలో జరిగే సూర్యకేతువుల సంయోగం కారణంగా మేషరాశి జాతకులకు అదృష్ట ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారు వృత్తి మరియు వ్యాపార రంగాలలో విజయాలను సాధిస్తారు. నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఇక ఈ సమయంలో ఏ పని చేసిన విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.
ధనుస్సు రాశి…
సూర్య కేతువుల కలయిక వలన ధనుస్సు రాశి వారికి భారీగా ఆర్థిక లాభాలు వస్తాయి. ఈ సమయంలో అన్ని రంగాలలో వీరు పురోగతి సాధిస్తారు. అన్ని ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతారు. ఇక ఈ సమయం వీరికి లాభదాయకమైన సమయం అని చెప్పవచ్చు. కుటుంబంతో ఆహ్లాదకరంగా గడుపుతారు. ఆరోగ్య విషయంలో దిగులు పడాల్సిన అవసరం లేదు.