Tulsi Plant : హిందూ సంప్రదాయాల ప్రకారం తులసి మొక్కను అత్యంత పవిత్రంగా భావిస్తారు. అలాగే మంచి రోజులు, వారాల్లో పూజలు కూడా చేస్తుంటారు. హిందూ గ్రంథాల్లో తులసి మొక్క ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పారు. ఇంట్లో శాంతి సంతోషాలు నెలకొనేందుకు తులసిని పూజిస్తారు. విష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైంది. పూజలో తులసి దళాన్ని సమర్పించకపోతే.. అది అంసపూర్ణం అని భక్తుల నమ్మకం. హిందూ మతంలో తులసిని లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తారు. తులసిని ప్రతి రోజూ పూజించే ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, సంపద ఉంటుంది. ప్రాచీన కాలం నుంచి రోజూ తులసి మొక్కను పూజిస్తారు. రోజూ నీరు పోస్తారు. అయితే తులసికి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో నీరు పోయడం అశుభకరమని శాస్త్రాలు చెబుతున్నారు.
ఈరోజు రోజున ఎటువంటి సందర్భాల్లో తులసికి నీరు పోయకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఆదివారం రోజున, ఏకాదశి, సూర్య, చంద్ర గ్రహణాల సమయాల్లో తులసికి నీరు పోయకూడదు. ంతే కాదు సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులను మొక్క నుంచి తుంచకూడదు. ఆదివారం మినహా గురు వారాల్లో తులసి చెట్టుకు పచ్చి పాలు పోసి ప్రతిరోజూ సాయంత్రం నెయ్యితో దీపం వెలిగించి పూజించే వారి ఇంట్లో లక్ష్మీ దేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే ఎండిన తులసి మొక్కలను ఎప్పుడూ ఇంట్లో ఉంచకూడదు. అలా ఎండిన తులసి మొక్క ఉన్న ఇల్లు దుష్ట శక్తుల బారిన పడుతుందని నమ్మకం. పాత తులసి చెట్టు స్థఆనంలో కొత్త చెట్టు నాటడానికి ముందు పాత చెట్టును చెరువులో బావిలో లేదా పవిత్ర స్థలంలో నిమజ్జనం చేయాలి. అనంతరం దాని స్థానంలో కొత్త మొక్కలు నాటాలి.
తులసి చెట్టు అన్ని విధాలా ప్రయోజనకారి. ఈశాన్యం లేదా తూర్పు వైపు తులసి మొక్కను నాటాలి. ఇంటి దక్షిణ భాగంలో ఎప్పుడూ తులసిని నాటకండి. ఎందుకంటే అలా దక్షిణ దిశలో తులసి ఉంటే… ఇంట్లో అశాంతి వాతావరణాన్ని సృష్టిస్తుందని నమ్మకం. ప్రతీ ఆదివారం, ఏకాదశిలో విష్ణువు కోసం ఉపవాసం ఉంటుంది. కనుక ఏకాదశిల్లో తులసికి నీళలు సమర్పించకూడదు. సూర్య, చంద్ర గ్రహణాల సమయంలో కూడా తులసికి నీరు పెట్టకూడదు. ఈ రోజుల్లో తులసి ఆకులను తుంచవద్దు. అలాగే తులసి ఆకులను ఎప్పుడూ గోళ్లతో తుంచకూడదు. అయితే తులసి ఆకులను వేలి కొనతో తెంపవద్దు. తులసి ఆకులను ఎప్పుడూ మొక్క పాడవకుండా తుంచాలి. అలాగే స్నానం చేయకుండా తులసి చెట్టును ఎప్పుడూ తాకకూడదు.
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.