Home » Devotional » What If Water Comes Into Dreams Is It Good Or Bad Indication
Devotional

Dreams : కలలో పదేపదే నీరు కనిపిస్తుందా… అయితే మీ జీవితంలో ఈ మార్పులు తప్పవు…!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: October 8, 2024 7:55 pm
Advertisement

Dreams : వ్యక్తి యొక్క కలలకి అతని జీవితానికి కొంత సంబంధం అనేది కచ్చితంగా ఉంటుంది. అయితే చాలామంది కలలు ఎందుకు వస్తాయి. వాటి అర్థమేమిటి అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిలోను ఉంటాయి. కలలు వాటి అర్థాల గురించి స్వప్న శాస్త్రంలో వివరంగా చెప్పబడింది. ఇక స్వప్న శాస్త్రంలో ప్రతి కలకి అర్థం ఉంటుందని అంతేకాకుండా అవి జీవితానికి శుభ లేదా ఆ శుభ ఫలితాలను కలిగించేవి అనే విషయాలను కూడా తెలియజేస్తుంది. అయితే కొంతమందికి కలలో నీరు కనిపించడం వంటివి జరుగుతాయి. మరి కలలో నీరు కనిపిస్తే అది దేనికి సంకేతం అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

Advertisement

ఒక వ్యక్తి కలలో నీరు పదే పదే కనిపిస్తే అది వారి భవిష్యత్తుకు సంబంధించిన సంకేతం అవుతుంది. అయితే నీరు కలలో వివిధ రకాలుగా కనిపిస్తుంది. కొన్నిసార్లు ఫౌంటెన్ రూపంలో, వర్షం రూపంలో , సముద్రం రూపంలో , నది రూపంలో ఇలా అనేక రకాలుగా కనిపిస్తుంది. కలలో నీరు ఏ రూపంలో కనిపిస్తే అది దేనికి సంకేతామో ఇప్పుడు తెలుసుకుందాం.

Dreams : కలలో నీటిని చూడడం..

స్వప్న శాస్త్రం ప్రకారం కలలో నీరు కనిపిస్తే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది.ఇక ఈ కల అర్ధం ఆ వ్యక్తి కెరియర్ లో మరియు వ్యాపారంలో విజయాలను సాధించబోతున్నాడు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో అతను ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతాడు అని అర్థం.

Advertisement

Dreams కలలో ఫౌంటెన్ కనిపిస్తే..

కలల శాస్త్రం ప్రకారం కలలో ఫౌంటెంట్ కనిపిస్తే అది శుభప్రదంగా భావించవచ్చు. ఈ కల యొక్క అర్థం కోరికలు నెరవేరుతాయని అలాగే జీవితంలో ఆనందంగా ఉంటారు.

కలలో సముద్రాన్ని చూడడం : కలల శాస్త్రం ప్రకారం కలలో సముద్రం కనిపిస్తే ఇది అశుభంగా పరిగణించబడుతుంది. దీని అర్థం ఆ వ్యక్తి భవిష్యత్తులో ఏదైనా ప్రమాదానికి గురవుతాడు. అదేవిధంగా సముద్ర తీరాన నిలబడినట్లు అనిపిస్తే మీరు రక్షించబడతారని ఈ కల సంకేతం.

Advertisement

కలలో నదిని చూడడం : స్వప్న శాస్త్రం ప్రకారం వ్యక్తి కలలో నది కనిపిస్తే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ కల అర్థం ఆ వ్యక్తి జీవితంలో కొన్ని శుభవార్తలను వింటాడు.

కలలో వర్షాన్ని చూడటం : కలల శాస్త్రం ప్రకారం వ్యక్తి కలలో వర్షాన్ని చూస్తే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ కల యొక్క సంకేతం ఆ వ్యక్తి జీవితంలో ఏదో ఒక మంచి జరగబోతుందని తెలియజేస్తుంది. అలాగే ఆర్థికంగా మంచి విజయాలను సాధిస్తారు.

Dreams : కలలో పదేపదే నీరు కనిపిస్తుందా… అయితే మీ జీవితంలో ఈ మార్పులు తప్పవు…!

కలలో తడిసిపోయినట్లు కనిపిస్తే : స్వప్న శాస్త్రం ప్రకారం వ్యక్తి కలలో వర్షంలో తడిచినట్లు కనిపిస్తే ఆ వ్యక్తి తన జీవితంలో ఏదో ఒక పనిలో విజయం సాధించబోతున్నారని సంకేతం. అంతేకాకుండా తన జీవితంలోని కష్టాల నుండి ఉపశమనాన్ని పొందుతాడు. ఉద్యోగ సమస్యలు పరిష్కారం కావచ్చు లేదా ప్రమోషన్ అయిన కావచ్చు.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి