Tulsi Plant : తులసి చెట్టుకు ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు పోస్తున్నారా.. వామ్మో అలా అస్సలే చేయకూడదట! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Tulsi Plant : తులసి చెట్టుకు ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు పోస్తున్నారా.. వామ్మో అలా అస్సలే చేయకూడదట!

Tulsi Plant : హిందూ సంప్రదాయాల ప్రకారం తులసి మొక్కను అత్యంత పవిత్రంగా భావిస్తారు. అలాగే మంచి రోజులు, వారాల్లో పూజలు కూడా చేస్తుంటారు. హిందూ గ్రంథాల్లో తులసి మొక్క ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పారు. ఇంట్లో శాంతి సంతోషాలు నెలకొనేందుకు తులసిని పూజిస్తారు. విష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైంది. పూజలో తులసి దళాన్ని సమర్పించకపోతే.. అది అంసపూర్ణం అని భక్తుల నమ్మకం. హిందూ మతంలో తులసిని లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తారు. తులసిని ప్రతి రోజూ […]

 Authored By pavan | The Telugu News | Updated on :18 May 2022,7:00 am

Tulsi Plant : హిందూ సంప్రదాయాల ప్రకారం తులసి మొక్కను అత్యంత పవిత్రంగా భావిస్తారు. అలాగే మంచి రోజులు, వారాల్లో పూజలు కూడా చేస్తుంటారు. హిందూ గ్రంథాల్లో తులసి మొక్క ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పారు. ఇంట్లో శాంతి సంతోషాలు నెలకొనేందుకు తులసిని పూజిస్తారు. విష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైంది. పూజలో తులసి దళాన్ని సమర్పించకపోతే.. అది అంసపూర్ణం అని భక్తుల నమ్మకం. హిందూ మతంలో తులసిని లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తారు. తులసిని ప్రతి రోజూ పూజించే ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, సంపద ఉంటుంది. ప్రాచీన కాలం నుంచి రోజూ తులసి మొక్కను పూజిస్తారు. రోజూ నీరు పోస్తారు. అయితే తులసికి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో నీరు పోయడం అశుభకరమని శాస్త్రాలు చెబుతున్నారు.

ఈరోజు రోజున ఎటువంటి సందర్భాల్లో తులసికి నీరు పోయకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఆదివారం రోజున, ఏకాదశి, సూర్య, చంద్ర గ్రహణాల సమయాల్లో తులసికి నీరు పోయకూడదు. ంతే కాదు సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులను మొక్క నుంచి తుంచకూడదు. ఆదివారం మినహా గురు వారాల్లో తులసి చెట్టుకు పచ్చి పాలు పోసి ప్రతిరోజూ సాయంత్రం నెయ్యితో దీపం వెలిగించి పూజించే వారి ఇంట్లో లక్ష్మీ దేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే ఎండిన తులసి మొక్కలను ఎప్పుడూ ఇంట్లో ఉంచకూడదు. అలా ఎండిన తులసి మొక్క ఉన్న ఇల్లు దుష్ట శక్తుల బారిన పడుతుందని నమ్మకం. పాత తులసి చెట్టు స్థఆనంలో కొత్త చెట్టు నాటడానికి ముందు పాత చెట్టును చెరువులో బావిలో లేదా పవిత్ర స్థలంలో నిమజ్జనం చేయాలి. అనంతరం దాని స్థానంలో కొత్త మొక్కలు నాటాలి.

what is the reason behind the do not offer water to Tulsi Plant

what is the reason behind the do not offer water to Tulsi Plant

తులసి చెట్టు అన్ని విధాలా ప్రయోజనకారి. ఈశాన్యం లేదా తూర్పు వైపు తులసి మొక్కను నాటాలి. ఇంటి దక్షిణ భాగంలో ఎప్పుడూ తులసిని నాటకండి. ఎందుకంటే అలా దక్షిణ దిశలో తులసి ఉంటే… ఇంట్లో అశాంతి వాతావరణాన్ని సృష్టిస్తుందని నమ్మకం. ప్రతీ ఆదివారం, ఏకాదశిలో విష్ణువు కోసం ఉపవాసం ఉంటుంది. కనుక ఏకాదశిల్లో తులసికి నీళలు సమర్పించకూడదు. సూర్య, చంద్ర గ్రహణాల సమయంలో కూడా తులసికి నీరు పెట్టకూడదు. ఈ రోజుల్లో తులసి ఆకులను తుంచవద్దు. అలాగే తులసి ఆకులను ఎప్పుడూ గోళ్లతో తుంచకూడదు. అయితే తులసి ఆకులను వేలి కొనతో తెంపవద్దు. తులసి ఆకులను ఎప్పుడూ మొక్క పాడవకుండా తుంచాలి. అలాగే స్నానం చేయకుండా తులసి చెట్టును ఎప్పుడూ తాకకూడదు.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది