Zodiac Signs : మార్చి 02 బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

మేష రాశి ఫలాలు : సంతోషకరమైన రోజు. ఆర్థికంగా మంచి స్థితి కలిగిన రోజు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూలమైన పలితాలు వస్తాయి. మహిళలకు పని భారం పెరుగుతుంది. శ్రీ సుబ్రమణ్య స్వామి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : కొంచెం శ్రమతో కూడిన రోజు. ఆనుకోని ఇబ్బందులు వస్తాయి, కానీ మీ తెలివితో వాటి నుంచి బయటపడుతారు. అప్పులు తీరుస్తారు. ఆర్థికంగా సాధారణ స్తితి. కుటుంబంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. మహిళలకు శుభవార్తలు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

మిధున రాశి ఫలాలు : ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయి. అప్పుల బాధలు పెరుగుతాయి. అనుకోని నష్టాలు వస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. అనవసర వివాదాలకు అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో మనస్పర్థలు. మహిళలకు అనారోగ్య సూచనలు. నవగ్రహారాధన, ప్రదక్షణలు చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఆనందంగా ఈరోజు గడుస్తుంది. అనవసర వివాదాలకు పరిష్కారాన్ని కనుగొంటారు. అప్పులు తీరుస్తారు. పెద్దల వల్ల ప్రయోజనాలు పొందుతారు. ధనలాభాలు కనిపిస్తున్నాయి. మహిళలకు స్వర్ణలాభ సూచన కనిపిస్తుంది. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

సింహ రాశిఫలాలు : సక్సెస్ మంత్రతో ఈరోజు సంతోషంగా ఉంటారు. అన్నింటా జయాలను పొందుతారు. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ధన సంబంధ విషయాలలో ఆశించిన దానికంటే మెరుగ్గా పరిస్థితి ఉంటుంది. మహిళలకు శుభవార్తలు వింటారు. శ్రీ గణపతి ఆరాధన చేయండి.

today horoscope march 02 2022 check your zodiac sign

కన్య రాశి ఫలాలు : వివాదాలకు అవకాశం కనిపిస్తుంది. అప్పుల బాధలు తీరుస్తారు. అనవసర ఖర్చులు. మీకు ఇంటా, బయటా పని భారం పెరుగుతుంది. ప్రయాణాల వల్ల చికాకులు పెరుగుతాయి. మహిళలకు ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. పసుపు వత్తులతో అమ్మవారి దీపారాధన చేయండి.

తులా రాశి ఫలాలు : శుభవార్తలు వింటారు. అనుకోని లాభాలు వస్తాయి. పాలు, కూరగాయలు, ఫార్మ, రియల్ ఎస్టేట్ వారికి లాభాలు కనిపిస్తున్నాయి. బంధువుల నుంచి ప్రయోజనాలు అందుతాయి. మానసికంగా ప్రశాంతత కలిగిన రోజు. మహిళలకు సంతోషం. శ్రీ సుబ్రమణ్య భుజంగ స్తోత్రం పారాయణం చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : అన్ని చోట్ల మంచి వార్తలు వింటారు. అప్పులు తీరుస్తారు. కుటుంబంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ధన సంబంధ విషయాలలో పురోగతి కనిపిస్తుంది. దైర్యంతో ముందుకు పోతారు. విద్యార్థులు శుభవార్తలు వింటారు. మహిళలకు విశ్రాంతి, సంతోషం. ఇష్టదేవతరాధన చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అనవసర ఖర్చులు చేస్తారు. కుటుంబంలో పరిస్థితులు అర్థం కాని స్థితి. ఉద్యోగులకు చికాకులు పెరుగుతాయి. మహిళలకు పని భారం పెరుగుతుంది. శ్రీ దుర్గాదేవి దగ్గర ఎర్రపు రంగు వత్తులతో దీపారాధన చేయండి.

మకర రాశి ఫలాలు : సంతోషకరమైన ఫలితాలు వస్తాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న వార్తలను వింటారు. ఆర్థిక విషయాలలో చక్కటి ఫలితాలు వస్తాయి. మీ సంతానం గురించి తెలిసిన వార్త సంతోషాన్ని కలిగిస్తుంది. మహిళలకు తల్లిగారి ఇంటి నుంచి శుభవార్తలు వస్తాయి. ఇష్టదేవతరాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : మిశ్రమ ఫలితాలతో ఈరోజు గడుస్తుంది. ఆర్థిక సమస్యలు రావచ్చు. అనవసరంగా ఎవరికి మాట ఇవ్వకండి. బంధువుల నుంచి వత్తిడులు పెరుగుతాయి. కుటుంబంలో చికాకులు. అన్ని రకాల వ్యాపారులు ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మహిళలకు వివాదాలు రావచ్చు. అమ్మవారి ఆరాధన, గోసేవ చేయండి.

మీనరాశి ఫలాలు : శుభవార్తలు వింటారు. అప్పుల నుంచి విముక్తి కలుగుతుంది. ఆర్థికంగా ఆశించిన దానికంటే మెరుగ్గా ఉంటుంది. పనులను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. మహిళలకు లాభాలు. విద్యార్థులు, ఉద్యోగులకు మంచి మార్పులు సంభవిస్తాయి. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

Recent Posts

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

8 hours ago

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

8 hours ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

10 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

11 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

13 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

13 hours ago

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

14 hours ago

Ponnam Prabhakar : బనకచర్ల పేరుతో నారా లోకేష్ ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారు : పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…

15 hours ago