Home » Devotional » Whats Happen If Step On Lemons And Chillies
Devotional

దిష్టి తీసిన నిమ్మకాయలు, మిరపకాయలను తొక్కవచ్చా .. ?? జ్యోతిష్యం ఏం చెబుతుంది ..??

Authored By
aruna
The Telugu News | Published on: October 1, 2023, 1:00 pm
Advertisement

సైన్స్, టెక్నాలజీ ఎంత పెరిగిన ఇప్పటికీ దిష్టిని చాలామంది నమ్ముతుంటారు. నరదిష్టికి నల్ల రాయి కూడా పగిలిపోతుందంటారు. చదువుకున్న వారు కూడా దీనిని పాటిస్తారు. మరీ ముఖ్యంగా పిల్లల విషయంలో దిష్టిని బాగా నమ్ముతారు. దిష్టి తగిలిందని భావిస్తే వెంటనే దిష్టి తీసి రోడ్డు మీద పడేస్తుంటారు. ఇక దిష్టి తీయడానికి నిమ్మకాయలు ఎండు మిరపకాయలు లేదా పచ్చిమిరపకాయలు, కోడిగుడ్లను వాడుతుంటారు. అయితే ఇలా దిష్టి తీసిన వాటిని రోడ్ల పైన పడేస్తుంటారు. అయితే ఈ దిష్టి తీసిన వాటిని తొక్కవచ్చా లేదా తొక్కితే ఏమవుతుంది అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి.

Advertisement

అయితే రోడ్డు మీద పడి ఉన్న వాటిని తొక్కితే ఏమీ కాదని హేతువాదులు చెబుతున్నారు. అయితే కొందరు మాత్రం వాటిని తాకడం, తొక్కడం, దాటడం వంటివి చేయకూడదని చెబుతున్నారు. దిష్టి తీసిన వాటిని తొక్కిన తాకిన నెగిటివ్ ఫలితాలు వస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. చాలామంది నెగటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు. నిజంగా రోడ్డుపైన పడేసిన వాటిని అస్సలు ముట్టుకోకూడదు. రోడ్డుపైన పడి ఉన్న వెంట్రుకలను కూడా అసలు ముట్టకూడదు. దాని మీద నుంచి దాటి వెళ్ళకూడదు. అలా దాటి వెళితే అది జీవితంలో సమస్యలను కలిగిస్తుంది.

What’s happen if step on lemons and chillies

Advertisement

రోడ్డుపై పడి ఉన్న నిమ్మకాయలు, మిరపకాయలను తొక్కకుండా ఉండటం మంచిది. వాటిని తొక్కితే ప్రతికూల ప్రభావాలు వస్తాయని కొందరు బలంగా నమ్ముతారు. పూజా సామాగ్రి కానీ ఆహారం కానీ రోడ్డు పక్కన లేదా చెట్టు కింద ఉంటే వాటిని అసలు ముట్టుకోకుండా ఉండాలి. అయితే దిష్టి తీసి పడేసిన గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయ తొక్కిన అనుమాన పడాల్సిన అవసరం లేదు అని పండితులు చెబుతున్నారు. మన పూర్వపు రోజుల్లో దిష్టి తగిలినప్పుడు నిమ్మకాయలు లేదా ఉప్పును తిప్పేసి వాటిని కట్టెల పొయ్యి నిప్పుల మీద వేసేవారు. కానీ ఇప్పడు అలాంటివి లేవు. అందరివి గ్యాస్ పొయ్యిలే. దీంతో అందరూ దిష్టి తీసి రోడ్లమీద పడేస్తున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి