Home » Devotional » Ugadi 2026 Parabhava Nama Samvatsara Meaning In Telugu
Devotional

Ugadi 2026 Parabhava Nama Samvatsara Meaning : ‘పరాభవ నామ సంవత్సరం’ అంటే అవమానాలు కాదు.. అసలు అర్థం తెలుసా..?

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: March 19, 2026, 3:00 pm
Advertisement

Ugadi 2026 Parabhava Nama Samvatsara Meaning : తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా ఉగాది Ugadi పండుగను ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా మనం కొత్త తెలుగు సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈసారి వస్తున్న నూతన సంవత్సరం పేరు శ్రీ పరాభవ నామ సంవత్సరం Sri Parabhava Nama Samvatsaram.

Advertisement

Ugadi 2026 Parabhava Nama Samvatsara Meaning : ‘పరాభవ నామ సంవత్సరం’ అంటే అవమానాలు కాదు.. అసలు అర్థం తెలుసా..?

అయితే, ఈ సంవత్సరం పేరు వినగానే చాలామందిలో ఒక రకమైన ఆందోళన, భయం మొదలైంది. వాడుక భాషలో ‘పరాభవం’ అంటే అవమానం, ఓటమి అనే అర్థాలు ఉండటంతో.. ఈ ఏడాదంతా కష్టాలు, ఓటములు, పరాభవాలు తప్పవా? అని చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ‘పరాభవ’ నామ సంవత్సరం అసలు అర్థం ఏంటి? జ్యోతిష్య, వేద పండితులు దీని గురించి ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Ugadi 2026 Parabhava Nama Samvatsara Meaning పరాభవ అంటే అవమానం కాదు.. రక్షణ

పేరులోనే పరాభవం ఉండటంతో ఈ సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు ఉంటాయని చాలామంది అపోహ పడుతున్నారు. కానీ, అందులో ఎలాంటి నిజం లేదని పండితులు స్పష్టం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఓ నెటిజన్ పండితుల వివరణను ప్రస్తావిస్తూ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.

దీని ప్రకారం.. పరాభవ (Parabhava) అనే పదంలో రెండు ముఖ్యమైన భాగాలున్నాయి.

Advertisement

పరా: అంటే పరా భట్టారిక (సాక్షాత్తూ శ్రీ లలితా దేవి లేదా పార్వతీ దేవి).

భవ: అంటే భవుడు (సాక్షాత్తూ ఆ పరమశివుడు).

అంటే, పరాభవ నామ సంవత్సరం అనగా సాక్షాత్తూ ఆ ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు సామరస్య స్వరూపంతో తమ బిడ్డలను (ప్రజలను) రక్షించే సంవత్సరం అని అర్థం. కాబట్టి ఈ పేరు విని భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదని, అమ్మవారు, అయ్యవార్ల రక్షణ మనపై ఉంటుందని పండితులు భరోసా ఇస్తున్నారు. సత్యం, ధర్మం, భక్తి మార్గంలో నడిచేవారికి సకల శుభాలు కలుగుతాయని వివరిస్తున్నారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మరో అద్భుతమైన అర్థం

తెలుగు పంచాంగం ప్రకారం, 60 ఏళ్ల సంవత్సరాల చక్రంలో ‘పరాభవ’ 40వ సంవత్సరం. ప్రతి 60 ఏళ్లకోసారి ఈ సంవత్సరం పునరావృతం అవుతుంది (గతంలో 1966-67 మధ్య వచ్చింది). జ్యోతిష్య శాస్త్రపరంగా చూస్తే ‘పరాభవ’ అంటే ఓటమి కాదు.. గొప్ప స్థితిని పొందడం. సంస్కృతంలో ‘పరా’ అంటే గొప్పది, అత్యున్నతమైనది, లేదా అతీతమైనది. ‘భవ’ అంటే పుట్టుక, సృష్టి లేదా స్థితి. ఈ రెండింటినీ కలిపితే ‘పరాభవ’ అంటే మనిషి అత్యున్నతమైన జ్ఞానాన్ని, స్థితిని పొందే కాలం అని అర్థం.

Advertisement

అజ్ఞానంపై జ్ఞానం సాధించే విజయమే ‘పరాభవం’

ఈ సంవత్సరంలో అహంకారం, మదమాత్సర్యాలు, అజ్ఞానం పరాభవాన్ని (ఓటమిని) చవిచూస్తాయి. వాటి స్థానంలో జ్ఞానం, వినయం, ధర్మం విజయం సాధిస్తాయని పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ సంవత్సరంలో జన్మించేవారు లేదా కొత్త పనులు ప్రారంభించేవారు అహంకారాన్ని వీడి, వినయంతో ముందుకు సాగితే అద్భుత విజయాలు సాధిస్తారు. మన వ్యక్తిత్వ వికాసానికి ఆటంకాలుగా మారే అసూయ, ద్వేషం, అహంకారం, దౌర్భాగ్యం లాంటి ప్రతికూల అంశాలకు ఈ సంవత్సరం ‘పరాభవం’ కలగాలని, తద్వారా మానవ ప్రగతి ముందుకు సాగాలని మనం కోరుకోవాలి.

కాబట్టి, ‘పరాభవ నామ సంవత్సరం’ అంటే అపజయాల కాలం కాదు, అహంకారాన్ని వీడి, ఆత్మపరిశీలన చేసుకుని, పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులతో అత్యున్నత శిఖరాలను చేరుకునే జ్ఞానోదయ కాలం! ఈ ఉగాది పండుగను ఎలాంటి అపోహలు లేకుండా ఆనందంగా జరుపుకుందాం.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి