vastu Tips dont use these 6 things of other persons cause of bad effects
Vastu Tips : మనదేశంలో అత్యధిక శాతం మంది వాస్తు శాస్త్రాన్ని నమ్ముతారు. ఏది కొనాలన్నా వస్తును చాడటం తప్పనిసరి. ఏ వస్తువు ఎక్కడుండాలి… ఏది ఎక్కడ పెడితే బాగుంటుంది. ఇంటి విషయంలో ప్రతి ఒక్కటి వాస్తుప్రకారమే చేస్తుంటారు. ఏ దోషం లేకుండా అన్ని సక్రమంగా చూసుకుంటారు. ఇంతే కాకుండా ఏ వస్తువును ఇతరులనుంచి తీసుకోవాలి.. ఏది తీసుకుని వాడుకోవద్దు అనే విషయాలు కూడా వాస్తు శాస్త్రంలో చెప్పబడ్డాయి. చాలా మంది ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చిన్నప్పుడు ఇతరు వస్తువులను తీసుకుని బయలుదేరుతారు. తర్వత ఇబ్బందులపాలు అవుతారు. కానీ.. ఆ విషయం వారికి అంతగా తెలియకపోవచ్చు. ఏ వస్తువులు తీసుకుంటే ఇబ్బంది పడతాం.. ఇతరుల నుంచి ఏం తీసుకోకూడదు అనేది ఇప్పడు చూద్దాం…
మనకు చాలా మంది పెద్దలు ఇతరుల బట్టలు, చెప్పులు వంటివి వాడుకోవద్దని. వారికి ఉన్న శని, దురదృష్టం వంటివి మనకు వస్తాయని చెబుతుంటారు. చాలా మంది యువత తమ ఫ్రెండ్స్ డ్రెస్సులను వాడుతుంటారు. ఒకే రూంలో ఉండేవారు కానీ.. ఒకే ఊరిలో ఉండే వారు కానీ.. ఇలా చాలా మంది తమ బట్టలను షేర్ చేసుకుంటారు. ఫంక్షన్స్ లో పార్టీలకు వెళ్లడానికి నీ డ్రెస్ బాగుంది ఇవ్వురా.. అంటూ తీసుకుని వెళ్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇతరుల బట్టలను అస్సలు తీసుకోవద్దు. అలానే మన బట్టలనూ ఇతరులకు ఇవ్వొద్దు. అలా చేయడం వలన ప్రతికూల శక్తి మనలోకి ఎంటర్ అవుతుందని తెలియజేస్తోంది. ఇతరుల డ్రెస్సులు ధరించినట్లయితే అనుకున్న పని పూర్తి కాదని, చేయాల్సిన పని పని మధ్యలోనే ఆగిపోతుందిన చెబుతున్నారు.అలాగే మనం చాలా మంది దగ్గర నుంచి పెన్ తీసుకుని పొరపాటునో కావలనో ఇవ్వకపోవడం చేస్తుంటాం. ఏదైనా ఆఫీస్ లో కావచ్చు.
vastu Tips dont use these 6 things of other persons cause of bad effects
బ్యాంకుల్లో కావచ్చు.. ఓ చిన్న సంతకం కోసమో.. లేదంటే ఏదైనా రాయడానికి తీసుకుంటాం కానీ ఇవ్వడం మరచిపోతుంటాం. ఇలా ఇతరుల పెన్ మన దగ్గరే ఉంచేసుకోవడం వల్ల కొంత అశుభం జరగవచ్చని.. మనీ కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు. అందుకే ఇతరుల పెన్ తీసుకోకపోవడమే మంచిది.అలాగే చాలా మంది చేతి రుమాలు (కర్చీఫ్) ఇతరులు.. ఫ్రెండ్స్ నుంచి తీసుకుని వాడుతుంటారు. కొంత మంది రుమాలును గిఫ్ట్ లాగా తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల మన లైఫ్లో గొడవలు, బంధాలు విడిపోవటం లాంటివి జరుగుతాయి. అందుకే చేతిరుమాలు తీసుకోకపోవడమే మేలు.అలాగే ఉంగరాలను కూడా చాలామంది మార్చుకుంటారు. ఒకరిది మరొకరు ధరిస్తుంటారు. ఇలాచేయడం వల్ల మన ఆరోగ్యం, కెరీర్, ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది.అంతేకాకుండా ఇతరుల వాచ్ (గడియారం) మణికట్టుపై ధరించడం వల్ల కూడా బ్యాడ్ టైం మొదలైతుందని వాస్తు శాస్త్రంలో చెప్పబడుతుంది. అందుకే ఇతరుల గడియారం ధరించకపోవడమే మంచిది.
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
This website uses cookies.