Diwali : దీపావళి పండగను చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు. చిన్నపిల్లలకు దీపావళి పండుగ అంటే ఎంతో ఇష్టం. ఆ రోజున బాణాసంచా కాల్చవచ్చని మరియు కమ్మనైన పిండి వంటలు తినవచ్చని అనుకుంటారు. అలాగే ఆ రోజున లక్ష్మీదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. లక్ష్మీదేవిని పూజించడం వలన ఇంట్లో సంపద పెరగడంతో పాటు జీవితం సంతోషంగా ఉంటుందని నమ్ముతారు. అయితే దీపావళి రోజున లక్ష్మీదేవితో పాటు శనీశ్వరుని పూజించడం వలన అనుకున్న కోరికలు నెరవేరుతాయి. కొంతమందికి శని దేవుడు అంటే భయం. ఏలినాటి శని ఉంటే ఏడు సంవత్సరాల వరకు పోదు అని అంటారు. అలాగే ఎవరైనా తప్పులు చేస్తే శని శిక్షిస్తాడు. అష్టమ శని సడే సాతి అనేవి వింటూనే ఉంటాం. శని వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తుంటాడు.
శనీశ్వరుడు కరుణిస్తే కటిక పేదవాడైన ధనవంతుడిగా మారిపోతాడు. అదేవిధంగా ఎంత పెద్ద రాజు అయిన బీదవాడిగా మారిపోతాడు. కాబట్టి మంచి పనులు చేస్తూ శనిశ్వరుడి అనుగ్రహం పొందాలని పురోహితులు చెబుతున్నారు. కాబట్టి దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవితో పాటు శనీశ్వరుని కూడా పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకుంటారు. అయితే అమావాస్య అంటే శనీశ్వరుడికి ఎంతో ఇష్టం. కాబట్టి దీపావళి పండుగ రోజున శనీశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఆ రోజున ఆవులు కాకులు కుక్కలు తినడానికి ఏమైనా ఆహార పదార్థాలను పెట్టడం వలన శని అనుగ్రహాన్ని పొందవచ్చు.
దీపావళి పండుగ రోజున శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపిస్తే శని అనుగ్రహం లభిస్తుంది. అయితే పురాణాల ప్రకారం దీపావళి పండుగ రోజున హనుమంతుడిని మరియు వెంకటేశ్వర స్వామిని పూజించిన శని అనుగ్రహం లభిస్తుంది.
పండగ రోజు ఇలా చేయండి : దీపావళి పండుగ రోజున నల్ల చీమలకు ఆహారంగా బెల్లం లేదా పంచదారను వెయ్యండి. అదేవిధంగా దీపావళి రోజున ఒక గిన్నెలో నూనె పోసి అందులో వారి మొఖం చూసుకుంటే జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆ తరువాత కాళ్లు చేతులు కడుక్కొని వెనకకి తిరిగి చూడకుండా వారి ఇంటికి వెళ్లి పోవాలి. ఇలా చేయడం వలన అపారమైన ధనం తో పాటు ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి.
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
Exit polls Maharashtra : బుధవారం జరిగిన మహారాష్ట్ర మరియు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో అనేక ఎగ్జిట్ పోల్స్ బిజెపి నేతృత్వంలోని…
Mohini Dey : స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ar rahman భార్య సైరా బాను Saira Banu…
This website uses cookies.