Horoscope : అగ‌స్టు 22 – 2021 ఆదివారం.. ఈ రాశివారు వృత్తిలో వృద్ధి కోసం కాలభైరావాష్టకం పారాయణం చేయండి

0
Advertisement

మేషరాశి : మీ కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండకండి, అది మీ ప్రశాంతతను హరించి వేస్తుంది. తప్పనిసరిగా మీ ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి, కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. ప్రయాణం ప్రయోజన కరం. వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా ఉంటుంది ఈ రోజు. మీ వృత్తి జీవితంలో మరింత వృద్ధి కోసం మీ రోజువారీ వస్త్రధారణలో భాగంగా తెలుపు, కాంతి వంటి రంగులను ఉపయోగించండి.

వృషభరాశి : స్నేహితులతో మీకు సంతోషాన్ని కలిగించే పనులు చేస్తారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. ధనాన్ని సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్దిని పొందుతారు. ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోండి. ఆఫీసులో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు. ఈరోజు మీరు కావాలనుకున్న విధంగా చాలావరకు నెరవేరుతాయి. మీ జీవిత భాగస్వామి దురుసు ప్రవర్తన మిమ్మల్ని ఈ రోజంతా వెంటాడుతూనే ఉంటుంది. గౌరీదేవిని పసుపుతో ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.

today horoscope in telugu
today horoscope in telugu

మిథునరాశి : ఒక స్నేహితునికి ప్రవర్తన వలన కొంత సమస్య కలుగుతుంది. ఈ రోజు మీ ముందుకొచ్చిన పెట్టుబడి పథకాల గురించి మదుపు చేసే ముందు, ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి -సృజనాత్మకత గల ప్రాజెక్ట్ల గురించి పనిచెయ్యడానికి కూడా ఇది మంచి సమయం. వాదులాటకి దిగినప్పుడు, పరుషమైన వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త వహించండి. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. మీ ఆర్థిక పరిస్థితి పెరగడానికి శివుడి ఆరాధన చేయండి.

 

కర్కాటకరాశి : ఈరోజు ధనాన్ని ఖర్చు చేసే ముందు ఆలోచించండి. అనవసర విషయాలలో జోక్యం చేసుకోండి. దురుసు ప్రవర్తనను తగ్గించుకోండి. గతంలో మీరు చేసిన పనుల వల్ల వచ్చిన విజయం మీకు మీపట్ల నమ్మకాన్ని పెంతుంది. మీ ప్రవర్తనలో పొరపాట్లను జరగనీయకండి. ప్రత్యేకించి, మీ భాగస్వామితో లేకుంటే, అది మీ ఇంట్లో ప్రశాంతతను భంగం చేస్తుంది. మీ పని నైపుణ్యాలను, మెరుగు పరచుకోవడానికి కొత్త టెక్నిక్లను అవలంబించండి. మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతోంది. మీ జీవిత భాగస్వామితో మాట్లాడి, కాస్త డిఫరెంట్గా ప్లాన్ చేయండి. అనుకూల ఫలితాల కోసం గణపతి దేవాలయంలో ప్రదక్షిణలు చేయండి.

Daily horoscope in telugu
Daily horoscope in telugu

సింహరాశి : మీకు సానుకూల ఫలితాలు వస్తాయి. కార్యాలయంలో అంటే పనిచేసేచోట కష్టపడి పనిచేయండి. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మీ విచ్చలవిడి ఖర్చు చేసే పద్ధతి వల్ల ఇంట్లో కొన్ని టెన్షన్లకు దారితీస్తుంది. అపరిమితమైన సృజనాత్మకత, కుతూహలం మిముల్ని మరో లాభదాయకమైన రోజువైపు నడిపిస్తాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు కలసి వస్తాయి. కుటుంబంలో ఆనందాన్ని మెరుగుపర్చడానికి గౌరీదేవిని ఆరాధన చేయండి.

కన్యారాశి : ఈరోజు వ్యాపారాలు కలసి వస్తాయి. ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. కానీ మీరు భాగస్వాముల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటారు. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యను మీ వేగమే పరిష్కరిస్తుంది. రియల్ ఎస్టేట్ పెట్టుబడి అత్యధిక లాభదాయకం. మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి. అది మీకు చాలా మేలు చేస్తుంది. సెమినార్లు , ఎగ్జిబిషన్లు వలన మీకు క్రొత్త విషయాలు తెలుస్తాయి, కాంటాక్ట్లు పెరుగుతాయి. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు ప్రయత్నిస్తారు. వృత్తిలో విజయం సాధించడానికి పేదలకు ఆహారపదార్థాలను దానం చేయండి.

today horoscope in telugu
today horoscope in telugu

తులారాశి : మీకు ఆనందంగా గడుస్తుంది. ఈరోజు మీ సంతానం చేసే పనులతో ఈరోజు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. విచ్చలవిడిగా ఖర్చు చెయ్యడం మానుకోండి. కుటుంబపు టెన్షన్లు నుంచి బయటపడటానికి యోగా చేయండి. ఈరోజు మీరు, అందరి దృష్టి పడేలాగ ప్రవర్తిస్తారు. విజయం మీకు చేరువలోనే ఉంది. మీ చెడు లక్షణాల నుంచి బయటపడటానికి ఇది మంచి సమయం. ఈ రోజు మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు. మంచి ఆర్థిక లాభాల కోసం శివాభిషేకం చేయండి.

 

వృశ్చికరాశి : ఈరోజు తొందరపాటును తగ్గించుకోండి. ధన లాభాలు రావచ్చు.తొందరపాటుతో పెట్టుబడులకి పూనుకోకండి. సాధ్యమైన అన్ని కోణాలలోంచి, పెట్టుబడులని పరిశీలన జరపకపోతే నష్టాలు తప్పవు. మీ అద్భుతమైన శ్రమ, సమాయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వలన కోరుకున్న ఫలితాలు వస్తాయి. ఈ రోజు ఆఫీసులో మీకు గుర్తింపు తేనుంది. ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి కొన్ని సమస్యలను తెచ్చి పెడుతుంది జాగ్రత్త. శివుడికి జలాభిషేకం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Daily horoscope in telugu
Daily horoscope in telugu

ధనస్సురాశి : చాలా రోజుల తర్వాత మీరు విశ్రాంతి తీసుకుంటారు. అదేవిధంగా సమాజసేవ, ఇతరులకు సమయం కేటాయించడానికి మంచి రోజు.పిల్లలు మీకు సంతోషాన్ని కలిగిస్తారు. ఈ రోజు మీరు హాజరుకాబోయే సెమినార్లు మీకు ఎదగడానికి క్రొత్త మార్గాలు చూపిస్తాయి. ఆర్థిక పరిస్తితి మీకు సంతృప్తిని కలిగిస్తుంది. మంచి రాత్రి భోజనం, మంచి రాత్రి నిద్ర ఈ రోజు మీకు మీ వైవాహిక జీవితం వల్ల లభించనున్నాయి. పేదవారికి వస్ర్తాలను దానం చేయడం, ఆహారా పదార్థాలను ద్వారా జీవితం మరింత మెరుగుపడుతుంది.

 

మకరరాశి : ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. అనవసరంగా సమయం వృథా అవుతుంది. మీవద్దగల ధనాన్ని జాగ్రత్తగా చెక్ చేసుకుని మీ ఖర్చులను పరిమితం చేసుకొండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త, శ్రద్ధ అవసరం. కుటుంబంలో సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి ఇది అనుకూల సమయం. సహ ఉద్యోగులతో మసిలేటప్పుడు ప్రేమతో, సహనంతో ప్రవర్తించండి. ఈ రోజు మీ అవసరాలను తీర్చేందుకు మీ జీవిత భాగస్వామి సహకరించక పోవచ్చు. అమ్మవారికి పూజ, శివాభిషేకం జీవిత ఎదుగుదల, ఆరోగ్యానికి మంచి చేస్తుంది.

today horoscope in telugu
today horoscope in telugu

కుంభరాశి : ఈరోజు మీరు పేరు కోసం ఎక్కువ దుబారా చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో జాగ్రత్త. సంతానం యొక్క అనారోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుంది. ఎంతోకాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు, కష్టాలు నుండి రిలీఫ్ పొందబోతున్నారు. ప్రయాణం కలసి వస్తుంది. వివాహం బంధం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. వృత్తిలో వృద్ధి కోసం కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

మీనరాశి : మీరు చాలా ఉత్సాహంతో గడుపుతారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కుటుంబం, స్నేహితుల కోసం ఖర్చుపెట్టే మూడ్లో ఉంటారు. కానీ మీరలా చేస్తే కనుక, విచారిస్తారు. ఇతరులు మీ విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు. మీ కుటుంబ సమస్యలు పరిష్కరించడంలో మీరు ముఖ్యపాత్ర వహించి ప్రశంసలు అందుకుంటారు. మీ బెటర్ హాఫ్తో సరదాగా గడిపేందుకు ఇది చక్కని రోజు. అమ్మవారికి పసుపుతో, పసుపు రంగు పూలతో అర్చన చేయండి.

 

Advertisement