
Aluminium Factory : ఐదు సినిమాల షూటింగ్ లో అల్యూమినియం ఫ్యాక్టరీ.. మహేష్, ప్రభాస్ తో సహా వాళ్లు కూడా..?
Aluminium Factory: టాలీవుడ్ Tollywood ఇప్పుడు కేరాఫ్ అల్యూమినియం ఫ్యాక్టరీ గా మారింది. షూటింగ్ కు సంబందించిన అక్కడ సౌకర్యవంతంగా ఉండటంతో పాటు చాలా యాక్షన్ సీక్వెనెసెస్ అక్కడ చేసినవి సూపర్ హిట్ అవ్వడంతో అక్కడ షూటింగ్ చేసేందుకు మేకర్స్ చూస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సినిమాల షూటింగ్స్ జరుగుతునట్టు తెలుస్తుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలోనే మహేష్ రాజమౌళి సినిమాకు సంబందించిన షూట్ మొదలైంది. సినిమా పూజా కార్యక్రమాలను కూడా అక్కడే సీక్రెట్ గా నిర్వహించారని తెలిసిందే. మరోపక్క ప్రభాస్ హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫౌజి సినిమా షూటింగ్ కూడా అక్కడే జరుగుతున్నట్టు తెలుస్తుంది. సినిమాలో యాక్షన్ సీన్స్ అక్కడ షూట్ చేస్తున్నారట.
Aluminium Factory : ఐదు సినిమాల షూటింగ్ లో అల్యూమినియం ఫ్యాక్టరీ.. మహేష్, ప్రభాస్ తో సహా వాళ్లు కూడా..?
ఇక నితిన్ రాబిన్ హుడ్ ఇంకా నిఖిల్ స్వయంభుతో పాటుగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సన్నీ డియోల్ జాత్ సినిమా కూడా అక్కడే షూటింగ్ జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది. సో ఒకేసారి ఐదు భారీ సినిమాల షూటింగ్ జరుపుకుంటుండగా అల్యూమినియం ఫ్యాక్టరీ పేరు మారు మోగుతుంది. ఏది ఏమైనా సినిమాలో యాక్షన్ సీన్స్ అదిరిపోవాలనే ఆలోచనతో మేకర్స్ అంతా ఈఅ ఫ్యాక్టరీని అద్దెకు తీసుకుని షూటింగ్స్ చేస్తున్నారు.
అల్యూమినియం ఫ్యాక్టరీ అనేది ప్రస్తుతం టాలీవుడ్ కి ఫేవరెట్ షూటింగ్ స్పాట్ గా మారింది. తప్పకుండా ఈ లొకేషన్ రానున్న రోజుల్లో మరింత బిజీ అయ్యేలా ఉంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రస్తుతం ఐదు సినిమాల షూటింగ్ జరుగుతున్నాయని తెలిసి ఆ ఏరియా మొత్తం ప్రేక్షకుల సందడి మొదలైంది. ఈ సినిమాలన్నీ కూడా ఒకదానికి మించి మరొకటి అనిపించేలా ఉన్నాయి. తప్పకుండా ఈ లొకేషన్ షూటింగ్ చేస్తే సినిమాలకు కూడా ఎంతో ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. అల్యూమినియం ఫ్యక్టరీ ఎందుకంత స్పెషల్ అన్నది ఇప్పటికే చాలా సినిమాల్లో చూశాం రానున్న సినిమాల్లో కూడా చూడబోతున్నామని చెప్పొచ్చు. Movies, Mahesh Babu, Rajamouli, Prabhas, Alluminiym Factory, Tollywood
Garlic | చలికాలం వచ్చేసింది అంటే చలి, దగ్గు, జలుబు, అలసటలతో చాలా మందికి ఇబ్బందులు మొదలవుతాయి. ఈ సమయంలో…
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
This website uses cookies.