2024 Rewind : 2024లో వచ్చిన భారీ డిజాస్టర్ సినిమాలు ఏవి.. ఎంత వసూళ్లు రాబట్టాయి..!
2024 Rewind : మరో నాలుగు రోజులలో 2024కి గుడ్ బై చెప్పి 2025కి స్వాగతం చెప్పబోతున్నాం.ఈ క్రమంలో ఈ ఏడాది ఏయే సినిమాలు ఎంత భారీ డిజాస్టర్స్ సాధించాయి అనేది చూస్తే… గత ఏడాదితో పోలిస్తే సక్సెస్ రేటు పెరగడంతో సినీ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కల్కి, పుష్ప 2, దేవర వంటి చిత్రాలు భాక్సాఫీస్ ని దద్దరిల్లేలా చేసాయి. అయితే 2024 లో విజయాలతో పాటు పరాజయాలు కూడా అదే స్థాయిలో వచ్చాయి.ముందుగా వెంకటేష్‌కి 75వ చిత్రం సైంధవ్ కాగా,ఈ సినిమాతో అతి పెద్ద పరాజయాన్ని చవిచూశాడు. సైంధవ్ కోసం వెంకటేష్ యాక్షన్ మోడ్‌లోకి అడుగుపెట్టాడు. సినిమాలో ఆ పార్ట్ పెద్దగా విఫలమైంది. మాస్ మహారాజా రవితేజ నటించిన మూవీ ఈగల్ బాక్సాఫీస్ దగ్గర భారీగా ఫ్లాఫ్ అయ్యింది. మిగతా సినిమాల పోటి రావటంతో సంక్రాంతి బరి నుంచి తప్పుకుని ఈగల్ ఫిబ్రవరి 9న రిలీజ్ అయింది.
2024 Rewind : 2024లో వచ్చిన భారీ డిజాస్టర్ సినిమాలు ఏవి.. ఎంత వసూళ్లు రాబట్టాయి..!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ భారీ డిజాస్టర్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్స మార్చి 1న థియేటర్లో విడుదల కాగా, ఈ ఈ చిత్రం మినిమం ఫుట్‌ఫాల్స్‌ను కూడా రిపోర్ట్ చేయటంలో విఫలమైంది. ఇక శర్వాకి సరైన సాలిడ్ హిట్ ఒకటి రావడం లేదు. అలాంటి శర్వా.. బ్యాడ్ ఫేజ్‌లో ఉన్న కృతి శెట్టితో కలిసి మనమే అనే చిత్రాన్ని చేశాడు. మరి ఈ చిత్రం జూన్ 7న థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమా చివరకు బోరింగ్ ఫీస్ట్ గా మిగిలిపోయింది. రామ్, పూరి కలిసి చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ అని తీశారు. ఈ సినిమా భాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా రన్ ముగిసింది. మిస్టర్ బచ్చన్ మూవీకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. హీరోహీరోయిన్ల కెమిస్ట్రీని హరీష్ శంకర్ సినిమాలో చూపించిన తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. దాదాపు 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ 10 కోట్ల లోపే కలెక్షన్స్ సాధించింది.
బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస ఫ్లాఫ్స్ కి ఎట్టి పరిస్థితులలో కూడా ఈ సారి పులిస్టాప్ పెట్టి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తాను అనుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మట్కాతో మరో డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు.. అయితే ఈ సినిమా ఏ కోణంలోనూ అంచనాలను అయితే అందుకోలేక పోయింది. మొదటి ఆటకే డిజాస్టర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న… ఈ సినిమా తర్వాత ఏ దశలో కూడా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. వీకెండ్ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర కంప్లీట్ గా చేతులు ఎత్తేసిన సినిమా నెగటివ్ షేర్స్ తో పరుగును చాలా కష్టతరం చేసుకుని మొదటి వారం తర్వాత ఎపిక్ డిసాస్టర్ రిజల్ట్ ను కన్ఫాం చేసుకుంది. ఇలా 2024లో పలు హీరోల సినిమాలు దారుణమైన పరాజయాన్ని చవి చూశాయి.
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
This website uses cookies.