Krishna Temple : ఇలాంటి కృష్ణుడు గుడి మీరెక్కడ చూసి ఉండరు.. అడుగుపెడితే జీవితమే మారిపోతుంది…
ప్రధానాంశాలు:
Krishna Temple : ఇలాంటి కృష్ణుడు గుడి మీరెక్కడ చూసి ఉండరు.. అడుగుపెడితే జీవితమే మారిపోతుంది...
Krishna Temple : శ్రీకృష్ణుడి లీలల గురించి మన చిన్నతనంలో పెద్దలు చెబుతుంటే ఎన్నో కథలు వినే ఉంటాం. అలాగే మన పురాణాలలో ఇతిహాసాలలో కూడా శ్రీకృష్ణుని లీలలు గురించి మనం తెలుసుకున్నాం. ఉట్టిమీద వెన్నెను దొంగలించడం, మన్ను తినడం , గోపికలను ఆటపట్టించడం వంటి అల్లరి పనులు శ్రీకృష్ణుడు చేసేవాడు. అలాగే ఆలమందులు , తన ప్రజల పట్ల శ్రీకృష్ణుడు అమితమైన ప్రేమను కలిగి ఉండేవాడు. దుష్ట శిక్షణ ప్రజల రక్షణ కోసం శ్రీకృష్ణుడు ఎప్పుడు ముందుండేవాడు. శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు లీలలకు సంబంధించి ఎన్నో కథలు పురాణాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే అవి కేవలం కథలు మాత్రమే కాదు వాస్తవాలు అని చెప్పే విధంగా నేటికీ కొన్ని ప్రదేశాలు ఈ పురాణాలను రుజువు చేస్తున్నాయి. అయితే శ్రీకృష్ణుడికి సంబంధించిన ప్రతి కథలో తన ప్రజలను కాపాడుకోవడం కోసం చిటికెన వేలుపై శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాడు అని చాలా సందర్భాల్లో వినే ఉంటాం. ఇక ఇది ఊహించుకుంటేనే చాలా గొప్పగా అనిపిస్తుంది. అలాంటిది నేరుగా వెళ్లి శ్రీకృష్ణుడు చిటికెన వేలు పై గోవర్ధనగిరి ఎత్తుకున్న దృశ్యాలను చూస్తే ఎలా ఉంటుంది.
అవును మీరు వింటున్నది నిజమే…శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతం ఎత్తుకొని దర్శనమిస్తున్న ఒక గుడి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇక ఈ గుడి విషయానికి వచ్చినట్లయితే…భారతదేశంలోని దక్షిణ బెంగళూరు కర్ణాటకలో బసవన్న గుడికి సమీపంలో శ్రీ గోవర్ధన క్షేత్ర అనే ఆలయం ఉంది. ఇక ఈ ఆలయాన్ని ఉడుపి శ్రీ పుతిగే మాత బ్రాంచ్ వారు నిర్వహిస్తున్నారు. ఇక ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలుతో ఎత్తుకొని దర్శనమిస్తాడు. ఇక ఈ గుడి మొత్తం ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి నిర్మించడం జరిగింది. ఈ ఆలయం బయట నుండి లోపల వరకు పూర్తిగా బండ రాయి తో చేసినట్లుగా కనిపిస్తుంది కానీ వాస్తవానికి అవన్నీ నిజమైన రాళ్లు కావు. ఇక ఆలయం లోపల కూడా అదేవిధంగా ఉంటుంది. అదేవిధంగా ఈ ఆలయంలో శ్రీకృష్ణుని కథను తెలియజేసే పలు రకాల సన్నివేశాలకు సంబంధించిన చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే పురాణాల ప్రకారం పూర్వం బృందావనంలో దేవతలకు అధిపతి అయినటువంటి ఇంద్రుని సంతృప్తి పరిచేందుకు ప్రతి సంవత్సరం ప్రజలు ఇంద్రునికి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించేవారు.
అయితే ఒకసారి ఇదేవిధంగా ప్రజలు ఇంద్రునికి పూజలు చేసేందుకు సిద్ధమవుతుండగా శ్రీకృష్ణుడు ప్రజలతో మనం గోపాలులం మనకు జీవనాధారమైన గోవులను అలాగే అన్ని విధాలుగా ఆహారాలు అందిస్తున్న గోవర్ధనగిరి కొండ కు పూజలు చేయాలి కానీ ఇంద్రుడికి పూజలు ఎందుకని ప్రశ్నిస్తాడు. దీంతో ప్రజలు కూడా ఇంద్రునికి పూజలు చేయడం మానేసి గోవులకు మరియు పర్వతాలకు పూజలు చేయడం మొదలుపెడతారు. దీంతో ఆగ్రహించిన ఇంద్రుడు దాదాపు 7 రోజులపాటు ప్రళయాన్ని సృష్టిస్తారు. ఈ క్రమంలోనే తన ప్రజలను గోవులను కాపాడుకునేందుకు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలుతో ఎత్తి ఏడు రోజులు పాటు అలాగే ఉంటాడు. అనంతరం ఇంద్రుడు కృష్ణుడిని భగవంతుడిగా భావించి తన ఓటమి అంగీకరిస్తాడు.ఆ విధంగా శ్రీకృష్ణుడు గోవిందుడు గిరిదారుడు అనే నామాలతో కూడా ప్రసిద్ధి చెందాడు. ఇక ఈ సన్నివేశం గురించి మాట్లాడుకుంటేనే ఒళ్లంతా పులకరించిపోతుంది. అలాంటి అపూర్వ ఘట్టాన్ని ప్రజలకు కళ్ళారా చూపించేందుకు శ్రీ గోవర్ధన క్షేత్ర నిర్మించారని చెప్పాలి. మరి ఈ అపూర్వఘట్టాన్ని మీరు కూడా వీక్షించాలంటే బెంగళూరులోని ఈ ఆలయాన్ని దర్శించాల్సిందే