Phonepe : ఇంటర్‌టెన్ వినియోగం పెరగడంతో అన్ని పనులు చాలా సులభం అయ్యాయి. ఒకప్పుడు బ్యాంకుకు వెళ్లి చేయాల్సిన పనులన్నీ ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని చేసే పరిస్థితి వచ్చేసింది. కంపెనీల మధ్య పెరుగుతోన్న పోటీ కారణంగా పేమెంట్ యాప్స్ సైతం ఎన్నో ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో లోన్‌లకు కూడా రకరకాల యాప్‌లు పుట్టుకొచ్చాయి. ప్రముఖ బ్యాంకులు కూడా యాప్ ద్వారా లోన్‌లను అందిస్తున్నాయి. గూగుల్ పే లేదా ఫోన్‌పే అనేవి నేరుగా రుణాలు ఇవ్వవు. ఇవి ఇతర సంస్థలతో భాగస్వామ్యం ద్వారా రుణ సదుపాయం అందిస్తున్నాయి. అంటే ఫోన్‌పే.. మనీ వ్యూ, బడ్డీ లోన్ వంటి వాటితో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
మీరు ఫోన్‌పే వాడుతూ ఉంటే సులభంగానే రుణం కోసం అప్లై చేసుకోవచ్చు. ఇన్‌స్టంట్ లోన్ ఆప్షన్ అందుబాటులో ఉంది. రూ. 25 వేల నుంచి రూ. 5 లక్షల వరకు లోన్ పొందొచ్చు. ఇంతకీ లోన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి? వడ్డీ రేటు ఎలా ఉంటుంది? వంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఫోన్‌పే బిజినెస్ యాప్ హోమ్ స్క్రీన్‌లో “Get Loan” పై ట్యాప్ చేయండి. మీ అవసరాలకు తగిన లోన్ ఆఫర్‌ను ఎంచుకోండి. వ్యక్తిగత వివరాలను నమోదు చేసి,కేవైసీ పూర్తి చేయండి. లోన్ వివరాలను సమీక్షించి, ఆమోదం ఇవ్వండి. పెండింగ్ చెల్లింపుల కోసం మాండేట్ సెట్ చేయండి. లోన్ ఒప్పందాన్ని సమీక్షించి ఆమోదించండి. 48 గంటల్లో మీ బ్యాంక్ ఖాతాలో లోన్ క్రెడిట్ అవుతుంది.
అయితే కేవైసీ పూర్తి అయిన తర్వాత, ఫోన్‌పే లెండింగ్ పార్ట్నర్ మీ దరఖాస్తును సమీక్షిస్తారు. లెండింగ్ పార్ట్నర్ ఆమోదించిన వెంటనే, మీరు మీ లోన్ ఒప్పందాన్ని సమీక్షించి ఆమోదం తెలపాలి. మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే.. మీకు వచ్చిన లోన్ లిమిట్‌లో మీకు నచ్చిన మొత్తాన్ని రుణం రూపంలో పొందొచ్చు. లోన్ డబ్బులు 48 గంటల్లో మీ బ్యాంక్ అకౌంట్ జమ అవుతాయి. ఇలా చాలా సింపుల్‌గా లోన్ పొందొచ్చు. మీరు రూ.10 వేల నుంచి రూ. 3 లక్షల వరకు లోన్ పొందొచ్చు. ఎక్కడికీ వెళ్లకుండానే ఇంట్లో నుంచే లోన్ కోసం అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది.
Nitish Kumar Reddy : ind vs aus 4th test 2024 ప్రస్తుతం భారత్- ఆస్ట్రేలియా మధ్య నాలుగో…
Lifestyle : మనం నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లను ఎప్పుడు తింటూ ఉండాలి. అటువంటి పండు ఆపిల్ పండు ఒకటి,…
Nani Sharwanand : న్యాచురల్ స్టార్ నాని, శర్వానంద్ ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుంది. అది…
Cumin Water : మన వంటింట్లో తేలికగా దొరికే పదార్థాలతో మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటైనది జీలకర్ర,…
Zodiac Sign : హిందూమతంలో సంపదలకు అధిపతి అయిన కుబేరుడు ఈ సంవత్సరంలో ఈ రాశులకు చెరువుల వర్షం కురిపించబోతున్నాడు.…
Jobs : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి లేదా ఇంటర్ పాస్ అయితే చాలు వారికి మంచి ఉద్యోగం దక్కే…
Zodiac Signs : 2025 సంవత్సరంలో ముఖ్య గ్రహాలు శని రాహుల కలయికలు జరగబోతున్నాయి. ఈ ఏడాది శని రాహు…
Sreemukhi : యాంకర్ శ్రీముఖి ఫోటో షూట్స్ చేయడం చాలా కామన్. కానీ ప్రతి ఫోటో షూట్ లో ఆమెను…
This website uses cookies.