Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన వెండి ధర.. స్థిరంగా బంగారం ధర.. ఎంతో తెలుసా?

Authored By Jagadesh Gatla | The Telugu News | Published on: April 28, 2022, 9:00 am

Today Gold Rates : బంగారం ధరలు భారత్ లో ఆకాశాన్ని అంటాయి. పేద, మధ్యతరగతి ప్రజలకు ఇప్పుడు బంగారం కొనాలంటే గగనంగా మారింది. ఒకప్పుడు బంగారం కొనాలంటే.. పెద్దగా ఆలోచించని ప్రజలు.. ఇప్పుడు బంగారం కొనాలంటే మాత్రం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బంగారానికి విపరీతంగా డిమాండ్ పెరగడంతో పాటు అంతర్జాతీయ పరిస్థితుల వల్ల బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. దేశవ్యాప్తంగా ఇవాళ్టి బంగారం ధరలు చూసుకుంటే.. భారత్ లో ఇవాళ బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్నటితో పోల్చితే బంగారం ధరలు స్థిరంగా ఉండటంతో పాటు వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి.

24 april 2022 today gold rates in telugu states

24 april 2022 today gold rates in telugu states

భారత్ లో ఒక గ్రాము బంగారం 22 క్యారెట్లకు ధర రూ.4845గా ఉంది. 10 గ్రాములకు రూ.48,450గా ఉంది. 24 క్యారెట్లకు రూ.52,860 గా ఉంది. అంటే.. 22, 24 క్యారెట్లలో నిన్నటి ధరకే బంగారం ధర స్థిరంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,450గా ఉండగా.. 24 క్యారెట్లకు రూ.52,860గా ఉంది. ఇక.. చెన్నైలో 22 క్యారెట్లకు రూ.48,620, 24 క్యారెట్లకు రూ.53,040, ముంబైలో 22 క్యారెట్లకు రూ.48,450, 24 క్యారెట్లకు రూ.52,860, కోల్ కతాలో 22 క్యారెట్లకు రూ.48,450, 24 క్యారెట్లకు రూ.52,860, బెంగళూరులో 22 క్యారెట్లకు రూ.48,450, 24 క్యారెట్లకు రూ.52,860గా ఉంది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే?

తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే.. హైదరాబాద్ లో 22 క్యారెట్లకు రూ.48,450, 24 క్యారెట్లకు రూ.52,860గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లకు రూ.48,450, 24 క్యారెట్లకు రూ.52,860గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్లకు రూ.48,450, 24 క్యారెట్లకు రూ.52,860గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే.. ఒక గ్రాముకు ఇవాళ రూ.64.70గా ఉంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే గ్రాముకు 0.30 పైసలు తగ్గింది. 10 గ్రాములకు రూ.647 కాగా.. 3 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధర రూ.64,700. అంటే కిలో వెండి మీద రూ.300 తగ్గింది. హైదరాబాద్ లో 10 గ్రాముల వెండి ధర రూ.698 గా ఉంది. కిలో వెండి ధర రూ.69800గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలో కూడా అదే ధర ఉంది.

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp