Tirumala Laddu Prasadam : కొత్త రంగు పోసుకున్న నెయ్యి కల్తీ వివాదం.. జగన్ కు ’11’ టార్గెట్ పెట్టిన టీడీపీ..!
ప్రధానాంశాలు:
Tirumala Laddu Prasadam : కొత్త రంగు పోసుకున్న నెయ్యి కల్తీ వివాదం.. జగన్ కు '11' టార్గెట్ పెట్టిన టీడీపీ..!
తిరుమల లడ్డు లో ఆ రసాయనాలు వాడారంటూ టీడీపీ ఆరోపణలు ..వైసీపీ కౌంటర్లు
నెయ్యి కల్తీ వివాదం పై జగన్ కు '11' టార్గెట్ పెట్టిన టీడీపీ
Thirumala Ghee Controversy : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యి కల్తీ వ్యవహారం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు నియమించిన సిట్ (SIT) ప్రాథమిక నివేదికలో జంతువుల కొవ్వు నేరుగా కలపడం కంటే, ప్రమాదకరమైన రసాయనాలతో నెయ్యిని కల్తీ చేసినట్లు ఆధారాలు లభించడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ నివేదికను అస్త్రంగా చేసుకున్న అధికార తెలుగుదేశం పార్టీ, గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శల దాడిని తీవ్రం చేసింది. ముఖ్యంగా లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో ‘మోనో గ్లిజరైట్’, ‘మీటా క్యారటిన్’, ‘ఎసిడిక్ యాసిడ్’, ‘లాక్టిక్ యాసిడ్’ వంటి రసాయనాలు ఉన్నట్లు ప్రభుత్వం నిర్ధారించింది. ఈ రసాయనాల వాడకం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా ప్రమాదకరమని ప్రభుత్వం ఆరోపిస్తోంది.
Tirumala Laddu Prasadam : కొత్త రంగు పోసుకున్న నెయ్యి కల్తీ వివాదం.. జగన్ కు ’11’ టార్గెట్ పెట్టిన టీడీపీ..!
Tirumala Laddu Prasadam వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ’11’ నంబర్ టార్గెట్
ఈ వివాదంపై మంత్రి కొల్లు రవీంద్ర నేరుగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ’11’ నంబర్ టార్గెట్‌ను విధించారు. ఈ నెల 11వ తేదీన జరిగే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీకి ఉన్న 11 మంది సభ్యులతో వచ్చి చర్చకు సిద్ధపడాలని ఆయన సవాల్ విసిరారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కావాలనే నిబంధనలను సడలించారని, 4 లక్షల ఆవుల పాలు కావాలనే నిబంధనను ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పాలు లేని డైరీలకు భారీగా ఆర్డర్లు ఇచ్చి, హవాలా మార్గంలో ముడుపులు అందుకున్నారని, ఆ క్రమంలోనే భక్తులకు కల్తీ ప్రసాదాన్ని తినిపించారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా ‘మోనో గ్లిజరైట్’ వంటి రసాయనాల్లో జంతువుల కొవ్వు లేదా వెజిటేబుల్ ఫ్యాట్ కలిసే అవకాశం ఉందని నిపుణుల అంచనాలను ప్రభుత్వం ఉటంకిస్తోంది.
వైసీపీ రివర్స్ కౌంటర్లు
మరోవైపు, వైసీపీ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తోంది. సిట్ నివేదికలో జంతువుల కొవ్వు లేదని తేలిందని, రసాయనాల అంశాన్ని భూతద్దంలో చూపి ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఆ పార్టీ నేతలు వాదిస్తున్నారు. కల్తీ జరగలేదని తాము అనడం లేదని, కానీ టీడీపీ ప్రచారం చేసినంత భారీ స్థాయిలో అపవిత్రం జరగలేదని వారి వాదన. అయితే, దేవుడి ప్రసాదం విషయంలో ‘కొంచెం కల్తీ’ లేదా ‘ఎక్కువ కల్తీ’ అనే బేధం ఉండదని, అపవిత్రం జరగడమే నేరమని ప్రభుత్వం కౌంటర్ ఇస్తోంది. త్వరలోనే పూర్తిస్థాయి నివేదిక రానుండటంతో, ఈ కల్తీ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనేది బయటపడుతుందని, దోషులు కచ్చితంగా శిక్ష అనుభవిస్తారని మంత్రి హెచ్చరించారు. ఈ క్రమంలో 11వ తేదీ అసెంబ్లీ సమావేశాలు ఉత్కంఠభరితంగా మారే అవకాశం కనిపిస్తోంది.